Rice VS Diabetes: ఇప్పటిలా షుగర్ ఉన్నవాళ్లు అన్నం తినడంపై చర్చలు ఎక్కువయ్యాయి. ‘‘అన్నం తింటే షుగర్ వస్తుంది… పొట్ట వచ్చేస్తోంది… లావు అయిపోతాం’’ అన్న మాటలు తరచూ వినపడుతున్నాయి. దీని వలన చాలా మంది అన్నం మానేయడం మొదలుపెట్టారు. కానీ, నిజంగా రైస్ తింటే షుగర్ వస్తుందా? ఇది ఒక అపోహా? శాస్త్రీయంగా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ షుగర్ స్థాయిలు…
వైద్య నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం, మధుమేహం వస్తే దానికి ఒక్క అన్నమే కారణం కాదట. జీవనశైలి మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఆందోళనలు, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వంటివే అసలు కారణాలట. అయితే అన్నం మాత్రమే ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటోంది అంటే, ఎక్కువగా తినే వైట్ రైస్ వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుందట. కారణం, ఇది త్వరగా అరిగిపోయి గ్లూకోజ్ ను శరీరంలోకి విడిచిపెడుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అనే కొలత ఇందులో ఎక్కువగా ఉంటుంది. అదే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న బ్రౌన్ రైస్, బాస్మతి రైస్ లాంటివి మధుమేహ బాధితులకు అనుకూలమని నిపుణులు అంటున్నారు.
తక్కువ జీఐ…
బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ వంటి ధాన్యాల్లో తక్కువ జీఐ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. ఇవి మెల్లగా జీర్ణమై గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. బ్రౌన్ రైస్ లో పొట్టు ఎక్కువగా ఉండటంతో పీచుపదార్థాలు (ఫైబర్), ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఫైబర్ ఎక్కువైనా చాలా ఎక్కువ మొత్తంలో తినడం వల్ల మాత్రం షుగర్ పెరిగే అవకాశముంటుంది. అన్నం ఎంత తినాలో, ఎప్పుడెప్పుడూ తినాలో అనే విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
Also Read: https://teluguprabha.net/health-fitness/why-you-should-never-pass-salt-hand-to-hand-explained/
పరోక్షంగా తినే ఆహారం కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, అన్నాన్ని కూరగాయలతో, ప్రొటీన్లతో కలిపి తింటే గ్లూకోజ్ గ్రహణం తగ్గుతుంది. శరీరానికి సమతుల్య పోషకాలు లభిస్తాయి. వేడి అన్నం కన్నా చల్లారిన అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణ బాగుంటుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
గ్లైసెమిక్ ప్రభావం…
అన్నం వండే విధానంతో పాటు దాన్ని ఇతర పదార్థాలతో కలిపి తినే విధానం కూడా గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కూరగాయలు, మాంసాహారం, మసాలా లేకుండా వండిన పదార్థాలతో కలిపి తినడం వల్ల అన్నం మధుమేహానికి ప్రతికూలంగా మారదు.
రైస్ లో పిండిపదార్థాలు అధికంగా ఉన్నా, దాన్ని కొద్దిగా మాత్రమే తీసుకుంటే, ఫైబర్ ఉన్న పదార్థాలతో కలిపి తింటే, షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఉదాహరణకు చల్లారిన అన్నం తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ ప్రభావం తక్కువగా ఉంటుందట.
పాత బియ్యం, బ్రౌన్ బాస్మతి, వైట్ రైస్ లాంటి వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది. బ్రౌన్ బాస్మతిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మరింత ఆరోగ్యప్రదమైనది. ఇదే సమయంలో బ్లాక్ రైస్, వైల్డ్ రైస్ లలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
షుగర్ తగ్గుతుందన్నది అపోహ..
డాక్టర్ భక్తియార్ చౌదరి అనే మిలటరీ వైద్యుడు చెబుతున్న ప్రకారం, మన దేశ ప్రజలు అనాదిగా రైస్ ఆధారిత ఆహారానికి అలవాటుపడ్డారు. కానీ, ప్రస్తుతం ఓట్స్, చిరుధాన్యాలు, రాగులు వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందనే భావన పెరిగింది. అయితే ఇది శాస్త్రీయంగా తప్పు అని ఆయన అంటున్నారు. రైస్ మానేస్తే, షుగర్ తగ్గుతుందన్నది అపోహ. మితంగా తీసుకుంటే, సమతుల్యంగా ఆహారాన్ని ఏర్పరచుకుంటే, షుగర్ నియంత్రణ సాధ్యమవుతుందనేది ఆయన అభిప్రాయం.
ఒకే రకమైన ఆహారం అన్నింటికీ సరిపోదు. ప్రతి ఒక్కరి శరీర స్పందన వేరుగా ఉంటుంది. అందుకే ఎవరైనా తినే ఆహారం శరీరానికి ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. బ్లడ్ షుగర్ స్థాయిలను తరచూ తనిఖీ చేయాలి. అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకుంటూ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
ALSO READ: https://teluguprabha.net/health-fitness/ghee-can-harm-your-health-if-mixed-with-these-foods/
షుగర్ నియంత్రణలో..
రైస్ తినడం వల్ల మధుమేహం వస్తుందని గట్టి నమ్మకంతో అన్నాన్ని పూర్తిగా మానేయడం సరికాదు. రైస్ తీసుకోవడం ఎలా, ఎంత మోతాదులో అన్నమే కాదు, దాంతో కలిపే పదార్థాలు కూడా ముఖ్యమే. వ్యాయామం, ఆహారపు నియమాలు పాటించడం ద్వారా రైస్ తీసుకుంటూ కూడా షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహం ఉన్నవారికి రైస్ పూర్తిగా మానేయమన్నది వైద్యులు సైతం సూచించటం లేదు. అంతేకాదు, రైస్ స్థానంలో తీసుకునే కొన్ని చిరుధాన్యాలు పొడవుగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే ప్రమాదం కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి స్థానిక ఆహారం మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం దశాబ్దాలుగా తీసుకుంటున్న ఆహారాన్ని పూర్తిగా మార్చడం కన్నా దానిలో తినే పద్ధతి, మోతాదులో మార్పులు చేసుకుంటే ఆరోగ్యపరంగా మేలు చేకూరుతుంది.


