Sunday, July 7, 2024
Homeహెల్త్Cheers with Chia seeds : చియాతో చీర్స్ చెప్పండి

Cheers with Chia seeds : చియాతో చీర్స్ చెప్పండి

ఇది ఒక సూపర్ ఫుడ్, మీకు నచ్చినట్టు తినండి

చియా సీడ్స్ తో డిప్రషన్ పోతుంది. మధుమేహ నియంత్రణా చికిత్సకు ఉపయోగపడే సూపర్ ఫుడ్ గా కూడా చియా గుర్తింపుపొందింది. ఇక ఈ గింజల వల్ల పొందే హెల్త్ లాభాలకు అంతే లేదు.

- Advertisement -

చియా గింజల గురించి వినే ఉంటారు. వీటి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. అందుకే ఈ గింజల్ని సూపర్ ఫుడ్ అంటారు. చియా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, యాంటాక్సిడెంట్లు, కాల్షియం లాంటి ఖనిజాలు ఎన్నో ఉన్నాయి. బరువు తగ్గడం నుంచి బ్లడ్ షుగర్ ప్రమాణాలను నియంత్రించడం వరకూ ఈ గింజలు ఉపయోగపడతాయి. వీటని తినడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉండడంతో పాటు జీవక్రియ కూడా బాగా జరుగుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇందులో ఉన్న పోషక గుణాలకు అంతే లేదు. ఈ గింజలు చిన్నవి. తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇవి మెక్సికో, గౌటిమాలాల నుంచి ఇప్పుడు అన్ని దేశాలకూ వ్యాప్తిచెందాయి.

ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. నిత్యం వీటిని మీ సమతులాహారంలో భాగంగా తీసుకుంటే మంచిదని పోషకాహారనిపుణులు చెపుతున్నారు. చియా సీడ్స్ ను మితంగా తీసుకోవాలి. అలాగే నువ్వులు, ఆవాలతో ఎలర్జీ ఉన్న వాళ్లు వాటితో చియా గింజలను తీసుకోవద్దు. పూర్వం యుద్ధ వీరులు బలం కోసం వీటిని తినేవారని నానుడి. మయాన్ భాషలో చియా అంటే బలం (స్ట్రెంగ్త్) అని అర్థంట. ఈ గింజలు అన్ ప్రొసెస్డ్. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో చియా గింజల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనన్ని అని కూడా తేలింది.

చియా గింజలు గింజల్లో ఏమున్నాయంటే..
ఒక సర్వింగ్ చియా గింజల్లో పలు పోషకవిలువలు ఉన్నాయి.

  • వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్నాయి.
  • సొల్యుబుల్ ఫైబర్ ఉంది
  • సొల్యుబల్ ఫైబర్ బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది. గట్ ఫ్రెండ్లీ బాక్టీరియాను అందిస్తుంది. సింగిల్ సర్వింగ్ చియా సిడ్స్ నిత్యం మీరు తీసుకునే పీచుపదార్థాల్లో మూడవ వంతు పీచును అందిస్తాయి.
  • ఈ గింజల్ని రకరకాల రెసిపీల్లో వాడచ్చు. వీటిల్లో అధిక మోతాదుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉండి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వంద గ్రాముల చియా గింజల్లో 485 కాలరీలు ఉన్నాయి. ఫ్యాట్ 31 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 42 గ్రాములు ఉన్నాయి. అంతేకాదు 22 రకాల ఎమినో యాసిడ్స్ లో 18 రకాలు వీటిల్లో ఉన్నాయి.
  • తొమ్మిది రకాల ఎసెన్షయిల్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి.
  • చియా గింజల్ల వల్ల పొందే ఆరోగ్య లాభాలెన్నోః
  • వీటి వల్ల పొందే ప్రధమ లాభం బరువు తగ్గడం. అందుకే చాలామంది ఈ గింజల్ని తమ డైట్ లో ఎక్కువగా వాడుతున్నారు. ఈ గింజల్లో అధిక పాళ్లల్లో పీచు పదార్థాలు ఉండడం ఇందుకు కారణం. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్ని గ్లాసుడు నీళ్లల్లో వేసి బాగా కలపాలి. కొద్ది నిమిషాల తర్వాత అవి నీటిలో ఉబ్బకుండా ఆ నీటిని తాగేయాలి. ఈ గింజల్ని ఎక్కువ సేపు నీటిలో ఉంచితే అవి నీటిని గ్రహించి ఉబ్బుతాయి. ఈ గింజల్లోని ఫైబర్ వల్ల కడుపు నిండినట్టు ఉండడమే కాకుండా
  • ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
  • చియా గింజల్లో ప్రొటీన్లు కూడా బాగా ఉన్నాయి. ఆకలి వేయదు. బరువు తగ్గుతాము.
  • వీటిల్లో ఫైబర్ బాగా ఉండడంతో అది కూడా తొందరగా కరిగిపోయే పీచు ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. అంతేకాదు జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
  • చియా గింజలు బ్లడ్ షుగర్ ని నియంత్రిస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మధుమేహ నియంత్రణా చికిత్సకు ఉపయోగపడే ఫుడ్ గా అమెరికా వ్యవసాయ శాఖ చియా గింజల్ని గుర్తించింది. మధుమేహ చికిత్సలో ఉపయోగపడే పోషక విలువలతో కూడిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిల్లో ఉండడం కూడా
    ఇందుకు మరో కారణం.
  • యుసిఎస్ఎఫ్ మెడికల్ సెంటర్ ప్రకటించిన రిపోర్టు ప్రకారం చియా సీడ్స్ లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంది. ఇది రొమ్ము కాన్సర్ ను నిరోధించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ విషయంలో ఎంతో సహాయపడతాయి.
  • ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. చియా సీడ్స్ లోని మొనోఅన్ శాచ్యురేటెడ్ కొలెస్ట్రాల్ ప్రమాణాలను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఫుడ్స్ లో చియా గింజలు ముందుంటాయని పోషకాహారనిపుణులు సైతం అంటున్నారు. ఒమేగా 3 యాసిడ్స్ బ్లడ్ లో ఉండే ఫ్యాట్ అయిన ట్రైగ్లిజరైడ్స్ ను కూడా తగ్గిస్తాయి.
    హృదయ స్పందనల్లోని లోపాలను క్రమబద్దీకరిస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి.
  • చియా సీడ్స్ జీవక్రియకు సంబంధించిన డిస్లిపిడిమియా అనే జబ్బు చికిత్సకు ఎంతగానో తోడ్పడతాయి. అంతేకాదు శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ ను సైతం ఈ గింజలు పెంచుతాయి.
  • చియా గింజల్లో విటమిన్ బి, జింకు, ఐరన్, మెగ్నీషియం ఉన్నాయి. ఇవి శరీరంలో ఎనర్జీని పెంచుతాయి. మీకు నచ్చిన స్మూదీల్లో సైతం చియా సీడ్స్ వేసుకొని తినొచ్చు. ఇవి జీవక్రియను పెంచుతాయి కూడా.
  • చియా గింజల డ్రింకు వర్కవుట్ డ్రింకుగా కూడా ఎంతో ఉపయోగపడతుంది. వీటిల్లో ఒమేగా 3 యాసిడ్స్ ఉండడంతో స్టామినా డ్రింకుగా బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుంది.
  • చియా సీడ్స్ లో 19 శాతం ప్రొటీన్లు ఉంటాయి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కావడం వల్ల తొందరగా ఆకలి వేయదు.
  • చియా గింజలు మూడ్స్ ను కూడా ఉత్తేజపరుస్తాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మూడ్ , బిహేవియర్ ఎన్హాన్సర్లుగా బాగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని నిత్యం వాడాలి. ఇలా వాడడం వల్ల డిప్రషన్ కూడా తగ్గుతుంది.
  • చియా గింజల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కణాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో పనికి వస్తాయి. వీటివల్ల చర్మంపై ఏజింగ్ ఎఫెక్టు పడదు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News