Health Tips: కొన్నిసార్లు భోజనం చేసిన తర్వాత కూడా కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం మన అలవాట్లు కావచ్చు. తరచుగా మంచి ఆహారం తీసుకున్న తర్వాత మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. అవి మన జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే, భోజనం చేసిన వెంటనే నివారించాల్సిన 4 అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పండ్లు తినడం
చాలా మంది ఆహారం తిన్న తర్వాత పండ్లు తినడం ఆరోగ్యకరమైనదని భావిస్తారు. కానీ, అది పూర్తిగా తప్పు. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. పండ్లలో ఉండే చక్కెర, కార్బోహైడ్రేట్లు సరిగ్గా జీర్ణం కావు. దీంతో కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలు కలుగుతాయి. నిపుణుల ప్రకారం..పండ్లు తినడానికి కనీసం 1-2 గంటల ముందు లేదా తర్వాత తినాలి.
టీ లేదా కాఫీ
భోజనం చేసిన వెంటనే చాలామందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరం ఆహారంలో ఉండే పోషకాలను ముఖ్యంగా ఐరన్ పూర్తిగా గ్రహించదు. అంతేకాదు, టీ లేదా కాఫీలో ఉండే టానిన్, కెఫిన్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. ఒకవేళ టీ లేదా కాఫీ తాగాలనుకుంటే తిన్న కనీసం 1 గంట తర్వాత త్రాగాలి.
వ్యాయామం చేయడం
తిన్న వెంటనే వ్యాయామం చేయడం వల్ల శరీరం జీర్ణక్రియపై దృష్టి పెట్టడానికి బదులుగా కండరాలకు శక్తిని ఇస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీంతో కడుపు నొప్పి, వాంతులు లేదా ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే, వ్యాయామం తిన్న కనీసం 2-3 గంటల తర్వాత చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
స్నానం చేయడం
భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం అసలు మంచిది కాదు. స్నానం చేసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత కొద్దిగా మారుతుంది. రక్త ప్రసరణ జీర్ణవ్యవస్థ నుండి చర్మానికి దూరంగా వెళుతుంది. దీని కారణంగా, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. తినడానికి అరగంట ముందు స్నానం చేయొచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


