Saturday, November 15, 2025
Homeహెల్త్Curd: ఈ మూడింటిని పెరుగుతో కలిపి తింటే యమ డేంజర్‌!

Curd: ఈ మూడింటిని పెరుగుతో కలిపి తింటే యమ డేంజర్‌!

Curd vs Health: మన రోజువారీ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. చాలా మంది భోజనంలో చివరగా పెరుగు తినడాన్ని అలవాటు చేసుకున్నారు. దీని రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయని కూడా చెబుతారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, జీర్ణక్రియకు సహాయం చేయడం వంటి ప్రయోజనాలు పెరుగు వల్ల లభిస్తాయి. అయితే ప్రతి ఆహార పదార్థం పెరుగుతో కలిపి తినడం మంచిది కాదు. ఆయుర్వేద నిపుణులు, వైద్యులు చెబుతున్న విషయమేమిటంటే కొన్ని కూరగాయలు పెరుగుతో తిన్నప్పుడు కడుపుకు ఇబ్బందులు తలెత్తుతాయి. జీర్ణక్రియ బలహీనపడటమే కాకుండా చర్మంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఉల్లిపాయ, వంకాయ, దోసకాయ…

ముఖ్యంగా ఉల్లిపాయ, వంకాయ, దోసకాయ అనే మూడు కూరగాయలను పెరుగుతో కలిపి తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. సాధారణంగా ఈ పదార్థాలను మనం రైతా రూపంలో తినడం ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఈ అలవాటు వల్ల కలిగే సమస్యలు చాలామందికి తెలియవు.

ఉల్లిపాయ..

ఉల్లిపాయ వంటల్లో విస్తృతంగా ఉపయోగించే కూరగాయ. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంటలను తగ్గించే లక్షణాలు కూడా ఇందులో ఉంటాయి. అయినా పెరుగుతో కలిపి ఉల్లిపాయ తినడం మాత్రం మంచిది కాదు. కారణం పెరుగు స్వభావం చల్లగా ఉండగా, ఉల్లిపాయ శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణక్రియలో అసమతౌల్యం ఏర్పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి.

వంకాయ..

వంకాయ కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయ. తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు, ఫైబర్, విటమిన్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అయితే వంకాయ శరీరంలో వేడి పెంచే స్వభావం కలిగి ఉంటుంది. పెరుగు చల్లదనంతో కలిసినప్పుడు ఈ రెండింటి ప్రభావం కడుపుకు హాని చేస్తుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు కూడా రావచ్చు.

Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-eating-raisins-on-empty-stomach/

దోసకాయ..

దోసకాయ విషయానికి వస్తే, ఇది పూర్తిగా నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది. శరీరాన్ని చల్లబరచడం, డీహైడ్రేషన్‌ను నివారించడం దోసకాయ ప్రధాన లక్షణాలు. ఇందులో ఉండే విటమిన్ K, పొటాషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ పెరుగుతో కలిసి తిన్నప్పుడు ఇది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే పెరుగు, దోసకాయ రెండూ చల్లని లక్షణం కలిగి ఉంటాయి. వీటిని కలిపి తినడం వలన జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరానికి కావలసిన శక్తి తగ్గి అలసట ఎక్కువవుతుంది. కొంతమందిలో అజీర్ణం సమస్య మరింత పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad