Tuesday, September 17, 2024
Homeహెల్త్Dandruff ?: ఏం చేసినా చుండు తగ్గట్లేదా?

Dandruff ?: ఏం చేసినా చుండు తగ్గట్లేదా?

ఇంట్లో చిట్కాలు చుండ్రు తగ్గించేందుకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి

చుండ్రును తగ్గించే సులువైన చిట్కాలు..

- Advertisement -

చుండ్రుతో బాధపడుతున్నారా? ఇందుకు సింపుల్ వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి తలకు నూనె రాసుకుంటే దాన్ని ఎక్కువ సేపు ఉంచుకోకూడదు. వెంట్రుకలకు నూనె రాసుకుంటే
చుండ్రు తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. నూనె తలకు పట్టించుకోవడం వల్ల చుండ్రు సమస్య మరింత ఎక్కువవుతుంది. దురద, పొడిచర్మం ఉన్నవారు వెనిగర్ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది చుండ్రుకు కారణమైన బాక్టీరియాను, ఫంగస్ ను లేకుండా చేస్తుంది. వెనిగర్ లోని ఎసిడిక్ కంటెంట్ తలలో పొట్టురాలడాన్ని తగ్గిస్తుంది. అందుకే తలస్నానం
చేయడానికి అరగంట ముందు వైట్ వెనిగర్, నీళ్లను రెండింటినీ సమపాళ్లల్లో తీసుకుని మాడుకు రాసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బేకింగ్ సోడా కూడా ఈ సమస్యను బాగా పరిష్కరిస్తుంది. బేకింగ్ సోడాను మాడుకు రాసి సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది మాడుపై ఉన్న మ్రుతకణాలను పోగొడుతుంది.

బేకింగ్ సోడా మంచి ఎక్స్ ఫొయిలెంట్. దీంట్లో యాంటిఫంగల్ సుగుణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును శక్తివంతంగా నివారిస్తాయి. ఇది మాడుకు సాంత్వననివ్వడమే కాకుండా దురద, దద్దుర్లు లాంటివి రాకుండా
నివారిస్తుంది. మీరు చేయాల్సిందేమిటంటే తలకు షాంపు పెట్టుకునేటప్పుడు షాంపులో కాస్త బేకింగ్ సోడా కలిపి తలకు అప్లై చేసుకుంటే చాలు బేకింగ్ సోడా వల్ల వచ్చే లాభాలన్నీ పొందగలుగుతారు. మాడుపై బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చుండ్రు వస్తుంది. దీన్ని నివారించడానికి వేప కూడా బాగా పనిచేస్తుంది. అయితే దీన్ని తలకు అప్లై చేసేముందు కాస్త పలుచన చేసి రాసుకోవాలి. నీళ్లల్లో వేప ఆకులు ఉడకబెట్టి అప్లై చేసుకుంటే మంచిది. గాఢమైన వేప నీళ్లు వాడితే చర్మం ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంది. వేపలో యాంటిఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది చుండ్రు నివారించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.


ఇంకొక సహజమైన చిట్కా ఉంది. మీరు వాడే షాంపులో ఒకటి లేదా రెండు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి తలకు పట్టించుకుంటే కూడా చుండ్రు తగ్గుతుంది. వెల్లుల్లి లో కూడా యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.
ఇది కూడా చుండ్రును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా చేసి అందులో నీటిని కాస్త జోడించాలి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే వెంటనే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వెల్లుల్లి వాసన సమస్య ఉంటుంది కాబట్టి కాస్త తేనె, అల్లం కూడా అందులో చేరిస్తే ఇబ్బంది ఉండదు. అలొవిరా కూడా మాడుకు బాగా పనిచేస్తుంది. ఇందులో మాడుకు సాంత్వన నిచ్చే
గుణంతో పాటు కాస్త ఎక్స్ ఫొయిలేట్ స్వభావం కూడా దీనికి ఉంది. అంతేకాదు అలొవిరాలోని యాంటి ఫంగల్, యాంటి బాక్టీరియల్ సుగుణాలు కూడా ఉన్నాయి. అలొవిరా జెల్ ను దాని ఆకు నుంచి
నేరుగా తీసి మాడుకు రాసుకోవాలి. తర్వాత మెడికేటెడ్ యాంటి డాండ్రఫ్ లేదా మైల్డ్ షాంపు తో తలను శుభ్రంగా కడుక్కోవాలి.

అలొవిరా మాడులో తలెత్తే దురదను తగ్గిస్తుంది. వాపు నుంచి సాంత్వననిస్తుంది. ఇవన్నీ చేసుకునే సమయం లేనివారు మీ సమీప స్టోర్ లో వేపతో చేసిన షాంపు దొరుకుతుంది. వేపలో ముందే చెప్పుకున్నట్టు యాంటిఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి కాబట్టి చుండ్రును నివారించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. వేప షాంపుతో వారానికి రెండు లేదా మూడుసార్లు తల
రుద్దుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News