Thursday, September 19, 2024
Homeహెల్త్Chia seeds: చియా గింజలతో చిక్కండి

Chia seeds: చియా గింజలతో చిక్కండి

బరువు తగ్గే పనిలో ఉన్నారా? అయితే మీ డైట్ లో తప్పనిసరిగా చియా గింజలు చేర్చాల్సిందే. ఎందుకంటే… బరువు తగ్గించడంలో చియా గింజలు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఈ గింజల్లో పీచుపదార్థాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన ఒమేగా 3 ఫ్యాట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ గింజలను డైట్ లో ఎలా చేర్చాలంటారా? శరీరంలోని అదనపు కాలరీలను కరిగించడంలో చియా గింజలు బాగా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే వీటిని సరైన పరిమాణంలో వినియోగించినప్పుడే వీటి పూర్తి ప్రయోజనాలను మనం పొందగలమని మరవకూడదు. చియా గింజలు పొట్టదగ్గర చేరిన కొవ్వును కూడా కరిగిస్తాయి.

- Advertisement -

వీటిని సలాడ్లు, స్మూదీలు, డెజర్టులు వంటి ఎన్నో పదార్థాలలో వాడొచ్చు. వందగ్రాముల చియా గింజలు తీసుకోవడం వల్ల రోజులో 34 శాతం మేర పీచుపదార్థాల శరీరానికి అందుతుంది. పీచుపదార్థాల వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. జీర్ణక్రియ బాగా జరగడం వల్ల బరవు కూడా తగ్గుతాం. వీటిల్లోని ఆరోగ్యకరమైన ఫ్యాట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా. నానబెట్టిన చియా గింజలను పెరుగులో, సిరియల్స్ లో, మఫిన్ రెసిపీల్లో వాడతారు. రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలు తీసుకుంటేచాలు. వీటి నుంచి శరీరానికి కావలసిన గరిష్ఠ శాతం ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. వీటిని ఎక్కువ మొత్తంలో వాడకూడదని గుర్తుంచుకోండి. ఈ డైట్ లో మార్పుచేర్పులు డైటీషియన్ సూచనలకనుగుణంగా చేసుకోవాలి. గింజలు లాగ కాకుండా వీటిని పొడి చేసి తినే డైట్ లో చేరిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎలా అంటారా? శరీర బరువు తగ్గడానికి చియా గింజలను పొడి చేసి సూపులో కలుపుకుని తాగొచ్చు.

కూరగాయలతో కలిపి బ్లెండ్ చేసి స్మూదీలా చేసుకుని తీసుకోవచ్చు. ఉదయం తాగే డిటాక్స్ వాటర్ లో కూడా చియా గింజల పొడిని కలిపి తాగొచ్చు. సలాడ్లు, గ్రేవీలపై చియా పొడిని చల్లొచ్చు. బ్రెడ్డు తయారుచేసేటప్పుడు అందులో చియా గింజల పొడి కలపొచ్చు. మీరు తీసుకునే డైట్ లో పోషక విలువలతో కూడిన చియా గింజల పొడి కలిపి హెల్దీ డైట్ ఆరగించండి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News