Sunday, June 8, 2025
Homeహెల్త్Plum Fruit Benefits: ఈ ఒక ఫ్రూట్‌తో మలబద్ధకానికి శాశ్వతంగా చెక్‌!

Plum Fruit Benefits: ఈ ఒక ఫ్రూట్‌తో మలబద్ధకానికి శాశ్వతంగా చెక్‌!

Plum Fruit For Constipation: ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా పిల్లలు, పెద్దలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే గుండె సమస్యలు, డయాబెటిస్, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు ముఖ్య కారణం ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తినడమే. ఇలాంటి ఆహారం తినడం వల్ల మలబద్ధకంతో బాధపడేవారి సంఖ్య కూడా బాగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్లం ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. అసలు ఈ పండు ఏంటి? ఇది జీర్ణవ్యవస్థకు ఎలా సహాయపడుతుంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

- Advertisement -

ప్లం పండును ప్రూనే అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి గుండ్రంగా ఉంటుంది. ఈ పండులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుచుతుంది. అలాగే ఇందులో ఉండే చక్కెర మలాన్ని సులభంగా బయటకు పంపుతుంది.

మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలో బాధపడేవారు రోజుకు ఒక ప్లం ఫ్రూట్‌ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడుతారు. నేరుగా తినడానికి ఇష్టపడని వారు జ్యూస్‌ రూపంలో కూడా తాగవచ్చు. ఇది కేవలం మలబద్దకానికి మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థలో కలిగే మంట కూడా తగ్గుతుంది.

ఆహారంలో ప్లమ్స్‌ను ఎలా చేర్చుకోవాలి:

ప్లం ఫ్రూట్‌ను సలాడ్‌, స్మూతీ, ఓట్‌మీల్‌లో చేర్చుకోవచ్చు. ఇది ఆరోగ్యంగా, రుచికరంగా ఉంటుంది. కొంతమంది ఈ ప్లమ్స్‌ను ఎండిబెట్టి బేకింగ్‌లో ఉపయోగిస్తారు. మీరు దీని జ్యూస్‌ రూపంలో కూడా చేర్చుకోవచ్చు.

ప్లం జ్యూస్ తయారీ:

ముందుగా ప్లం పండ్లను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సగానికి కోసి లోపల ఉన్న గింజలను తీయాలి. గింజలు తీసిన ప్లం ముక్కలను ఒక బ్లెండర్‌లో వేసి అందులోకి కొద్దిగా నీరు పోసుకోవాలి. ఇందులోనే తగ్గినంత తేనె ను కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌ లోకి ఐస్‌ ముక్కులు వేసుకోవడమే. దీని పిల్లలు, పెద్దలు తాగవచ్చు.

ఇలా ప్లం ఫ్రూట్‌లో ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ప్రతిరోజు పండ్లను డైట్‌లో చేర్చుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మీకు అనారోగ్య సమస్యలు ఉంటే దీని తినే ముందు వైద్యుడిని సంప్రదించండి. పండ్లను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News