Saturday, November 15, 2025
Homeహెల్త్Diabetes: ఈ కూరగాయలు తింటే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్..

Diabetes: ఈ కూరగాయలు తింటే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్..

Diabetes Vegetables: మన వంటింట్లో ఉండే కొన్ని సాధారణ కూరగాయలు డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతాయని మీకు తెలుసా? అవును, నిజమే.. ఆరోగ్య నిపుణుల ప్రకారం..కొన్ని కూరగాయలను ఆహారంలో చేర్చుకుంటే, అవి రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుతాయి. ఇవి డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధిని నివారిస్తుంది. ఈ నేపథ్యంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావంతంగా పనిచేసే కూరగాయలు గురించి తెలుసుకుందాం.

- Advertisement -

కాకరకాయ
కాకరకాయ చేదు కారణంగా దీని తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ, ఇది డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతమైన కూరగాయ. ఇందులో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి వంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

పర్వాల్
పర్వాల్‌లో ట్రైకోసాంథిన్, కుకుర్బిటాసిన్, లూపియోల్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చక్కెర పెరుగుదలను తగ్గిస్తుంది.

Also read:

కుండ్రు
కుండ్రులో ఉండే ఔషధ గుణాలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ బి, టెర్పెనాయిడ్లు ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

గోరు చిక్కుడు
గోరు చిక్కుడులో చాలా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. తద్వారా తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.

పొట్లకాయ
పొట్లకాయలో సాపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు, ఇది శరీరం గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరుస్తాయి.

మునగకాయ
మునగకాయలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం కారణంగా దీని సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పచ్చి బొప్పాయి
పండిన బొప్పాయి లాగానే, పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పపైన్ ఎంజైమ్‌లు గ్లూకోజ్ జీవక్రియకు సపోర్ట్ చేస్తాయి.

బోడ కాకరకాయ
దీనిని ‘ఫారెస్ట్ కాకరకాయ’ అని కూడా పిలుస్తారు. ఈ కూరగాయలో ఫినాలిక్ ఎంజైమ్‌లు కనిపిస్తాయి. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. అంతేకాదు, హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని చూపుతాయి. అనగా రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad