Friday, November 22, 2024
Homeహెల్త్Dandruff: వింటర్ లో చుండ్రు వేధిస్తోందా..

Dandruff: వింటర్ లో చుండ్రు వేధిస్తోందా..

చల్లదనం, పొడారిపోవడం వంటి లక్షణాల వల్ల చలికాలంలో రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంటాం. అలాంటి వాటిల్లో జుట్టుకు సంబంధించిన చుండ్రు సమస్య ఒకటి. శీతాకాలంలో చాలామంది ఈ చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. దీనికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి.

- Advertisement -

వేపాకు చుండ్రుకు బాగా పనిచేస్తుది. వేపాకుల్లో యాంటిబాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే యాంటీ ఇన్ఫ్ల్ మేటరీ, యాంటి ఫంగల్ సుగుణాలు కూడా వీటిల్లో ఉన్నాయి. వేపాకుల పేస్టు తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాదు మాడుపై ఉండే ఇన్ఫ్ల్ మేషన్ కూడా తగ్గుతుంది.

ఎండిన వేపాకులు కొన్ని తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయుల్ ని కలపాలి. ఆకులు మెత్తగా అయే దాకా ఆ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి . అది పేస్టులా తయారయ్యాక దాన్ని మాడుకు పట్టించి అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలను బాగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య పోతుంది.

చుండ్రుపై బాగా పనిచేసే ఇంకొక వంటింటి స్క్రబ్ కూడా ఉంది. అదే తేనె, కొబ్బరి స్క్రబ్. దాన్ని మాడుకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. జట్టులోని చుండ్రు, దురద సమస్య పోయి వెంట్రుకలు నిగ నిగ లాడతాయి. ఇందుకు చేయాల్సిందల్లా ఒక గాజు బవుల్ లో రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్, రెండు టీ స్పూన్ల కొబ్బరినూనె, రెండు టీ స్పూన్ల పెరుగు, రెండు టీస్పూన్ల తేనె వేసి మెత్తటి మిశ్రమంలా చేయాలి. దాన్ని తలపై రాసుకుని మసాజ్ చేసుకొని 40 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపుతో తలను శుభ్రంగా కడిగేసుకోవాలి.

కొబ్బరి నూనె తలకు రాసుకున్నా చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది కూడా. మొదట షాంపుతో వెంట్రుకలను బాగా శుభ్రం చేసుకోవాలి. జట్టు పొడారిపోయాక కొద్దిగా కొబ్బరి నూనెను మాడుకు రాసుకొని కొన్ని నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత జుట్టును మళ్లీ నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చుండ్రు పోవడమే కాదు శిరోజాలకు కావలసినంత తేమ అందుతుంది.

మాడుపై చేరిన చుండ్రుతో పాటు దురదను పోగొట్టడంలో కూడా టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఈ తైలాన్ని వారానికి ఒకసారి తలకు రాసుకుంటే చాలు. మీరు వాడే రెగ్యులర్ షాంపులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయుల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దానితో వెంట్రుకలను శుభ్రంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే తలలో చుండ్రు ఛాయలు ఉండవు.

వంటింట్లో లభ్యమయ్యే పెరుగు కూడా చుండ్రు సమస్యను శక్తివంతంగా పరిష్కరిస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చుండ్రును పూర్తిగా పోగొడుతుంది. అంతేకాదు వెంట్రుకలను కుదుళ్ల నుంచి అంచుల వరకూ బలంగా ఉండేలా చేస్తుంది. అందుకే పెరుగును తలకు పట్టించి నాలుగు నిమిషాల పాటు తలను సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత పదిహేను నిమిషాలు జట్టును అలాగే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మీ జుట్టు చలికాలంలో చుండ్రు సమస్య లేకుండా నల్లగా నిగ నిగలాడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News