Saturday, November 15, 2025
Homeహెల్త్Diabetes Diet Idli Dosa: డయాబెటిస్‌ రోగులు ఇడ్లీ-దోస తినకూడదా?.. మీ సందేహానికి సమాధానమిదే..!

Diabetes Diet Idli Dosa: డయాబెటిస్‌ రోగులు ఇడ్లీ-దోస తినకూడదా?.. మీ సందేహానికి సమాధానమిదే..!

Diabetes Diet Idli Dosa: చెడు ఆహారపు అలవాట్లతో డయాబెటిస్‌ భారీన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, డయాబెటిస్ ఉన్న ఇవి తినాలి, ఇవి తొనొద్దంటూ డాక్టర్లు చెబుతుంటారు. మరి, మనం నిత్యం ఉదయాన్నే తినే ఇడ్లీ-దోస తినడం మంచిదేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఇడ్లీ, దోసెలు చాలా ఫేమస్‌ వీటిని పులియబెట్టిన పిండితో తయారు చేస్తారు. దాదాపు అందరి ఇళ్లలోనూ ఎక్కువగా ఇడ్లీ, దోసె వంటి టిఫిన్లు చేసుకుని, వాటిని చట్నీ, సాంబార్‌తో ఇష్టంగా తింటారు. ఇడ్లీలు, దోశలు పులియబెట్టిన ఆహారాలు కాబట్టి, ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. బియ్యం, మినప్పప్పు నుండి ప్రోటీన్లు, బి విటమిన్లు, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇడ్లీలు తక్కువ కొవ్వుతో ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతాయి, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా మంచివి. ముఖ్యంగా ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఇడ్లీ తినాలని వైద్యులు కూడా సూచిస్తారు. కానీ, చాలా మంది మధుమేహంతో బాధపడేవారు వీటిని తినడానికి వెనుకాడతారు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇడ్లీ, దోసెలు తినకూడదని వారు అనుకుంటారు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇడ్లీ-దోస తినకూడదా? అనే విషయంపై హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఇడ్లీ, దోసెలు తినవచ్చు, కానీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

తృణధాన్యాలు వాడండి

సాధారణ బియ్యానికి బదులుగా జొన్న, రాగి, మిల్లెట్ వంటి తృణధాన్యాలను కలిపి ఇడ్లీ, దోసెలు చేసుకోవడం ద్వారా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించవచ్చు.

ఫైబర్ జోడించండి

ఇడ్లీని సాంబార్ లేదా కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల ఆహారంలో ఫైబర్ శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

తక్కువగా తినండి

ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.

పోర్షన్ కంట్రోల్

ఒకేసారి ఎక్కువ ఇడ్లీలు, దోసెలు తినడం మానుకోండి. తక్కువ సంఖ్యలో అల్పాహారం మాదిరిగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని గుర్తు చేస్తున్నారు.

వైద్యుడిని సంప్రదించండి

మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా కొత్త ఆహారం గురించి నిర్ణయం తీసుకునే ముందు మీ వైద్యుడిని లేదా డయాబెటిస్ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. వారి సలహాలతో ముందుకెళ్లండి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad