Guava For Healthy Heart: జామపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన పండు. ఇది తక్కువ ధరలో అధిక పోషకాలతో అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన పండు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం లాంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామపండును శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది. దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో తరచుగా జామపండు తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎలా మేలు జరుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ నియంత్రణ: జామకాయలోని కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధిస్తుంది. దీని తరచుగా తింటే ధమనులలో ఫలకం ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అదనంగా, జామకాయలోని పెక్టిన్ కూడా కొలెస్ట్రాల్ నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది: జామపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. రక్త నాళాలను సడలిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపై అదనపు ఒత్తిడిని తగ్గిస్తుంది. జామకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
యాంటీఆక్సిడెంట్ల నిల్వ: జామకాయలు విటమిన్ సి, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి కణాలను దెబ్బతీస్తాయి. గుండె జబ్బులకు కారణమవుతాయి. విటమిన్ సి ధమని గోడలను బలోపేతం చేయడానికి, వాపును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
డయాబెటిస్ అదుపులో: జామకాయలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులకు ముడిపడి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెరను నియంత్రించడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. జామకాయలోని ఫైబర్ గ్లూకోజ్ శోషణను మందగించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం: ఊబకాయం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో పదే పదే తినే అలవాటును నివారించవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


