ఇలా చేస్తే ఉబ్బరింపు తగ్గుతుంది..
ఉబ్బరింపుతో బాధపడుతున్నారా? ఈ సమస్యను నివారించే మార్గాలెన్నో ఉన్నాయి. మసాలా ఫుడ్ తినడం వల్ల, లేదా అతిగా ఫుడ్ తీసుకోవడం వల్ల, నిలవ పదార్థాలు తినడం వల్ల ఉబ్బరింపు తలెత్తుతుంది. ఇలాంటివి తినడం వల్ల స్టోమక్ కూడా దెబ్బతింటుంది.
మైండ్ ఫుల్ ఈటింగ్ తో ఈ సమస్యను అధిగమించవచ్చు. మసాలా, ఫ్యాట్స్ తో నిండి వున్న పదార్థాలను తక్కువగా తినడం మంచిది. ఉబ్బరం సమస్య తలెత్తకుండా నీళ్లు బాగా తాగాలి. రోజుకు ఏడు లేదా ఎనిమిది గ్లాసుల నీళ్లను తాగాలని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషతుల్యమైన మలినాలు బయటకు పోతాయి. బబుల్గ్మమ్ వల్ల ఉబ్బరింపు, గ్యాసు, ఎసిడిటీ సమస్యలు
తలెత్తుతాయి. అందుకే తినే ఆహారాన్ని బాగా నమిలి మింగితే ఉబ్బరింపు సమస్య ఉండదు. ఇలా చేయడం వల్ల స్టమక్ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే జామ,
ఓట్స్, యాపిల్ వంటి వాటిని తినడం వల్ల జీర్ణక్రియ బాగా అవుతుంది. ఉబ్బరింపు సమస్య తలెత్తదు. అందుకే రోజూ మీరు తీసుకునే డైట్ లో అలాంటి ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రొబయొటిక్స్ బాగా ఉండే పెరుగులాంటివి తినడం కడుపుకు ఎంతో మంచిది. పెరుగులో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి చల్లుకుని కూడా తినొచ్చు.
ఉబ్బరింపు సమస్య తగ్గాలంటే మీరు తీసుకునే పదార్థాల్లో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించడం కూడా చాలా ముఖ్యం. సోడియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే పొట్ట పట్టేసినట్టు, బాగా నిండుగా ఉన్నట్టు ఉండి
కడుపు ఉబ్బరింపుగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్ ఐటమ్స్ జోలికి వెళ్లొద్దు.