ఆపిల్‌ను “ఆరోగ్య రహస్యము” అని ఎందుకు అంటారో తెలుసా? రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆపిల్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిచ్చే మాత్రలు లాంటివి.
బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటంతో పొట్ట నిండుగా అనిపించి, ఎక్కువ తినకుండా నియంత్రిస్తుంది. హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం. మలబద్ధకం నివారణలో సహాయం . ఆపిల్‌లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. కాల్షియం, విటమిన్ C ఎక్కువగా ఉండటంతో ఎముకలు, కీళ్లకు బలం వస్తుంది.
అయితే, మధుమేహం ఉన్నవారు లేదా ఆపిల్ తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపించేవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. అందుకే “రోజుకు ఒక ఆపిల్ తింటే, డాక్టర్ దూరంగా ఉంటాడు” అనే మాట వాస్తవం. ఆరోగ్యంగా ఉండేందుకు, ఇప్పుడు నుంచే ఈ మంచి అలవాటు చేసుకోండి!