Thursday, June 5, 2025
Homeహెల్త్Exercise: ఇలా ఎక్సర్‌సైజ్‌చేస్తున్నారా.. అయితే మీ కిడ్నీలు ఫసక్..!

Exercise: ఇలా ఎక్సర్‌సైజ్‌చేస్తున్నారా.. అయితే మీ కిడ్నీలు ఫసక్..!

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం గంటసేపు ఫిజికల్ యాక్టివిటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ, కొందరు దేహదారుఢ్యం కోసం అవసరమైన స్థాయికి మించి వ్యాయామం చేస్తున్నారు. అలాంటి అలవాట్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

ముఖ్యంగా యువత ఎంతో మంది జిమ్‌లలో గంటల కొద్దీ శ్రమిస్తూ సిక్స్‌ప్యాక్స్, ఎయిట్‌ప్యాక్స్ కోసం పరితపిస్తున్నారు. శరీరానికి బలం రావాలని ప్రత్యేకంగా ప్రోటీన్ పౌడర్‌లు, క్రియాటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అయితే ఇదే విషయంలో వైద్యులు అప్రమత్తం చేస్తున్నారు. క్రియాటిన్ అనేది శరీరంలో సహజంగా ఉండే పదార్థం. ఇది కండరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కానీ అధికంగా బయట నుంచి క్రియాటిన్ పౌడర్లు తీసుకుంటే శరీరంలోని స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి. తద్వారా కిడ్నీలపై బరువు పడుతుంది. ఈ పదార్థాన్ని శరీరం వదలివేయాలంటే కిడ్నీలు ఎక్కువగా పని చేయాలి. అంత శ్రమిస్తే అవి బలహీనపడతాయి.

సాధారణంగా రక్తంలో క్రియాటినిన్ స్థాయి 0.7 నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. కానీ సప్లిమెంట్ల వాడకంతో అది 25 ఎంజీ/డీఎల్ వరకు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే స్థాయిలో ప్రమాదకరం. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ లేకుండా జీవితం కొనసాగడం కష్టమే. కాబట్టి, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే… తప్పు దిశలో వెళ్లకూడదు. నేచురల్ ఫుడ్, సమతుల్య ఆహారం, సాధారణ వ్యాయామంతోనే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇలాంటి సప్లిమెంట్స్ ఆశ్రయించడం ద్వారా శరీరాన్ని రోగాలకు బలిచేయొద్దు. క్రియాటిన్, ప్రోటీన్ పౌడర్లు వాడేటప్పుడు ముందు వైద్యుల సలహా తీసుకోవడం మరచిపోవద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News