Friday, November 22, 2024
Homeహెల్త్Face masks: నల్లమచ్చలు పోగొట్టే మాస్కులు

Face masks: నల్లమచ్చలు పోగొట్టే మాస్కులు

వయసు, యాక్నే, మొటిమల కారణంగా వచ్చే నల్లటి మచ్చలు

నల్లమచ్చలు పోవవడానికి వంటింటి మాస్కులు
ముఖం మీద నల్లమచ్చలు ఉన్నాయా? వయసు, యాక్నే, మొటిమల కారణంగా ముఖంపై ఈ నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి ప్రభావానికి గురికావడం వల్ల కూడా చర్మంపై దద్దుర్లు వస్తాయి. బ్లాక్ హెడ్స్ వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో రసాయనాలతో తయారుచేసిన బ్యూటీ ఉత్పత్తులు లేకపోలేదు. కానీ వీటి వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. అందుకే ఈ సమస్యలను పోగొట్టే సహజసిద్ధమైన చిట్కాలను అనుసరిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, దెబ్బతినదని బ్యూటీ నిపుణులు కూడా చెప్తున్నారు.

- Advertisement -

వాటిల్లో బేకింగ్ సోడా స్క్రబ్ ఒకటి. బేకింగ్ సోడా, కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ఈ స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు.ఇంకొకటి అలొవిరా ఫేస్ మాస్కు. అలొవిరా జెల్, విటమిన్ ఇ ఆయిల్, నిమ్మరసం తీసుకుని మూడింటి మిశ్రమంతో ఫేస్ మాస్కు తయారుచేసుకుని ముఖానికి పూసుకోవాలి. పసుపు ఫేస్ స్ర్కబ్ ఇంకొకటి. ఇందులో పసుపు, పెరుగు, నిమ్మరసం ఓట్ మీల్ ఈ నాలుగింటిని కలిపి స్క్రబ్ తయారు చేసుకుని దాన్ని ముఖానికి పట్టిస్తే నల్లమచ్చలపై మంచి ప్రభావం చూబిస్తుంది.

మరొకటి బంగాళాదుంప ఫేస్ మాస్క్. దీనికి బంగాళాదుంప రసం, నిమ్మరసం, బాదం నూనె మూడింటినీ కలిపి ఫేస్ మాస్కులా తయారు చేసుకుని ముఖానికి పూసుకోవచ్చు. మరొకటి టొమాటో ఫేస్ మాస్కు. ఇందులో టొమాటో రసం, నిమ్మరసం అవసరం. ఈ రెండింటి మిశ్రమంతో చేసిన ఫేస్ మాస్కును ముఖానికి పట్టించాలి. నిమ్మరసం, షుగర్ స్ర్కబ్ ముఖంపై ఉండే నల్లటి మచ్చలపై బాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి చక్కెర, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కావాలి. ఇందుకు ఒక టేబుల్ సపూన్ బ్రౌన్ లేదా తెల్ల పంచదార తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కాలపాలి. ఈ మూడింటినీ బాగా కలిపి ఆ స్క్రబ్ ను ముఖానికి పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఈ మాస్కుతో కూడా ముఖం మీద ఏర్పడ్డ నల్లటి మచ్చలు పోతాయి. వారానికి రెండుసార్లు ఈ మాస్కును ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

బేకింగ్ సోడా స్క్రబ్ ను కూడా ముఖానికి పట్టించుకోవచ్చు. ఇందుకు రెండు టేబుల్ స్పూన్ల బేకింగ సోడా, ఒక టేబుల్ స్పూను కొబ్బరినూనె, అర టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం తీసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలిపి దానితో ముఖాన్ని శుభ్రం చేయాలి. మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మ్రుతకణాలు పోతాయి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. బొప్పాయి ఫేస్ మాస్కుతో కూడా ముఖంపై నల్లమచ్చలు పోతాయి. తరిగిన బొప్పాయి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తేనె రెడీ పెట్టుకోవాలి. బొప్పాయి ముక్కలను గుజ్జులా చేసి అందులో తేనె కలిపి చర్మంపై రాసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. పొడిచర్మం వాళ్లు బొప్పాయి గుజ్జులో తేనెతో పాటు పాలమీగడ కూడా కలిపితే మంచి ఫలితం చూడొచ్చని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు.
జిడ్డు చర్మం ఉన్నవాళ్లయితే ఇందులో అరటేబుల్ స్పూను తాజా నిమ్మరసం కూడా చేరిస్తే జిడ్డు చర్మం కూడా శుభ్రం అయి కాంతివంతంగా తయారవుతుంది. ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత ఆ పేస్టును మెత్తటి గుడ్డతో శుభ్రంగా తుడిచేయాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగుసార్లు ముఖానికి అప్లై చేయొచ్చు. నిమ్మలోని విటమిన్ సి ముఖం మీద ఏర్పడ్డ నల్లమచ్చలను పూర్తిగా కనపడనీయకుండా చేస్తుంది. పాలమీగడ రాసుకోవడం వల్ల మంచి ఛాయ పెరుగుతారు. పాలమీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందుకు కారణం . పాలు, తేనెలు చర్మానికి కావలసినంత సాంత్వననిస్తాయి. అంతేకాదు చర్మానికి కావలసినంత తేమను కూడా అందిస్తాయి. టొమాటో, నిమ్మ ఫేస్ మాస్కు కూడా నల్లమచ్చలున్న ముఖంపై బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ తాజా టొమాటో జ్యూసు, అర టేబుల్ స్పూను తాజా నిమ్మరసం రెడీగా పెట్టుకోవాలి. ఈ కాంబినేషన్ తో పేస్టును రాసుకోవడం వల్ల ముఖంపై ఏర్పడ్డ నల్లమచ్చలు తగ్గుతాయి. చర్మం మ్రుదువుగా, పట్టులా తయారవుతుంది. టొమాటోల్లో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువే. ఇవి చర్మాన్ని ఎంతో యంగ్ గా ఉంచుతాయి. నల్లమచ్చలు, యాక్నేలు పోగొట్డడంలో కూడా నిమ్మ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అలొవిరా ఫేస్ మాస్కును కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అలొవిరా జెల్, అర టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్, అర టీస్పూను తాజా నిమ్మరసం తీసుకుని మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖం మీద రాసుకొని మూడ లేదా ఐదు నిమిషాల పాటు వ్రుత్తాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత ఆ మాస్కును అరగంట సేపు అలాగే ఉంచి ఆతర్వాత శుభ్రమైన గుడ్డతో దాన్ని తుడిచేసుకోవాలి. మీరు ఆశించిన ఫలితాలు వచ్చే వరకూ నిత్యం ఈ పద్ధతిని అనుసరిస్తే మంచిది. దీన్ని వారానికి మూడు లేదా నాలుగుసార్లు ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

మజ్జిగతో కూడా ఫేస్ మాస్కు చేయొచ్చు.ఈ ఫేస్ మాస్కు ముఖం మీద ఉండే నల్లమచ్చలను పోగొడుతుంది. మజ్జిగ మాస్కు కూడా ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొడుతుంది. అందుకే పన్నెండు టేబుల్ స్పూన్ల మజ్జిగ, ఒక టేబుల్ స్పూన్ మెత్తటి ఓట్స్ తీసుకుని దాన్ని మెత్తటి పేస్టులా చేసి ముఖానికి, చర్మానికి రాసుకుని మూడు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత 20 నిమిషాలపాటు అలాగే ఉంచుకుని తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మ్రుతకణాలు పోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News