చాలా మంది మహిళలు నడుము నొప్పితో ఎక్కవగా బాధపడుతుంటారు. చాలా సేపు నడిచిన లేదా కాసేపు ఖాళీగా కూర్చొన్న, మన అమ్మ వాళ్లు వామ్మో..నడుము నొప్పి వచ్చేస్తుందని అంటుంటారు.అసలు ఈ నడుము నొప్పికి ముఖ్యకారణం ఏంటి? మహిళలోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీలలో నడుము నొప్పికి ముఖ్య కారణం పీరియడ్స్. కొంత మందికి మహిళలకు పీరియడ్ పెయిన్ వలన నడుము నొప్పి వస్తుంటుంది. అయితే ఇది కొంత మందికి పీరియడ్ సమయంలోనే ఉంటే, మరికొంత మందికి మాత్రం కంటిన్యూగా నడుము నొప్పి వస్తుంటుంది. అలాగే గర్భధారణ సమయంలో శారీరక మార్పులు,ఎండోమెట్రియోసిస్,అండాశయంలోని సిస్ట్‌లు,ఫైబ్రాయిడ్స్ వంటి వాటి వలన మహిళలను ఎక్కువగా నడుము నొప్పి సమస్య వేధిస్తుంటుంది అంటున్నారు వైద్యులు.అందు వలన మహిళలు గర్భధారణ, పీరియడ్స్ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మంచి ఫుడ్ తీసుకోవాలంట. అలాగే ప్రతిరోజూ వ్యాయమం చేయడం వలన కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంట.
నోట్ : పై వార్త ఇంటర్నెట్‌లోని సమాచార మేరకు మాత్రమే ఇవ్వబడినది, తెలగు ప్రభ దీనినిధృవీకరించలేదు.