Homeహెల్త్chia vs sabja seeds: చియా గింజలా? సబ్జా గింజలా? మీ శరీరానికి ఏది బెస్ట్?...

chia vs sabja seeds: చియా గింజలా? సబ్జా గింజలా? మీ శరీరానికి ఏది బెస్ట్? నిజం ఇదే

chia vs sabja seeds: చియా గింజలు, సబ్జా గింజలు బయటకు చూస్తే ఒకేలా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి ఇచ్చే ప్రయోజనాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చాలా మంది ఈ రెండు గింజలను ఒకటే అనుకుని ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి రెండు వేర్వేరు గింజలు. వాటి పోషకాలు, శరీరంపై చూపే ప్రభావం కూడా వేరు. కాబట్టి మన శరీరానికి ఏ అవసరం ఉందో తెలుసుకుని వాడితేనే మంచి ఫలితం వస్తుంది. జీర్ణక్రియ మెరుగుపరుచుకోవాలా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా, లేక ప్రోటీన్ పెంచుకోవాలా అనే అవసరాన్ని బట్టి ఈ గింజలను ఎంపిక చేసుకోవాలి.

- Advertisement -

చియా గింజల ప్రయోజనాలు

చియా గింజలు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిపోయి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఉండే ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. అధికంగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారికి చియా గింజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

చియాలో ఉండే ప్రోటీన్, మినరల్స్

చియా గింజలు కంప్లీట్ ప్రోటీన్ కలిగిన వృక్ష ఆహారం. అంటే మన శరీరానికి అవసరమైన 9 అవసరమైన అమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారంలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్లకు చియా గింజలు మంచి ప్రోటీన్ సోర్స్ అవుతాయి. అలాగే ఇందులో ఉండే మాగ్నీషియం, కాపర్, సెలీనియం వంటి మినరల్స్ శరీరానికి ఎనర్జీ ఇవ్వడంలో సహాయం చేస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రణలో కూడా ఇవి కొంతవరకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read Also: Best Camera Phone: స్టూడెంట్స్ కోసం ఐకూ, క్రియేటర్స్ కోసం షియోమీ.. ఈ రెండింటిలో మీ ఛాయిస్ ఏంటి?

సబ్జా గింజల ప్రత్యేకత

సబ్జా గింజలు ముఖ్యంగా శరీరాన్ని చల్లబరచే గుణం కలిగి ఉంటాయి. వేసవి కాలంలో చాలా మంది వీటిని పానీయాల్లో కలిపి తాగుతుంటారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు సబ్జా గింజలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా కొనసాగించడంలో సహాయం చేస్తుంది. అందుకే కడుపు సమస్యలు తరచుగా వచ్చే వాళ్లు వీటిని తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి సబ్జా గింజల ప్రయోజనం

సబ్జా గింజల్లో ఫ్లావనాయిడ్స్, పాలీఫినాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొటిమలు, చర్మ ఇర్రిటేషన్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు సబ్జా గింజలను తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేద సంప్రదాయాల్లో కూడా సబ్జా గింజలను శరీరాన్ని చల్లబరచే ఆహారంగా చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

ఎలా ఉపయోగించాలి?

చియా గింజలు గానీ సబ్జా గింజలు గానీ ఒకదాన్ని వదిలి మరొకటి మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండు గింజలు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కానీ వాటి ప్రయోజనాలు వేరు. చియా గింజలను సాధారణంగా 30 నిమిషాలు నీటిలో నానబెట్టి స్మూతీస్ లేదా ఓట్స్‌లో కలిపి తీసుకోవచ్చు. సబ్జా గింజలు మాత్రం 10 నుండి 15 నిమిషాలు నానబెట్టిన తరువాత నిమ్మరసం నీటిలో లేదా ఇతర పానీయాల్లో కలిపి తీసుకుంటే మంచిది. సరైన విధంగా తీసుకుంటే ఈ రెండు గింజలు కూడా మన ఆరోగ్యానికి మంచి సహాయం చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News