Saturday, November 23, 2024
Homeహెల్త్Cranberries: ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండిలా

Cranberries: ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టండిలా

క్రేన్బెర్రీస్ ని సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఎలా సూపర్ ఫుడ్ అంటే.. వీటిల్లో పీచు, పిండిపదార్థాలు బాగా ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. ఫెనోల్స్ అనే యాంటాక్సిడెంటు కూడా క్రేన్ బెర్రీల్లో ఉన్నాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంది. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే

- Advertisement -

 శరీరంలో కాన్సర్ వేగంగా వ్యాప్తి అవకుండా ఇవి అడ్డుకుంటాయి.

 వీటిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి.

 కాలేయం జబ్బుల బారిన పడకుండా ఈ బెర్రీస్ సంరక్షిస్తాయి.

 రక్తపోటును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి.

 కంటిచూపును పటిష్టం చేస్తాయి. కాటరాక్టు, ఆర్త్రైరైటిస్ వంటి వాటిని అడ్డుకుంటాయి.

 కార్డియోవాస్క్యులర్ హెల్త్ కు కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

 మూత్రనాళం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నియంత్రిస్తాయి.

 జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి కూడా క్రేన్బర్రీస్ ఎంతగానో తోడ్పడతాయి.

 నోటి జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. దంతక్షయం నుంచి పరిరక్షించడంతోపాటు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

 ఉదర కాన్సర్, అల్సర్లు తలెత్తకుండా నిరోధిస్తాయి. వైద్యుల సూచనలతో క్రేన్ బెర్రీలను తినడం, లేదా క్రేన్ బెర్రీ జ్యూసు తాగడం వల్ల కాన్సర్ వేగాన్ని నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు.

 క్రేన్ బెర్రీల్లో పోషకాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరారోగ్యాన్ని కాపాడతాయి.

డైట్ గా…

ఎండబెట్టిన క్రేన్బెర్రీస్ ను తినొచ్చు. మీరు తీసుకునే డైట్ లో కూడా వీటిని వాడొచ్చు. సలాడ్స్ , ఓట్మీల్స్ లో వీటిని చల్లుకోవచ్చు. స్మూదీల్లో కలపొచ్చు. క్రేన్ బెర్రీస్ తో సాస్ లేదా జెల్లీ చేసుకోవచ్చు. టోస్టు, బిస్కట్లు, ప్యాన్ కేక్స్, టర్కీ శాండ్విచ్ పై ఈ సాస్ లేదా జెల్లీ రాసుకుని తినొచ్చు. బేక్డ్ ఫుడ్స్ లో కూడా వీటిని వాడొచ్చు. వీటిలో కాలరీలు బాగానే ఉంటాయి. వీటితో చేసిన పలు ఉత్పత్తుల్లో చక్కెరపాళ్లు ఎక్కువ వాడతారు. క్రేన్ బెర్రీస్ ను పరిమితంగానే తినాలి. వైద్యుల సలహా ప్రకారం వీటిని వాడడం మంచిది. ఎక్కువ మోతాదులో వీటిని తింటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందంటారు వైద్యులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News