Healthy Weight Loss Drink: నేటి బిజీ లైఫ్ లో చాలామంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం పూర్తిగా మానేశారు. సరైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని వర్క్ చేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. దీనితో పాటు ఊబకాయం సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఊబకాయాన్ని తగ్గించడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లి గంటల తరబడి శ్రమిస్తారు. దీనితో పాటు అనేక రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకుంటారు. అయినా బరువు తగ్గడంలో ఎలాంటి ఫలితం ఉండదు. అయితే, సులభంగా బరువు తగ్గడానికి రాత్రిపూట తాగాల్సిన కొన్ని డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తీసుకుంటే కేవలం 15 రోజుల్లోనే ఫలితం ఉంటుంది.
నిమ్మకాయ నీరు
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, రాత్రి పడుకునే ముందు లేదా ఆహారం తిన్న తర్వాత నిమ్మకాయ నీరు త్రాగాలి. దీనికోసం నీరు గోరువెచ్చగా ఉన్న నీటిలో నిమ్మకాయ రసం మిక్స్ చేసి తాగాలి. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ఈ డ్రింక్ మీ జీర్ణక్రియను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది.
గ్రీన్ టీ
చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీ తీసుకుంటారు.కానీ, సాధారణంగా అందరూ దీనిని పగటిపూట మాత్రమే తాగుతారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, కాటెచిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచుతాయి. ఇట్టే కొవ్వును కూడా కరిగిస్తాయి. అయితే, నిద్రపోయే ముందు గ్రీన్ టీ తాగాలి. ఇది రాత్రిపూట కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు.
జీలకర్ర టీ
జీలకర్ర టీ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీని తయారు చేసుకోవడానికి పుదీనా, జీలకర్ర, అల్లం కలిపి దాదాపు 10 నిమిషాలు పాటు మరిగించాలి. తిన్న అరగంట తర్వాత ఈ డ్రింక్ త్రాగవచ్చు.
పుదీనా టీ
పుదీనా టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపులో వాయువును కూడా తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు పుదీనా టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
దాల్చిన చెక్క నీరు
ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ప్రతి రాత్రి ఒక కప్పు దాల్చిన చెక్క నీరు తాగితే, మీ శరీరం కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. దీంతో బరువు కూడా తగ్గొచ్చు.