Saturday, November 15, 2025
Homeహెల్త్Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లకు మాత్రం కాదు..

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీళ్లకు మాత్రం కాదు..

Who Should Not Eat Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండాల్సింది. ఇవి శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. పండ్ల లో భాగంగా బొప్పాయి పండును మనం తీసుకుంటాం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఉండే అనేక అంశాలు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. సాధారణంగా చాలామంది బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు! కానీ మీకు తెలుసా? బొప్పాయి పండు ని కొంతమంది తింటే హాని కలుగుతుందని! అవును నిజమే.. గర్భిణీ స్త్రీలు, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ పండును తినకూడదు. ఈ నేపథ్యంలోనే బొప్పాయిని ఎవరు తినకూడదు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

బొప్పాయి పండుని గర్భిణీ స్త్రీలు తినడం మానుకోవాలి. ఇది వారి ఆరోగ్యం చెడు ప్రభావాన్ని చూపే కొన్ని అంశాలను కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయిలో గర్భస్రావం కలిగించే ఒక రకమైన పదార్థం ఉంటుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు కేవలం పండిన బొప్పాయిని మాత్రమే తీసుకోవాలి. ఇది వారికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి పండును తినకూడదు. ఇందులో ఉండే అంశాలు కడుపు చికాకు లేదా గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది. దీంతోపాటు ఈ సమస్య ఉన్నవారు బొప్పాయిని అధికంగా తినడం ద్వారా విరేచనాలు లేదా వాంతులు వంటి సమస్యలు కూడా వస్తాయి. కావున జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతనే బొప్పాయిని తీసుకోవడం మంచిది.

Also Read: Tulasi Leaves: ఉదయం ఖాళీ కడుపుతో 3-4 తులసి ఆకులు నమిలితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం!

మధుమేహ రోగులు కూడా బొప్పాయిని తినడం మానుకోవాలి. ఇందులో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని అంశాలు ఉంటాయి. అంతేకాకుండా బొప్పాయిలో సహజమైన తీపి ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ ఉన్నవారికి హానికరం. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే బొప్పాయిని ఆహారంలో భాగం చూసుకోవాలి

కొంతమందికి బొప్పాయికి అలెర్జీ ఉండవచ్చు. కావున వారికి దురద, దద్దుర్లు, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడైనా బొబ్బాయి తిని అలెర్జీ కలిగి ఉంటే, మళ్లీ బొప్పాయిని తినడం మానుకోవాలి.

గుండె జబ్బులు ఉన్నవారు కూడా బొప్పాయిని తినడం మానుకోవాలి. ఎందుకంటే దీని వినియోగం గుండెన ప్రభావితం చేస్తుంది. మొబైల్ లో ఉండ కొన్ని అంశాలు అధిక రక్తపోటు లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి గుండె రోగులు వైద్యుడిని సంపాదించిన తర్వాతే బొప్పాయిని తీసుకుంటే మంచిది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad