చేమంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి ఒంటిపై దురదునశీ చోట రాస్తే దురద తగ్గిపోతుంది. నోటిపూత ఉంటే నోటిలోపల రాస్తే కూడా తగ్గుతుంది. చేమంతి ఆకులను నేతిలో వేడిచేసి వాటిని నుదుటుమీద, కణతల మీద కడితే తలనొప్పి, కళ్లు తిరగడం తగ్గుతుంది. చేమంతి ఆకులు, పూలతో కషాయం చేసి వాటిని గాయాలు, కురుపుల మీద రాస్తే తగ్గుతాయి. చేమంతి ఆకులు చేసిన కషాయం ఒక ఔన్స్ ఉదయం తీసుకుంటే జీర్ణక్రియ బాగా అవుతుంది.