Sunday, November 16, 2025
Homeహెల్త్Drinking Water: అతిగా నీరు త్రాగితే అనర్థమే..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

Drinking Water: అతిగా నీరు త్రాగితే అనర్థమే..! నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

Drinking Too Much Water is Harm to Health: మనిషికి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. అందుకే, నీరు ఆరోగ్యానికి మంచి చేస్తుందని, నీటిని ఎక్కువగా త్రాగాలని పెద్దలు చెబుతుంటారు. అయితే, అతి ఏదైనా అనర్థమేనని గుర్తించుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అతిగా నీరు త్రాగడం వల్ల ఓవర్‌హైడ్రేషన్‌కు గురై శరీరం రకరకాల ఇబ్బందులకు లోనవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేమిటి అనే విషయం పరిశీలిద్దాం.

- Advertisement -

శరీరానికి నీరు ఎందుకు ముఖ్యం?

శరీరంలో నీరు అనేక ముఖ్యమైన పనులను చేస్తుంది. నీరు వేడి వాతావరణంలో లేదా వ్యాయామం చేసినప్పుడు చెమట రూపంలో నీటిని విడుదల చేసి.. శరీరాన్ని చల్లబరచడంలో నీరు ముఖ్యపాత్ర వహిస్తుంది. మరోవైపు, మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను కరిగించి.. వాటిని రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేర వేయడానికి నీరు ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, యూరిన్, చెమట ద్వారా శరీరంలోని విష వ్యర్థాలను, అదనపు లవణాలను బయటకు పంపడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్లు, వెన్నుపూసకు షాక్ అబ్జార్బర్‌గా పనిచేస్తూ.. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థలో ఆహారం సులభంగా కదలడానికి, పోషకాలు శోషించడానికి నీరు ఉపయోగపడుతుంది.

డీహైడ్రేషన్‌తో వచ్చే ప్రమాదాలు..

శరీరానికి తగినంత నీరు అందనప్పుడు డీహైడ్రేషన్ తలెత్తుతుంది. తద్వారా తలనొప్పి, అలసట, మైకం, నోరు ఎండిపోవడం, ముదురు పసుపు రంగులో మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ కిడ్నీల్లో రాళ్లు, మలబద్ధకం, తీవ్రమైన అలసటకు దారితీస్తుంది. అయితే, శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు అతిగా దాహం వేస్తుంది. అప్పుడు మాత్రమే నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది.

రోజుకు ఎంత నీరు అవసరం ?

“మీకు నిజంగా ఎంత నీరు అవసరం?” అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే నీటి అవసరం అనేది వయస్సు, లింగం, వాతావరణం, శారీరక శ్రమ స్థాయి, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికన్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పురుషులు రోజుకు సుమారు 3.7 లీటర్లు (సుమారు 15.5 కప్పులు) ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇక, మహిళలు రోజుకు సుమారు 2.7 లీటర్లు (సుమారు 11.5 కప్పులు) ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ మొత్తం కేవలం నీటి రూపంలోనే కాకుండా ఆహారం (పండ్లు, కూరగాయలు వంటివి), డ్రింక్స్ (పాలు, జ్యూస్‌లు) ద్వారా శరీరానికి చేరుతాయి. అయితే, ఇందులో మెజారిటీ భాగం సాధారణ నీరు ఉండటమే మంచిది. సాధారణంగా, ఒక రోజుకు 8 గ్లాసుల (సుమారు 2 లీటర్లు) నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad