Thursday, January 30, 2025
Homeహెల్త్Water: ఖాళీ కడుపుతో ఎంత నీరు తాగాలో తెలుసా.. ఆ పొరపాటు చేస్తే..!

Water: ఖాళీ కడుపుతో ఎంత నీరు తాగాలో తెలుసా.. ఆ పొరపాటు చేస్తే..!

నీరు అనేది మన శరీరానికి అత్యంత అవసరం. అన్ని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రోజూ తగినంత నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా నేటి గజిబిజి పరిస్థితుల్లో నీరు తాగడాన్ని యువత నిర్లక్ష్యం చేస్తోంది. అయితే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెపుతారు అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

నిద్రపోతున్నప్పుడు శరీరానికి కొన్ని గంటలపాటు వాటర్ అందదు. దీంతో బాడీలో మైల్డ్ డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగితే శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయవచ్చు. ఇది రోజంగా శరీరాన్ని చురుకుగా ఉండేలా చేస్తుంది. ఇక ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్‌ క్లీన్ అవుతుంది. నీరు శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మలబద్ధకం లేదా కడుపులో అసౌకర్యంగా ఉంటే, ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే రిలీఫ్ గా ఉంటుంది.

ఉదయాన్నే నీళ్లు తాగితే మెటబాలిక్‌ రేట్ దాదాపు 30% వరకు పెరుగుతుంది. అంటే శరీరం మరింత వేగంగా కేలరీలను ఖర్చు చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయం చేస్తుంది. ఖాళీ కడుపుతో చల్లటి నీళ్లు తాగితే, శరీరం వాటిని వెచ్చగా చేయడానికి ఎక్స్‌ట్రా ఎనర్జీని వినియోగిస్తుంది. ఫలితంగా మరిన్ని కేలరీలు బర్న్ అవుతాయి. అలా అని మరీ చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం.
బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఎంప్టీ స్టమక్‌తో వాటర్ తాగడం మంచిది.

నీరు శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న కిడ్నీలు, కాలేయం ఉదయం నీళ్లు తాగగానే మరింత చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా ఎంప్టీ స్టమక్‌తో వాటర్ తాగితే, శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను ఈ అవయవాలు సమర్థవంతంగా తొలగించగలుగుతాయి. ఇక డీహైడ్రేషన్ అలసటకు కారణమవుతుంది. నిద్ర లేచిన తర్వాత నీళ్లు తాగితే శరీరం రిఫ్రెష్ అవుతుంది, రక్త ప్రవాహం పెరుగుతుంది, దీంతో రోజంతా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. ఇక నీరు చర్మ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతూ పొడిబారడాన్ని, ముడతలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే, చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చర్మం మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

నీరు తాగకపోతే: ఉదయాన్నే నీళ్లు తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, కిడ్నీ సమస్యలు కూడా రావొచ్చు. అంతేకాదు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. చర్మం పొడిబారుతుంది, నీరసంగా అనిపిస్తుంది. ఖాళీ కడుపుతో మాత్రమే కాదు రోజంతా తగినంత మొత్తంలో వాటర్ తాగుతూ ఉండాలి. లేకపోతే డయాబెటిస్, పైల్స్ వంటి సమస్యలు కూడా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8-10 గ్లాసుల నీరు (సుమారు 2-3 లీటర్లు) తాగడం ఉత్తమం. ఉదయం ఖాళీ కడుపుతో 2-3 గ్లాసుల నీటితో రోజుని ప్రారంభించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News