Saturday, November 15, 2025
Homeహెల్త్Dry Fruits: ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటున్నారా..?

Dry Fruits: ఆరోగ్యానికి మంచిదని డ్రై ఫ్రూట్స్ అధికంగా తింటున్నారా..?

Dry Fruits Disadvantages: మన డైట్ లో డ్రై ఫ్రూట్స్ ని చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల శరీరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అనేక ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఏదైనా అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్‌కు కూడా వర్తిస్తుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ ని అధికంగా తీసుకోవడం వల్ల గుండె, మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ డ్రై ఫ్రూట్స్ ను అధికంగా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

వాల్‌నట్స్

మన డైట్ లో వాల్‌నట్స్ ను చేర్చుకుంటే గుండె, మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతాం. తరచుగా వాల్‌నట్స్ తినడం వల్ల కొంతమందిలో అపానవాయువు, గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు వస్తాయి. కొంతమందికి వాల్‌నట్స్ తింటే అలెర్జీ సమస్యలు రావచ్చు. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.

పిస్తాపప్పులు

పిస్తాపప్పులలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే, వాల్‌నట్స్ లాగానే పిస్తాపప్పులలో కూడా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. ఇందులో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఉప్పు కలిపిన పిస్తాపప్పులు తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు రోగులకు ఎంతో హానికరం.

Also read: Gardening Tips: వర్షాలకు మొక్కలు పాడవకుండా ఉండాలా..? ఈ టిప్స్​ ట్రై చేయండి!

జీడిపప్పు
జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరగవచ్చు. వీటి వినియోగం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పిస్తాపప్పుల మాదిరిగానే జీడిపప్పులో కూడా ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు డాక్టర్ ని సంప్రదించి వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

చిక్‌పీస్
చిక్ పీస్ లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. గుప్పెడు చిక్‌పీస్ తిన్న సరే చాలా కేలరీలను అందిస్తుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీటి అధిక వినియోగం వల్ల అజీర్ణం లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

డ్రై ఫ్రూట్స్ ను ఎంత పరిమాణంలో తినాలి?

ఏదైనా డ్రై ఫ్రూట్‌ను మితంగా తీసుకోవాలి. సాధారణంగా ఒక రోజులో గుప్పెడు (సుమారు 20-30 గ్రాములు) మిశ్రమ డ్రై ఫ్రూట్స్ సరిపోతాయి. ఇవి సురక్షితమైనవిగా పరిగణిస్తారు. తీసుకునే ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు డాక్టర్ ని సంప్రదించడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad