నేటి కాలంలో, మనం నిరంతరం స్క్రీన్ల ముందు ఉంటున్నాము. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్ తరచూ వాడటం వల్ల ఇవి కంటి ఆరోగ్యానికి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. చిన్న పిల్లలు, యువకులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నందున, కంటి చూపు వేగంగా తగ్గిపోతుంది. అయితే, ఈ సమస్యను సులభంగా నివారించేందుకు ఒక పండు చాలా సహాయపడుతుంది అది అరటిపండు!
అరటిపండులో విటమిన్ A, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిలోని విటమిన్ A కంటిలోని రెటినా ను ఆరోగ్యంగా ఉంచి, రాత్రిపూట చూడటంలో ఇబ్బంది వచ్చే “రే చీకటి” సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అరటిపండు కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది, కంటి అలసటను తగ్గిస్తుంది.

పరిశోధనల ప్రకారం, అరటిపండ్లు కంటి కండరాలను బలపరచడంలో సహాయపడతాయి. వయస్సు పెరిగేకొద్దీ కంటి కండరాలు బలహీనపడుతుంటాయి, అయితే అరటిపండ్లు ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
అయితే, కంటి ఆరోగ్యం కోసం ఈ పండును ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకోండి, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.