Friday, November 22, 2024
Homeహెల్త్Eye Care: కళ్లు కాంతివంతంగా ఉండాలంటే?!

Eye Care: కళ్లు కాంతివంతంగా ఉండాలంటే?!

Eye Care: కళ్లకింద నల్లటి వలయాలతోపాటు కళ్లు ఉబ్బినట్టు ఉంటున్నాయా.. ఇందుకు కారణాలు బోలెడు. మొటిమలు, అలర్జీలు, ఒత్తిడి, కళ్ళు బాగా అలసిపోవడం, చర్మ స్వభావంతో పాటు స్వభావసిద్ధమైన ముఖం తీరుతెన్నుల వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. కళ్ల కింద ఉబ్బెత్తుగా ఉండి బాగా ఆలసిపోయినట్టు కనిపిస్తారు. నిద్రలేమివల్ల కళ్ల కింద నల్ల వలయాలు ఏర్పడతాయి. కళ్ల కింద బ్యాగుల్లా ఏర్పడతాయి. తగినంత నిద్ర పోతే కళ్లు కాంతివంతం అవుతాయి. కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి. కళ్లు ఉబ్బరించవు. బాగా నిద్ర పోవడం వల్ల చర్మంలోని కణజాలం యాక్టివ్‌ అవుతాయి. కణాలు దెబ్బతినకఁండా ఉంటాయి. అలాగే మీరు తినే ఆహారం కూడా మీ చర్మానిశీ, కళ్లను కాంతివంతం చేస్తాయి. డైట్‌లో కె, సి, ఎ, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -

ఈ విటమిన్లు కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను తగ్గిస్తాయి. పుచ్చకాయ, టొమాటోలు, ఆకుకూరలు, బెర్రీలు, బ్రొకోలీ, పెద్ద చిక్కుళ్లు, కీర వంటి వాటిని బాగా తినాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో కళ్ల కింద వాపు, బ్యాగుల్లా ఏర్పడడం జరుగుతుంది. అందుకే ఉప్పు, ఆల్కహాల్‌ వంటి వాటిని తగ్గించి నీటిని బాగా తాగుతుండాలి. దీంతో చర్మంకు తగినంత తేమ లభ్యమయి కాంతివంతంగా ఉంటుంది. రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కళ్లకింద వాపు లేదా ఉబ్బినట్టుగాని ఉండదు. కళ్ల కింద భాగానికి తేమ అందేలా ఐమాస్కులు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఐ జల్‌ సిరమ్‌లు వాడొచ్చు. ఇవి కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను, బ్యాగులను తగ్గిస్తాయి.

కంటి కింద భాగంలోని చర్మం ముడతలు పడకుండా సున్నితంగా ఉంటుంది. కళ్ల చుట్టూరా ఉన్న చర్మం కాంతివంతమయి మెరుస్తుంటుంది. సూర్యకిరణాల వల్ల కంటి కింద చర్మం తొందరగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల ఆ భాగంలో నల్లటి వలయాలు ఏర్పడడం, కంటి కింద చర్మం ఉబ్బరించడం చూస్తాం. కంటి కింద ఉండే సున్నితమైన చర్మం దెబ్బతినకుండా ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా రాసుకోవాలి. ముఖంతోపాటు చేతులు, మెడ వంటి భాగాలకు కూడా సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. కంటి కింద ఉండే చర్మం దెబ్బతినకఁండా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడు చలువ కళ్లద్దాలు పెట్టుకుంటే కళ్లకు మరింత రక్షణగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News