Homeహెల్త్Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పీక్స్‌లో ఉందా?అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తినండి!

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పీక్స్‌లో ఉందా?అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తినండి!

Uric Acid Control Dry Fruits: నేటి బిజీ లైఫ్ లో చాలా మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీనికి తప్పుడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలు. ఇప్పటికే అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్ ప్రజలను ఇబ్బంది పెడుతుండగా, అధిక యూరిక్ యాసిడ్ సమస్య కూడా కనిపిస్తోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, నడవడంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే, యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా వీటి వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. శరీరం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించగల డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకునే ముందు, యూరిక్ యాసిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

- Advertisement -

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి?

ప్యూరిన్ అనేది కొన్ని రకాల ఆహార పదార్థాలలో కనిపించే రసాయన సమ్మేళనం. మన శరీరం ఈ ప్యూరిన్‌ను జీర్ణం చేసినప్పుడు, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణంగా మూత్రపిండాలు మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతాయి. కానీ, శరీరంలో దాని పరిమాణం ఎక్కువగా మారినప్పుడు, అది బయటకు వెళ్ళదు. దీంతో ఇది అధిక యూరిక్ యాసిడ్ సమస్యకు కారణమవుతుంది.

యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించగల డ్రై ఫ్రూట్స్

వాల్‌నట్

వాల్‌నట్ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే డ్రై ఫ్రూట్. దీన్ని డైట్ లో చేర్చుకోవడం ద్వారా పెరిగిన యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. అయితే, నానబెట్టిన వాల్‌నట్ లు తినడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

జీడిపప్పు

ఇందులో ప్యూరిన్ తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల, జీడిపప్పు అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఉండాలంటే రోజుకు రెండు నుండి మూడు జీడిపప్పులు తినాలి.

Also Read: Monsoon Woes: వాన దెబ్బ – జ్వరాల దడ.. ఇంటింటా పొంచి ఉన్న ముప్పు!

బాదం

బాదం తినడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గుతుంది. బాదంపప్పును ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. నిజానికి ఇందులో ఉండే డైటరీ ఫైబర్ యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అవిసె గింజలు

జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లతో పాటు, అవిసె గింజలు కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, యూరిక్ యాసిడ్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.

పిస్తాపప్పులు

పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించాలనుకుంటే, పిస్తాపప్పులను కూడా తినవచ్చు. ఇందులో ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News