Top Benefits of Chia seeds: చియా గింజలను మనం తరచుగా మార్కెట్‌లో చూస్తుంటాం. వీటిని సాధారణంగా సలాడ్స్, స్మూతీ, జ్యూస్‌లలో ఉపయోగిస్తుంటారు. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. ముఖ్యంగా చియా సీడ్స్‌లో ప్రోటీన్, మాంగనీస్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్, అధిక బరువు, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తాయి. అయితే చియా గింజలు డయాబెటిస్, అధిక బరువు వారికి ఎలా సహాయపడుతాయి? అనే వివరాలు గురించి తెలుసుకుందాం.
డయాబెటిస్ నియంత్రణలో చియా గింజల పాత్ర:
చియా గింజలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. చియా గింజల్లో ఒమేగా-3. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ ప్రతిరోజు చియా గింజలు తినడం వల్ల ఇందులో ఉండే ఒమేగా-3, ఫైబర్, మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
అధిక బరువు సమస్యకు చియా సీడ్స్:
అధిక బరువు అనేది ఆరోగ్య సమస్యలకు మూలం. బరువు తగ్గించడంలో చియా గింజలు సహాయపడుతాయి. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ కడుపు నింపిన భావనను కలిగిస్తాయి. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఈ గింజల్లో తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి మంచి ఆహారం. ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. చియా గింజలు తినడం వల్ల ఆకస్మిక ఆహార కోరికలు తగ్గుతాయి.
ఎలా ఉపయోగించుకోవాలి:
చియా గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిని స్మూతీ, జ్యూస్‌లలో ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు పెరుగు లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవడం మంచిది. లేదంటే ఇంట్లోనే చియా పుడ్డింగ్ చేసుకొని తినవచ్చు.