సాధారణంగా ఎండలు మండిపోతున్న సమయంలో.. అందరూ ఏసీ వాడుతుంటారు. అయితే ఇంట్లో ఏసీ చల్లదనం దంపతుల మధ్య ప్రేమ, బందాన్ని దూరం చేస్తుందంట. నిజానికి మనం హాయిగా, సేఫ్‌గా ఫీలవ్వడానికి శరీరానికి వెచ్చదనం అవసరం. గది ఉష్ణోగ్రత 20°C కన్నా తక్కువ అయితే, మన శరీరం వెంటనే స్పందిస్తుంది. కండరాలు బిగుసుకుంటాయి, రక్తప్రసరణ మందగిస్తుంది. చలితో అసౌకర్యం ఎక్కువగా అనిపించడంతో సహజంగానే మనం దూరంగా కూర్చుంటాం, దుప్పట్లో ముడుచుకుంటాం. ఈ సమయంలో దగ్గరగా హత్తుకోవడం, టచ్ చేసుకోవడం తగ్గిపోతుంది. ఇలా టచ్ తగ్గితే, మనసుల మధ్య కూడా దూరం పెరగడం మొదలవుతుంది.
ఇంకా, చల్లటి వాతావరణం మన హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. వెచ్చదనం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ (ప్రేమ హార్మోన్) డోపమైన్ (సంతోష హార్మోన్) ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి మన బంధాన్ని బలపరుస్తాయి. కానీ చల్లదనం కారణంగా ఇవి తగ్గిపోతే, ప్రేమలోనూ, అనుబంధంలోనూ కొద్దిగా లోపం వస్తుంది. చలిలో శరీరం అలెర్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరగడం వల్ల మనం రిలాక్స్ అవ్వడం కష్టం అవుతుంది. ఒకరినొకరు తాకడం, దగ్గరగా ఉండడం కూడా తగ్గిపోతుంది. దీని ప్రభావం తక్కువగా అనిపించినా, కాలక్రమంలో బంధంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
అందుకే గది పరిసరాలను వెచ్చగా ఉంచుకోవడం ఎంతో అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గది ఉష్ణోగ్రత 24°C నుంచి 26°C మధ్య ఉంటే, ప్రేమానుబంధానికి మంచి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వెచ్చటి రంగులు, మృదువైన లైటింగ్ వంటివి మన మనసుకు ప్రశాంతతను ఇచ్చి, రిలేషన్‌షిప్‌ను మరింత బలపరుస్తాయి. దీనితో పాటు ఏసీకి టైమర్ పెట్టుకోండి.. రాత్రి ఎక్కువ చలిగా మారకుండా చూసుకోవడం కూడా మంచింది. అంతేకాదు గట్టి దుప్పట్లకంటే తేలికపాటి బ్లాంకెట్లు ఉపయోగించండి, వీటితో దగ్గరగా ఉంచడానికి ఉపయోగ పడతాయి. వార్మ్ లైటింగ్, హాయిగా ఉండే డెకరేషన్ బెడ్ రూమ్ లో ఏర్పాటు చేసుకోంది. చిన్న మార్పులతోనే ప్రేమానుబంధాన్ని చాలా మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.