Friday, September 20, 2024
Homeహెల్త్Dried strawberries: డ్రైడ్ స్ట్రాబెర్రీస్ తో యంగ్ గా

Dried strawberries: డ్రైడ్ స్ట్రాబెర్రీస్ తో యంగ్ గా

సుగుణాల స్ట్రాబెర్రీ అన్ని వయసుల వారికీ ఔషధమే

డ్రైడ్ స్ట్రాబెర్రీస్ తో యంగ్ గా ..ఆరోగ్యంగా

- Advertisement -


డ్రైడ్ స్ట్రాబెర్రీస్ రుచిలో నోరూరించేలా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వీటిని స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీవనశైలిలో ఇవి ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయని పలువురు పోషకాహారనిపుణులు అంటున్నారు. కాలరీలు అధికంగా ఉన్న స్నాక్స్ తీసుకోవడం అలవాటైపోయిన ఈ రోజుల్లో డ్రైడ్ స్ట్రాబెర్రీస్ మనకు అందించే ఆరోగ్యం కూడా ఎంతో. ఇవి నిత్యం మన శరీరం ఆరోగ్యంగా పనిచేసేలా చేయడమే కాదు ఎలాంటి జబ్బుల పాల బడకుండా కూడా డ్రైడ్ స్ట్రాబెర్రీస్ ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. మైండ్ ఫుల్ స్నాకింగ్ కి డ్రైడ్ స్ట్రాబెర్రీస్ మంచి ఉపయోగం. వీటిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా ఎంతో సులువు.


ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు సైతం ఉంటాయి. అన్నింటికన్నా ఇవి తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. ఈ డ్రైడ్ స్ట్రాబెర్రీస్ లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారు వారి డైట్ లో వీటిని చేర్చడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిల్లో యాంథోసినిన్స్, ఎలాజిక్ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. సహజమైన తీపిదనంతో ఉండే స్ట్రాబెర్రీస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ముఖ్యంగా ఇవి మనల్ని క్రానిక్ జబ్బుల పాలబడకుండా కాపాడతాయి. వీటిల్లో పీచుపదార్థాలు కూడా చాలా ఎక్కువ. మలబద్దకంతో బాధపడేవారికి ఇవి మంచి ముందు. ఈ సమస్యపై డ్రై స్ట్రాబెర్రీస్ చాలా బాగా పనిచేస్తాయి. కడుపులో బవుల్ మూవ్మెంట్స్
బాగా పనిచేయాలా చేయడంతో పాటు బ్లడ్ షుగర్ ను కూడా ఇవి నియంత్రిస్తాయి.

డ్రై స్ట్రాబెర్రీస్ లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తిన్నప్పుడు చాలాసేపు మనకు ఆకలి అనిపించదు. దీంతో బింజ్ ఈటింగ్ కూడా బాగా తగ్గుతుంది. వెయిట్ లాస్ కు డ్రై స్ట్రాబెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో పోషకాలు సైతం పుష్కలంగా ఉంటాయి. అలా ఇవి గుడ్ ఫుడ్ అని చెప్పాలి. వీటిల్లో అధికస్థాయిలో ఖనిజాలు, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ఉంటాయి. అందుకే వీటిని న్యూట్రియంట్ రిచ్ స్నాక్ అని పోషకాహారనిపుణులు ప్రత్యేకంగా పేర్కొంటారు. ఇవి స్నాకింగ్ కు ఆరోగ్యకరమైన చాయిస్ కూడా. నిత్యం డ్రై స్ట్రాబెర్రీస్ తినడం వల్ల రోగనిరోధకవ్యవస్థ ఆరోగ్యంగా తయారవుతుంది.

పైగా డ్రై స్ట్రాబెర్రీస్ లో నేచురల్ స్వీట్నర్స్ ఉంటాయి. వీటిల్లో ప్రిజర్వేటివ్స్ కు తావులేదు. వీటిని సిరల్స్, ఓట్స్ లేదా తేట పెరుగుపై చల్లుకుతింటే కూడా ఎంతో మంచిది. ఎందుకంటే డ్రై స్ట్రాబెర్రీస్ లోని నేచురల్ స్వీట్నర్స్ మనం తినే స్నాక్స్ కు ఎంతో రుచిని తెస్తాయి. పైగా ముందరే చెప్పినట్టు వీటిల్లో యాంటాక్సిడెంట్లు, ఎలాజిక్ యాసిడ్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతోంది. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు అతినీలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి, ఇతర పర్యావరణ కాలుష్యాల నుంచి చర్మాన్ని పరిరక్షిస్తాయి. ఎలాజిక్ యాసిడ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. కొల్లాజిన్ బ్రేక్ అవకుండా సంరక్షిస్తుంది. చర్మం ముడతలు పడకుండా మనల్ని యంగ్ గా కనిపించేట్టు చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News