ఫేషియల్స్ తో సొగసుగా…
ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల పొందే లాభాలు ఎన్నో. ముఖ్యంగా ఆవిరి చర్మపై చూపే ప్రభావం ఎంతో. చర్మ రంధ్రాల్లోకి ఆవిరి ఇంకి రంధ్రాలకు బాగా గాలి తగులుతుంది. అంతేకాదు సున్నితంగా ఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు పోతాయి. యాక్నే కారకాలైన మురికిని ఫేషియల్స్ పోగొడుతాయి. సిరమ్ తో స్కిన్ మసాజ్ బాగా అవుతుంది. ఫేషియల్స్ చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు బహుళ ప్రయోజనాలను పొందుతాం.
నిత్యం స్కిన్ కేర్ రొటీన్ ను పాటిస్తూ, తరచూ ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు చూడడానికి పట్టులా ఎంతో అందంగా కనిపిస్తుంది కూడా. ఫేషియల్స్ చర్మాన్ని శుభ్రం
చేయడమే కాదు చర్మానికి కాలసిన హైడ్రేషన్ను కూడా అందిస్తాయి. చర్మాన్ని యంగ్ గా కనిపించేలా చేస్తాయి. చర్మాన్ని మెరిపిస్తాయి. చర్మం అందంగా కనిపించాలంటే ఫేషియల్స్ తప్పనిసరిగా చేసుకోవాలి కూడా.
అంతేకాదు ఫేషియల్స్ ఎంతో రిలాక్సింగ్ ను కూడా ఇస్తాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది చర్మంపై ఎన్నో రకాల దుష్ప్రభవాలను చూపుతుంది. చర్మంపై బ్రేకవుట్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దాంతోపాటు చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. పొడిబారినట్టు అవుతుంది. వీటన్నింటికీ ఫేషియల్స్ చక్కటి మందు. ఫేషియల్స్ ను తరచుగా చేసుకోవాలి. కనీసం నెలకొకసారైనా తప్పనిసరిగా ఫేషియల్స్ చేసుకోవాలి. యాక్నే, ఇతర చర్మ సమస్యలు ఉన్నవారికే ఫేషియల్స్ పరిమితం కాదు. చర్మంపై పేరుకున్న మురికిని ప్రతిఒక్కరూ తొలగించుకోవాలంటే ఫేషియల్స్ తప్పనిసరి. అంతేకాదు చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆవిరిపట్టుకోవడం, ఫేషియల్ మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం
లోతుకంటా శుభ్రం అవుతుంది. సో ఫేషియల్స్ చేసుకుని పట్టులాంటి చర్మంతో మెరవండి…