Sunday, July 7, 2024
Homeహెల్త్Did you try ABC juice?: ఏబీసీ జ్యూస్ ట్రై చేశారా?

Did you try ABC juice?: ఏబీసీ జ్యూస్ ట్రై చేశారా?

ఆరోగ్యాన్ని పెంచే ఎబిసి జ్యూసు
ఎబిసి జ్యూస్ గురించి తెలుసా? ఈ జ్యూసు తాగడం వల్ల పొందే లాభాలైతే చెప్పలేనన్నిట. ఇంతకూ ఎబిసి జ్యూసు అంటే యాపిల్ బీట్రూట్ కారట్ మిశ్రమ జ్యూసు అనమాట. ఈ జ్యూసు విటమిన్లు, ఎసెన్షియల్ న్యూట్రియంట్ల పవర్ హౌస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేనా ఈ జ్యూసు మీ అందాన్ని సైతం ఇనుమడింప చేస్తుందని సౌందర్యనిపుణులు చెపుతున్నారు. అంతేకాదు పర్ఫెక్ట్ డిటాక్స్ డ్రింకు కూడా ఇది. ఎబిసి జ్యూసు మీ చర్మాన్ని మెరిపిస్తుంది.

- Advertisement -

చర్మాన్ని ఆరోగ్యవంతంగా మలుస్తుంది. ఈ జ్యూసు తాగడం వల్ల పొందే లాభాలు చాలా ఉన్నాయి. ఒక గ్లాసు ఎబిసి జ్యూసు తాగడం వల్ల చర్మం యొక్క డల్ నెస్ పోవడమే కాదు ప్రిమెచ్యూర్ ఏజింగ్ రాకుండా మిమ్మల్ని యంగ్ గా కూడా ఉంచుతుంది. ఈ డ్రింకులో ఎన్నో ఎసెన్షియల్ విటమిన్లు ఉన్నాయి. ఇవి మీ శిరోజాలను పెరిగేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు పాయలు పలచబడకుండా సంరక్షిస్తుంది కూడా. ఎబిసి డ్రింకును నిత్యం తాగడం వల్ల చర్మం ఎంతో హైడ్రేటెడ్ గా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో చర్మం పొడారినట్టు అవుతుంది. అందుకే ముఖ్యంగా ఈ సీజన్ లో ఎబిసి జ్యూసు తాగితే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాదు మెరుపులు చిందిస్తుంది కూడా.

యాపిల్స్ లో నీరు ఎక్కువగా ఉండడంతో చలికాలంలో చర్మాన్ని పొడిబారకుండా ఈ పండు సంరక్షిస్తుంది. అంతేకాదు ఎబిసి డ్రింకు చర్మం స్కిన్ టోన్ సమంగా ఉండేలా పరిరక్షిస్తుంది. ఈ డ్రింకులో ఉపయోగించే బీట్రూట్ మంచి డిటాక్సిఫైయ్యర్. ఇది చర్మంలో చేరిన మలినాలను, విషతుల్యమైన పదార్థాలను బయటకు పోయేలా చేస్తుంది. చర్మం జిడ్డుకారకుండా సంరక్షిస్తుంది. అంతేకాదు ఎబిసి డ్రింకులో ఉన్న బీట్రూట్ యాక్నేపై పోరాడి దాన్ని నివారిస్తుంది. ఎబిసి జ్యూసు తాగడం వల్ల బరువు తగ్గుతాం. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాడీని ఈ జ్యూసు బాగా డిటాక్సిఫై చేస్తుంది. చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఎబిసి జ్యూసులో ఉపయోగించే యాపిల్స్ లో పీచుపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ వంటివెన్నో ఉన్నాయి.

యాపిల్ పండు జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జీర్ణక్రియ బాగా జరిగేలా చూడడంతో పాటు శరీర బరువు తగ్గేలా కూడా తోడ్పడుతుంది. ఇక బీట్రూట్ అయితే పోషకాల నిధి. ఇందులో కాలరీలు తక్కువగా ఉండడంతో పాటు బీట్రూట్ మన శరీరానికి కావలసిన ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ప్రొటీన్లను అందిస్తుంది కూడా. చివరిగా కారెట్ లో అయితే విటమిన్ ఎ సమ్రుద్ధిగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కారట్ చాలా మంచిది. కారట్ లో పొటాషియం, విటమిన్ బి6, బయొటిన్, ఫైబర్, విటమిన్ కెలుకూడా పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూసు తాగడం వల్ల విషయాన్ని వేగంగా గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం పెరుగుతుందని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని వైద్యనిపుణులు చెపుతున్నారు. అందుకే ఎబిసి జ్యూసును పోషకాహారనిపుణులు మిరకిల్ డ్రింకు అని కూడా అంటారు. వర్కవుట్ల చేసిన తర్వాత తాగాల్సిన ఆరోగ్యవంతమైన డ్రింకు ఇదని ఫిట్నెస్ నిపుణులు చెపుతున్నారు.

ఎబిసి జ్యూసు ఎలా చేసుకోవాలంటే…

కావలసినవిః మీడియం సైజు కారట్ ఒకటి, మీడియం సైజు బీట్రూట్ ఒకటి, మీడియం సైజు యాపిల్ ఒకటి, టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరగ్లాసు నీళ్లు.

తయారీః యాపిల్, బీట్రూట్, కారట్ లను బాగా కడగాలి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా తరిగి అందులో తగినన్ని నీళ్లు పోసి బ్లెండర్ లో వేసి బాగాకొట్టాలి. ఆ జ్యూసును వొడగట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూసు తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News