Wednesday, October 30, 2024
Homeహెల్త్Ever Young: నిత్య యవ్వనం కోసం రెడ్ లైట్ థెరపీ

Ever Young: నిత్య యవ్వనం కోసం రెడ్ లైట్ థెరపీ

వయసు మీద పడే కొద్దీ చర్మం బిగువు పోతుంది. ముడతలు పడుతుంది. చర్మంలో మెరుపుదనం తగ్గుతుంది. చర్మం వదులయిపోతుంది. శరీరంలో కొల్లాజన్ ఏర్పడడం తగ్గిపోవడం వల్ల చర్మంపై ఈ మార్పులన్నీ సంభవిస్తాయి. అయితే యాంటీ ఏజింగ్ ప్రయత్నంలో యంగ్ గా కనిపించడానికి రకరకాల కాస్మొటిక్ చికిత్సలు వస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిల్లో రెడ్ లైట్ థెరపీ ఒకటి.

- Advertisement -

ఈ చికిత్స బయోస్టిమ్యులేటర్ అని చెప్పాలి. అంటే కొల్లాజిన్ కణాల ఉత్పత్తిని పెంచే, సెల్యూలర్ ఎనర్జీని పుట్టించేదనమాట. ఇది శరీరంలో ఫిబ్రోబ్లాస్ట్ కణాలను పెంచడంతో పాటు పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ఈ ఫిబ్రోబ్లాస్ట్ కణాల వల్లే కొల్లాజన్, ఎలాస్టిన్ ఉత్పత్తి అవుతాయి. ముందరే చెప్పినట్టు రెడ్ లైట్ థెరపీ అనేది యాంటీ ఏజింగ్ విధానం. ఇది చర్మంపై ముడతలు పడకుండా తగ్గిస్తుంది. ఇతర వయసు సంబంధిత సమస్యలను నియంత్రిస్తుంది. అంతేకాదు దీనివల్ల స్కిన్ టెక్స్చెర్ పటుత్వంగా ఉంటుంది. ముఖంపై మచ్చలు వంటి వాటిని కూడా ఈ చికిత్సా విధానం తగ్గిస్తుంది. టిష్యూల పునరుత్పత్తిని పెంచుతుందని పలువురు చర్మనిపుణులు చెప్తున్నారు. ఈ చికిత్సా ప్రభావం చర్మంలోని లోపలి పొరలవరకూ చేరి రక్తప్రవాహం బాగా జరిగేట్టు చేస్తుంది. రక్తప్రవాహం బాగా జరిగితే కొల్జాజన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు చర్మంలోని మలినాలు పోయి డిటాక్సిఫై అవుతుంది. చర్మం లోపలి పొరలవరకూ ఈ మార్పులు జరిగిన క్షణం నుంచీ మీ చర్మం బిగువుగా, కాంతివంతంగా, మ్రుదువుగా తయారయి వయసు కనపడకుండా ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ థెరపీ సెబాషియస్ గ్లాండ్ల ను బాగుచేస్తుంది. ఈ గ్లాండ్స్ సెబమ్ ని (ఆయిల్ ని) వేరుచేస్తుంది.

సాధారణంగా ఈ ఆయిల్ వల్ల రంధ్రాలు మూసుకుపోయి ఆ ప్రదేశంలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. రెడ్ లైట్ థెరపీ ఈ తరహా మచ్చలను పోగొడుతుంది. ఎర్రటి దద్దుర్లు, ముడతలు, యాక్నేలను కూడా ఈ చికిత్స పోగొడుతుందని చర్మనిపుణులు చెపుతున్నారు. అంతేకాదు పుండు ఆరిపోవడానికి, స్ట్రెచ్ మార్క్సు ను తగ్గించడానికి, వయసువల్ల వచ్చే మచ్చలు, ముడతలు, చర్మంపై పడే గీతలను పోగొట్టడానికి, ఫేషియల్ టెక్స్చెర్ ను పెంచడానికి, ఎగ్జిమా, సొరియాసిస్, రొసాసియా వంటి చర్మ సమస్యలను ఈ థెరపీ ద్వారా నివారిస్తారు. ముఖంపై మచ్చలను, గీతలను తగ్గించడంతోపాటు సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని పరిరక్షిస్తుంది. యాక్నేను నివారిస్తుంది.

యాండ్రోజెనిక్ అలొపేసియా ఉన్న వారిలో శిరోజాల పెరుగుదలకు కూడా ఈ చికిత్స ఎంతగానో సహకరిస్తుందని చర్మనిపుణులు చెప్తున్నారు. పరిమితులకు లోబడి ఈ చికిత్స ను అనుసరిస్తే దీనివల్ల ఎలాంటి రిస్కులు తలెత్తవని కూడా చర్మనిపుణులు భరోసా ఇస్తున్నారు. చర్మనిపుణుల సలహాతో ఈ థెరపీకి వెడితే మంచిదని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News