Saturday, November 23, 2024
Homeహెల్త్Cold and cough with fruits?: పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తాయా?

Cold and cough with fruits?: పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తాయా?

పళ్లు అతిగా తింటే మాత్రమే ఈ సమస్యలు

పండ్లు తింటే దగ్గు, జలుబు వస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఈ పరిస్థితి తలెత్తుతుందని చాలామంది భావిస్తుంటారు. చాలా పండ్లల్లో స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర అవసరాలను తీర్చడమే కాకుండా శరీరాన్ని బలంగా ఉంచుతాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం పండ్లు కోల్డ్ ఫుడ్. వీటి వల్ల దగ్గు, జలుబులు వస్తాయి. ఇవి శరీరంపై వాత, పిత్త, కఫ ప్రభావాన్ని చూపుతాయి. వీటిని తరచూ తినడం వల్ల ఫ్లూ, దగ్గు, జలుబు బారిన పడతామంటారు ఆయుర్వేద నిపుణులు. కానీ ఈ పరిస్థితి పండ్లను ఎక్కువగా తింటే తలెత్తుదంటారు.

- Advertisement -

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనల్లో పైనాపిల్, అరటిపండు వంటి వాటిల్లో పోషకాలు, ప్రొటీన్లు, యాంటాక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండడంతో పాటు ఇవి శరీరంలో మంట, వాపులను తగ్గిస్తాయని వెల్లడిస్తున్నాయి. అంతేకాదు జలుబు, దగ్గులను తగ్గించేలా మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుందటున్నారు. ముఖ్యంగా మీరు తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా మాత్రం చూసుకోవాలంటున్నారు కొందరు పోషకాహార నిపుణులు. అలాగే రోజులో ఏ టైములో, ఎంత పరిమాణంలో పండ్లు తీసుకుంటున్నారన్నది కూడా ముఖ్యమని సూచిస్తున్నారు. మరి జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పండ్లు తినొచ్చా?తినొచ్చు తప్పు లేదంటున్నారు. కానీ ఏ పండ్లు తింటున్నారు, ఎలాంటి సమయంలో తింటున్నారన్నది మటుకు తెలిసి తీసుకోవాలని చెపుతున్నారు.

ఉదాహరణకు కమలాలు, నిమ్మ, ఉసిరి వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అంతేకాదు సీజనల్ గా తలెత్తే అనారోగ్యాల నివారణలో కావలసిన రోగనిరోధకశక్తిని అందిస్తాయి కూడా. అయితే క్రానిక్ ఎసిడిటితో బాధపడేవాళ్లకు మాత్రం ఇవి సరిపడవు. ఇలాంటి వారు ఈ పండ్లు తినడం వల్ల వాటిల్లోని సిట్రిక్ యాసిడ్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను బాగా పెంచుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే, పండ్లల్లో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. కానీ వీటిని అతిగా తింటే మాత్రం బ్లడ్ షుగర్ ప్రమాణాలు గాడి తప్పుతాయి. అంతేకాదు శరీరంలోని సహజసిద్ధమైన రోగనిరోధక గుణంపై సైతం ఇది ప్రభావం చూపుతుంది. అందుకే డైట్ విషయంలో మీ వయసు, మీకున్న అనారోగ్య సమస్యలు, సీజన్, ఇతరత్రా అన్ని అంశాల కనుగుణంగా పోషకాహార నిపుణుల సలహా తీసుకుని పండ్లను తింటే మంచిదంటున్నారు కొందరు నిపుణులు.


చాలామందిని వేధించే మరో సందేహం ఏమిటంటే రాత్రి పూట పండ్లను తినొచ్చా అని. అందులోనూ డిన్నర్ తీసుకున్నతర్వాత తినొచ్చా అని కూడా చాలామంది అనుమానపడుతుంటారు. రాత్రి వేళ్లల్లో మన శరీరం పనితీరు మందగిస్తుంది. పైగా రాత్రి వేళల్లో పండ్లను తినడం వల్ల వైరల్ ఇన్ఫక్షన్లకు గురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే డిన్నర్ సమయంలో ముఖ్యంగా పండ్లను తినొద్దని పెద్దవాళ్లు చెపుతుంటారు. కానీ ఇది తప్పంటున్నారు నిపుణులు. రాత్రి పూట పండ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సమతుల పరిమాణంలో మాత్రమే పండ్లను తినాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News