మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా మన దేశంలో వేసవికాలం ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. అయితే మార్చి మొదటి వారంలో పగటి పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35°C వరకు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఎండలకు బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్తే కళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు ముఖ్య సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండలకు చాలా మందికి కళ్లు మంటలు పుట్టడం, తల నొప్పి రావడం, నీళ్లనుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణురాలు అంటున్నారు. ఎండ వేడికి మాత్రమే కాకుండా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చున్నా.. ఎక్కువ ఫోన్ చూస్తున్నా.. చూసినా ప్రమాదమే అని అంటున్నారు. మరి అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో కష్టపడి పని చేసే వారికన్నా కంప్యూటర్ తో పనిచేసే వారే ఎక్కువ. కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల దాని నుంచి వచ్చే కిరణాలు కంటి సమస్యను తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే రీడింగ్ గ్లాసెస్ వంటివి వాడాలి. అలాగే ఒక గంటపాటు కంప్యూటర్ ముందు పని చేస్తే.. కనీసం 5 నిమిషాలు అయినా కళ్ళని కడుతూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
అలాగే ఎండలో బయటకి వెళ్తున్నప్పుడు కచ్చితంగా యువి ప్రొటెక్షన్ గ్లాసెస్ కచ్చితంగా ఉపయోగించాలని చెబుతున్నారు. ఎండలకు కళ్ళు పొడిబారినట్టు అవుతే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వేసుకుంటే చల్లబడతాయి. ముఖ్యంగా ఎండాకాలం లో హెల్తీ ఫుడ్ తీసుకుని ఆయిల్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎండలో బయటకి వెళ్లి వచ్చాక కళ్ళకి కాస్త ఉపశమనం పొందటానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా కీరదోసకాయ గుండ్రంగా కోసి కళ్ళ పై పెట్టుకోవాలని.. అలాగే బంగాళాదుంప కట్ చేసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కళ్లపై పెట్టుకుంటే కంటికి మంచిదని అంటున్నారు వైద్యులు.