Saturday, November 15, 2025
Homeహెల్త్షుగర్ బాధితులు రోజుకు ఎంత బెల్లం తినొచ్చు.. నిపుణుల సూచన ఇదే..!

షుగర్ బాధితులు రోజుకు ఎంత బెల్లం తినొచ్చు.. నిపుణుల సూచన ఇదే..!

రోజు రోజుకు జీవనశైలిలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఆహారపు అలవాట్లను మార్చుకునే దిశగా అనేక మంది ముందడుగు వేస్తున్నారు. చాలా మంది డయాబెటిస్ బాధితులు చక్కెరను వదిలిపెట్టి బెల్లాన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మంచిదేనా.. బెల్లం వాడితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. ఎంత బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిది. ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

సాధారణంగా షుగర్ బాధితులు.. ఎక్కువ తీపి వస్తువులు తినకూడదని చెబుతుంటారు. అయితే వీరు తీపి కోసం బెల్లం వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర కేవలం ఖాళీ కేలరీలు మాత్రమే ఇస్తుందని, కానీ బెల్లం శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉండటం వల్ల అది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

అంతేగాక, బెల్లం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, రక్తపోటు నియంత్రణకు ఇది ఉపకరిస్తుందని వివరించారు. అలాగే, ఇది శక్తిని నెమ్మదిగా విడుదల చేయడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే బెల్లం కూడా ఓ రకమైన చక్కెరే అని గుర్తుంచుకోవాలి. అందులోనూ అధిక కేలరీలు ఉంటాయి. అందుకే మితంగా మాత్రమే తీసుకోవాలని సూచించారు. మధుమేహం ఉన్నవారు బెల్లాన్ని తినే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెరతో పోలిస్తే తక్కువగా ఉన్నా, రక్తంలో చక్కెర స్థాయిని అది ప్రభావితం చేయవచ్చని ఆమె హెచ్చరించారు.

అంతేకాదు, ప్రాసెస్ చేయని స్వచ్ఛమైన బెల్లాన్ని మాత్రమే ఎంచుకోవాలని.. అప్పుడే దాని ఆరోగ్య ప్రయోజనాలు వాస్తవంగా ఉపయోగపడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి బెల్లం ఓ మంచి ప్రత్యామ్నాయం అయినప్పటికీ, మితంగా వాడకమే మంచిదని నిపుణుల సూచన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad