Thursday, November 21, 2024
Homeహెల్త్రాత్రి వేళ ఈ ఆహారాన్ని తింటున్నారా ? అయితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే !

రాత్రి వేళ ఈ ఆహారాన్ని తింటున్నారా ? అయితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే !

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. చాలామందికి సమయానికి సరైన ఆహారం తీసుకునే తీరిక ఉండటం లేదు. ఉద్యోగులు పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకి ఉండే మూడు షిఫ్టుల్లో ఏదో ఒక షిఫ్టులో పనిచేయాలి. అంటే రెండు పూటల సమయానికి ఆహారం తీసుకునే వీలుండదు. పని ముగించుకున్నాక వండుకుని తినడానికి శరీరం సహకరించదు. అందుకే చాలామంది Ready to Eat ఫుడ్స్ కే మొగ్గు చూపుతుంటారు. లేదంటే.. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటారు. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడటమే కాదు.. ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉంది.

- Advertisement -

ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారాలు తీసుకోవాలి. చాలామందికి ఉదయం గుడ్డు తినే అలవాటు ఉంటుంది. అందులో ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే మొలకలు, క్యారెట్స్ వంటివి తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇక రాత్రి వేళల్లో చాలామంది హెవీగా తింటుంటారు. దానివల్ల జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదం ఉంది.

నాన్ వెజ్ వంటకాలు, మసాలాలతో చేసిన కూరలు, బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి ఆహారాలను రాత్రి సమయాల్లో తినడం వల్ల అనారోగ్యం దరిచేరుతుంది. అంతేకాదు.. వీటిలో కొవ్వు పెంచేవి అధికంగా ఉంటాయి కాబట్టి బరువు పెరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే ఈ తరహా ఆహారం జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఉదయం పూట చాలా ఇబ్బందిపడుతుంటారు. అలాగే కూరగాయలలో బంగాళదుంపల తినడం అంతమంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

వైట్ రైస్ కి బదులుగా చపాతీలు లేదా పుల్కాలు, జొన్నరొట్టెలు తినడం ఉత్తమం. వీటితోపాటు పెరుగు, స్వీట్లు, చాక్లెట్లు, పుల్లని పండ్ల రసాలు, టమాటా సాస్, పిజ్జా, కాఫీ, టీ లాంటి వాటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. ఈ ఆహారాలు తినడం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అరగదు. కాబట్టి రాత్రివేళల్లో వీలైనంత వరకూ ఈ ఆహారాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News