Heart attacks: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఎయిర్ పొల్యూషన్ ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆస్పత్రుల పాలవుతున్నారు. అయితే ఇప్పటివరకు వాయుకాలుష్యంతో ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మాత్రమే తలెత్తేవి. కానీ ఇప్పుడు గుండేపోటుకు సైతం వాయు కాలుష్యం ప్రధానకారణంగా మారుతుందని డాకర్లు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
ఎయిర్ పొల్యూషన్‌తో గుండెపోటు: సాధారణంగా గుండెపోటుకు సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర వంటి జీవనశైలి కారణంగా భావించేవారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోటు మరణాలకు వాయు కాలుష్యం సైతం కారణమని జైపూర్‌లోని మణిపాల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హిమాన్షు గుప్తా చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో కూడా ఎయిర్ పొల్యూషన్‌తో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా రక్త నాళాలు నిశ్శబ్దంగా దెబ్బతింటాయని తెలిపారు. దీంతో ఎప్పుడు జబ్బుపడని వారిలో సైతం గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Also read-Wellness : ఉదయం నిద్రలేవగానే తల తిరుగుతోందా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లేనా!
రక్తనాళాలపై ప్రభావితం: వాయు కాలుష్యం కారణంగా మనం గాలి పీల్చుకున్నప్పుడు.. అందులో ఉండే సూక్ష్మకణం పదార్థం(PM2.5), నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ప్రాణాంతక వాయువులు రక్తంలో కలుస్తాయి. ఇవి ఆక్సీకరణకు దారితీసి రక్తనాళాల్లో సున్నితమైన పొరను దెబ్బతీస్తోంది. దీంతో రక్తనాళాలు సరిగా సంకోచ, వ్యాకోచం చెందకుండా ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుంది. ఈ మార్పులు గుండె పోటు ప్రమాదానికి దారి తీస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు.
మరి గుండెను రక్షించుకోవడం ఎలా?: ఉరుకుల పరుగుల జీవితంలో.. నిత్యం బయటి తిరిగే వ్యక్తులు వాయుకాలుష్యానికి దూరం ఉండటం సాధ్యంకాదు. అయినప్పుటికీ వాయుకాలుష్య కోరల్లోనుండి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని మార్గాలను వైద్యులు సూచిస్తున్నారు. N95, KN95 వంటి స్పెషల్ మాస్కులను ధరించడం ద్వారా కొంతవరకు ఎయిర్ పొల్యూషన్ ప్రభావాన్ని పరిమితం చేయొచ్చని సూచిస్తున్నారు. అంతే కాకుండా మనం ఉండే పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చెట్లను పెంచడంతో పాటుగా పరిశుభ్రతకు అధికప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ఇండస్ట్రీయల్ ఏరియా, రద్దీగా ఉండే రోడ్ల ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు తప్పనిసరిగా.. ఎయిర్ ప్యూరిఫయర్లను వాడాలని తెలిపారు. ఇక ఆహారానికి విషయానికి వస్తే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు, పండ్లు, తాజా కూరగాయల వంటి గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెపోటు సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు.

