Sunday, November 16, 2025
Homeహెల్త్Breast Cancer:రొమ్ము క్యాన్సర్‌ ముందే గుర్తిస్తే చాలా బెటర్‌..!

Breast Cancer:రొమ్ము క్యాన్సర్‌ ముందే గుర్తిస్తే చాలా బెటర్‌..!

Early Signs of Breast Cancer:మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ (బ్రెస్ట్ క్యాన్సర్) అత్యంత సాధారణమైన, ఆందోళన కలిగించే వ్యాధిగా మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాదిమంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిని సరైన సమయానికి గుర్తించకపోవడం వల్ల పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది.

- Advertisement -

గడ్డ కనిపిస్తేనే క్యాన్సర్‌

సాధారణంగా చాలామంది రొమ్ములో గడ్డ కనిపిస్తేనే క్యాన్సర్‌ అని అనుకుంటారు. కానీ నిపుణులు చెబుతున్నదేమిటంటే, గడ్డ మాత్రమే కాకుండా మరెన్నో సంకేతాలు కూడా రొమ్ము క్యాన్సర్‌ ప్రారంభ దశలో కనిపించవచ్చని. ఈ చిన్న మార్పులను గుర్తించడం ప్రాణాలను కాపాడగలదని వైద్యులు చెబుతున్నారు.

Also Read:https://teluguprabha.net/lifestyle/importance-of-washing-hands-daily-for-health-protection/

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో మొత్తం మహిళల క్యాన్సర్‌ కేసులలో సుమారు 28 శాతం రొమ్ము క్యాన్సర్‌దే. ఈ సంఖ్య భయపెట్టే స్థాయిలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో సగం కంటే ఎక్కువ మంది మహిళలు తమలో ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తిస్తున్నారు. వీటన్నిటికి కారణం మాత్రం ఒక్కటే అని తెలుస్తోంది. అదే ప్రారంభ దశలో వచ్చే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం.

రొమ్ములో గడ్డ తప్పనిసరిగా..

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్‌ కేసులో రొమ్ములో గడ్డ తప్పనిసరిగా ఉండదు. కొన్నిసార్లు శరీరంలో కనిపించే చిన్న మార్పులు లేదా ఇతర లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్‌ సంకేతాలుగా ఉండవచ్చు. ఉదాహరణకు ఎప్పటికప్పుడు అలసటగా అనిపించడం, ఎముకల నొప్పి, స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్‌ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తున్నప్పుడు జరుగుతుంది.

రొమ్ముపై నొప్పి, చర్మంలో గట్టిగా..

ఇలాంటి పరిస్థితుల్లో రొమ్ముపై నొప్పి, చర్మంలో గట్టిగా అనిపించడం, లేదా చనుమొనలో మార్పులు వస్తే వాటిని విస్మరించరాదని వైద్యులు అంటున్నారు. అన్ని గడ్డలు క్యాన్సర్‌ కావని, అన్ని క్యాన్సర్‌లు గడ్డల రూపంలోనే కనిపించవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. చాలాసార్లు చర్మం మందంగా మారడం, చిన్న గుచ్చినట్లు లేదా మడతలు పడినట్లు కనిపించడం కూడా ప్రారంభ సంకేతాలుగా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

పీరియడ్స్‌, గర్భధారణ, మెనోపాజ్‌..

మహిళల్లో హార్మోన్ల మార్పులు పీరియడ్స్‌, గర్భధారణ, మెనోపాజ్‌ సమయంలో సహజమే. కానీ ఈ మార్పులు సాధారణంగా రెండు రొమ్ములలో సమానంగా జరుగుతాయి. ఒకే రొమ్ములో మాత్రమే మార్పులు గమనిస్తే అది ఆందోళనకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఒక రొమ్ములో గడ్డ పెరుగుతుంటే, చర్మం బిగుసుకుపోయినట్లు లేదా చనుమొన లోపలికి లాగినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, మన దేశంలో సుమారు 60 శాతం రొమ్ము క్యాన్సర్‌ కేసులు మూడవ లేదా నాలుగవ దశలోనే గుర్తిస్తున్నారు. అంటే ప్రారంభ దశలో వాటిని గుర్తించడం చాలా అరుదు. ఇది రోగి ప్రాణానికి పెద్ద ప్రమాదం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే ఐదు సంవత్సరాల వరకు జీవించే అవకాశాలు 90 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ ఆలస్యంగా గుర్తిస్తే ఆ శాతం గణనీయంగా తగ్గిపోతుంది.

Also Read: https://teluguprabha.net/lifestyle/indoor-plants-that-help-purify-air-naturally/

క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందడానికి మహిళలు స్వీయ పరిశీలన చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 20 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ప్రతి మహిళ ప్రతి నెలా ఒకసారి తన రొమ్ములను స్వయంగా పరిశీలించుకోవాలి. ఏవైనా అసాధారణ మార్పులు గమనిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి క్లినికల్ బ్రెస్ట్ పరీక్ష చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 40 సంవత్సరాల వయస్సు దాటిన మహిళలు మాత్రం ప్రతి సంవత్సరం బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరమని వైద్యులు అంటున్నారు.

నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రొమ్ములో వచ్చే మార్పులు అన్ని సమయాల్లో క్యాన్సర్‌ సూచనలే కాదు. కానీ ఆ మార్పులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడం మాత్రం అవసరం. ఉదాహరణకు రొమ్ము చర్మం ఎర్రగా మారడం, తాకినప్పుడు వేడిగా అనిపించడం, లేదా చనుమొన నుండి ద్రవం రావడం వంటి లక్షణాలు కూడా రొమ్ము క్యాన్సర్‌కి సంబంధించినవిగా ఉండే అవకాశాలున్నాయి.

రొమ్ము క్యాన్సర్‌కి పూర్తి కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్య ప్రభావం, ఆలస్యంగా ప్రసవం లేదా ప్రసవం లేకపోవడం వంటి అంశాలు ప్రమాదాన్ని పెంచవచ్చని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad