కార్న్ కాఫీ…ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ కాఫీని ఎంతోమంది అమెరికన్లు ఇపుడు తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులకు ఇది తీయని వార్త అనడంలో సందేహం లేదు. అందులోనూ ఈ కార్న్ కాఫీని స్వీట్ కార్న్ తో చేశారు.
కోల్డ్ అండ్ హాట్ రెండు రకాలుగా కార్న్ కాఫీ డిలైట్ కాఫీ ప్రియులను అలరింస్తోంది. ఈ కాఫీని ఇండస్ట్రీ నిపుణులో లేదా చెఫ్స్ తయారు చేశారనుకుంటే పొరబడ్డారన్నమాటే. ఇంట్లో ఎవరైనా దీన్ని తయారు చేసుకోవచ్చుట. ఎథాన్ రోడ్ అనే వీడియో క్రియేటర్ ఈ కార్న్ కాఫీ స్రుష్టికర్త. ఈ స్వీట్ కార్న్ లెట్టేని ఎథాన్ రోడ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. విస్కాన్సిన్ లో మొక్కజొన్నలు ఎక్కువగా ఉండడాన్ని గురించి వివరిస్తూ దీన్ని తయారు చేయడం ద్వారా ఆ ప్రాంత మూలాలను పదిలం చేసుకున్నట్టు ఎథాన్ చెపుతున్నాడు.
మొక్కజొన్నలు, చక్కెర, నీళ్లు మూడింటినీ కలిపి ఎథాన్ బ్లెండ్ చేశాడు. ఆ మిశ్రమాన్ని వొడగట్టి స్వీట్
కార్న్ సిరప్ ను రెడీ చేశాడు.ఆ సిరప్ తో స్వీట్ కార్న్ కోల్డ్ ఫోమ్ ను తయారు చేశాడు. తర్వాత తాజాగా కప్ ఆఫ్ ఎక్స్ ప్రెసో తయారుచేశారు. ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్, పాలు, చల్లటి కార్న్ ఫోమ్, ఆ తర్వాత తాజా ఎక్స్ ప్రెసోలను ఒకదాని తర్వాత ఒకటి ఆ గ్లాసులో పోశాడు. గ్లాసులోని ఈ పదార్థాల మిశ్రమాన్ని మెల్లగా కలిపి దాన్ని తాగుతూ ఆ రుచిని బాగా ఎంజాయ్ చేశాడు. ఆ రీల్ను ఇన్
స్ట్రాగ్రామ్ రీల్ను ఇన్స్టాగ్రామ్ లో ఎథాన్ పెట్టాడు. దాన్ని మూడు మిలియన్ల మందికి పైగా చూశారు. ఇంకేముంది వారంతా ఈ కార్న్ కాఫీ రుచిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు రకరకాల దేశాల్లో లభించే వివిధ రకాల కాఫీ డ్రింకులతో పోల్చారు. మరికొందరు ఈ కార్న్ కాఫీ డిలైట్ ని బాగా ఆస్వాదించారు. దాని రుచిని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకొందరు తొందరలో తాము కూడా ఈ కాఫీని
తయారు చేయనున్నట్టు కామెంట్లు పెడితే, ఇంకొందరు ఈ కార్న్ కాఫీపై దాల్చిన చెక్క పొడి కూడా చల్లి మరింత ఎంజాయ్ చేస్తామని కామెంట్ చేశారు.
మరికొందరైతే దీని రుచికి మైమరిచిపోయారు. మరి మీరు కూడా స్వీట్ కార్న్ తో చేసిన కార్న్ కాఫీ డిలైట్ ను ఈ వింటర్ లో ఎంజాయ్ చేయండి…