సాధారణంగా బెల్లం అనేక రకాల పోషకాలతో నిండి ఉంటుంది. దీని రోజూ వినియోగించడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని సులభంగా భర్తీ చేసుకోవచ్చు. దీనిపోటా మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ మొదలైనవి కూడా బెల్లంలో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్ అదుపులో ఉండాలంటే బెల్లం తినడం ఎంతో మంచిదంట. ఇక బెల్లాన్ని చెరుకు రసం నుంచే తీస్తారు అనుకుంటే పొరపాటే.. తాటి బెల్లం, ఖర్జూర బెల్లం ఇలా చాలా రకాలు ఉన్నాయి.
చెరుకు బెల్లం: చెరుకు బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చెరకుతో తయారు చేసిన బెల్లం సులభంగా మార్కెట్ లో లభిస్తుంది. చెరకు రసాన్ని మరిగించడం ద్వారా బెల్లం తయారు చేస్తారు. మార్కెట్ లో బెల్లం దిమ్మలు, పౌడర్లు, గుళికలు దొరుకుతాయి. ఇది గోధుమ రంగులో ఉంటుంది. నిజానికి బెల్లం రంగు చెరకు యొక్క నాణ్యత, ప్రాసెసింగ్పై ఆధారపడి ఉంటుంది. బెల్లంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక పోషకాలు ఉన్నాయి. ఎముకలు దృఢంగా మారి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను తగ్గిస్తుంది.
ఖర్జూర బెల్లం: ఖర్జూరం నుంచి కూడా బెల్లం తయారు చేస్తారు. ఖర్జూరంతో చేసిన బెల్లం చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఈ బెల్లం మంచి వాసన కలిగి ఉంటుంది. అలాగే ఖర్జూరం బెల్లంలో లో నేచురల్ షుగర్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. చలికాలంలో ఈ బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెపుతున్నారు. ఇక ఖర్జూర బెల్లంతో శరీరం ధృడంగా మారుతుందని చెపుతున్నారు.
కొబ్బరి బెల్లం: ఇక కొబ్బరి రసంతో కొబ్బరి తాటి మొలాసిస్ తయారుచేస్తారు. ఈ బెల్లాన్ని ప్రత్యేక స్వీట్ల తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, జింక్ మొదలైనవి కూడా ఉంటాయి. ఇది సహజ శక్తి వనరు మరియు శరీరంలో ఎలక్ట్రోలైట్లను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారికి కొబ్బరి బెల్లం మంచి ఎంపిక. దీనిని నిత్యం ఆహారంలో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెపుతుంటారు.
తాటి బెల్లం: పంచదారకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని వాడొచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. పంచదారతో పోలిస్తే తాటిబెల్లంలోని ఖనిజ లవణాలు 60 రెట్లు ఎక్కువ. . టీ, కాఫీ, పండ్లరసాలకు కూడా ఈ బెల్లాన్ని ఉపయోగించొచ్చు. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేయడమే కాకుండా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనిపిస్తుంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు. దీనిని ఫాలో అయ్యే ముందు వైద్యులు/ నిపుణులను సంప్రదించండి.)