Sunday, January 19, 2025
Homeహెల్త్ORS: ఒరిజినల్‌ ఓఆర్‌ఎస్ పిల్లలందరికీ అందాలని..

ORS: ఒరిజినల్‌ ఓఆర్‌ఎస్ పిల్లలందరికీ అందాలని..

నకిలీ ఓఆర్ఎస్ తో జాగ్రత్త

ఓఆర్‌ ఎస్ ఒక డ్రగ్‌. డయేరియా నుంచి చిన్నారుల ప్రాణాలను రక్షించే లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్‌. అలాంటి డబ్ల్యుహెచ్‌ వొ ‘రికమెండెడ్‌ సొల్యూషన్‌ ఓఆర్‌ ఎస్’ కు ప్రత్యామ్నాయంగా ఫేక్‌ ఓఆర్‌ ఎస్ అయిన ‘ఓఆర్‌ఎస్ఎల్‌’ వచ్చింది. మార్కెట్‌ అమ్మకాలలో సైతం అది ముందుంటోంది. మరి అది నిజంగా అంత మంచి ఓఆర్‌ఎస్సా? అంటే కానే కాదు . ఇంకా చెప్పాలంటే డబ్ల్యుహెచ్వొ రికమెండెడ్‌ ఓఆర్‌ ఎస్ ఫార్ములా కు భిన్నంగా ఈ ఓఆర్‌ఎస్ఎల్‌ లో షుగర్‌ ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది డయేరియాను మరింత తీవ్రతరం చేసి పసిపిల్లల ప్రాణాలనే మట్టుపెడుతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో ఇది మరింత తీవ్రమైన కాంప్లికేషన్లు తలెత్తేలా చేసి వారిని విగతజీవులను చేసే ప్రమాదం సైతం ఉంది. అలాంటి హానికరమైన నకిలీ ఓఆర్‌ ఎస్ బ్రాండు ఓఆర్‌ఎస్ ఎల్‌ ను నిషేధించాలని హైదరాబాదుకు చెందిన చీఫ్‌ పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. అందుకోసం ఆమె కలవని వైద్య సంస్థలు లేవు. మాట్లాడని వైద్యాధికారులు లేరు. చివరకు ఈ విషయంపై తెలంగాణా హైకోర్టు కు కూడా వెళ్లారామె. ఎంతో ప్రమాదకరమైన ఈ ప్రయాణం మీకెందుకని ఎందరో అడిగారు ఆమెని. దానికి ‘నా దేశంలోని చిన్నారుల, రాబోయే తరాల పసికూనలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే’ అని అంటారామె. ఆ విశేషాలు

- Advertisement -

‘ మా బాబుకు మోషన్స్​‍ ఎక్కువగా ఉండి ఏమీ తినడం లేదని హాస్పిటల్‌ కు వెళ్లా. అక్కడ మెడికల్‌ షాపులో ఓఆర్‌ ఎస్ ప్యాకట్‌ ఒకటి ఇచ్చారు. దాన్ని తాగినప్పటి నుంచి మా బాబుకు మోషన్స్​‍ ఇంకా ఎక్కువయ్యాయి. ఇదేంటని డాక్టరు దగ్గరకు వెళ్లి అడిగితే, ఇలాంటివి ఇవ్వద్దు, డబ్ల్యుహెచ్‌ వొ రికమెండెడ్‌ ఫార్ములా ఓఆర్‌ ఎస్ నే ఇవ్వాలని చెప్పారు’ – ఒక తండ్రి

‘మోషన్స్​‍ అవుతున్నాయని నేను మెడికల్‌ షాపులో(పేరున్న మందుల షాపు అది) ఓఆర్‌ ఎస్ ప్యాకట్స్​‍ ఇవ్వమని అడిగాను. వాళ్లిచ్చిన ఆ ప్యాకెట్స్​‍ తాగినప్పటి నుంచి నాకు మరింత నీళ్ల విరేచనాలు అదే పనిగా అవడం మొదలెట్టాయి. ఒంట్లో శక్తి హరించుకుపోయి శరీరం మొత్తం ఏదో అవుతున్నట్టయింది. పైగా నేను షుగర్‌ పేషంటును కూడా. ప్రాణం మీదకు వచ్చేట్టు ఉందని వెంటనే ఒక ఆసుపత్రికి అర్థరాత్రి పోతే అక్కడ డాక్టరు మోషన్స్​‍ తగ్గే ఇంజెక్షన్లు ఇచ్చారు. నా ఆ దురవస్థకి మెడికల్‌ షాపు నుంచి కొనుక్కుని తాగిన నకిలీ ఓఆర్‌ఎస్ఎల్‌ ప్యాకెట్లేనని ఆతర్వాత వైద్యులు చెపితే తెలిసింది’ -ఓ ఉద్యోగిని
‘ఇవి నా దగ్గరకు వచ్చిన పేషంట్ల స్వీయ అనుభవాలు. ఇలాంటి కేసులు తరచూ నేను ఎదుర్కొంటూవస్తున్నా. పైన చెప్పిన ఆ రెండు ఉదాహరణలు చదివితే చాలు నకిలీ ఓఆర్‌ ఎస్ ల వల్ల తలెత్తే ప్రమాదం ఎలా ఉంటుందో మీకు అర్థంమవడానికి. నకిలీ ఓఆర్‌ ఎస్ లు పిల్లల్లో, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో స్ర్రుష్టించే అల్లకల్లోలం, వారి ప్రాణాలకు సైతం అవి తెచ్చే ముప్పు అనూహ్యం. అందుకే ఈ నకిలీ ఓఆర్‌ ఎస్ లపై గత కొన్నేళ్లుగా పెద్ద పోరాటం చేస్తున్నా. ఈ క్రమంలో నా చుట్టూ ఉన్నవారితోనే కాదు నాకు తెలియని ముఖాలతో, బడా ఫార్మసీ కంపెనీలతో, మార్కెట్‌ శక్తులతో, మెడికల్‌ ప్రతినిధులతో యుద్ధం చేస్తూనే ఉన్నా. అలా వారి కంట్లో పెద్ద నలుసయ్యా. వారు నన్ను లొంగదీసుకునేందుకూ ప్రయత్నించారు. కానీ ఎలాంటి లంచాల వలలోనూ నేను పడలేదు. మార్కెట్‌ లో షుగర్‌ తో నిండి ఉన్న నకిలీ ఓఆర్‌ ఎస్ లపై నేను చేస్తున్న యుద్దం కనిపించని శత్రువుతో తలపడుతున్నట్టు ఉంది. అయినా ఆపను.
ఎక్కువ షుగర్‌ తో
అధిక షుగర్తో నిండి ఉన్న ఓఆర్‌ఎస్ఎల్‌ లాంటి తీయటి డ్రింకులను మార్కెట్‌ లో, ఫార్మసీల్లో ఓ ఆర్‌ ఎస్ అంటూ, ఎనర్జీ డ్రింకులంటూ అమ్ముతున్నారు. అవేవీ డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన ఓఆఆర్‌ ఎస్ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్​‍) కాదన్నది ఎందరికి తెలుసు? చదువుకోని వారిలోనే కాదు చదువుకున్న వారికి సైతం ఈ విషయంపై అవగాహన ఉండడం లేదు. దీంతో విరేచనాలతో (డయేరియా), వాంతులతో బాధపడుతున్న తమ పిల్లలకు ఎంతోమంది తల్లిదండ్రులు షుగర్‌ తో నిండి ఉన్న నకిలీ ఓఆర్‌ ఎస్, ‘ఎనర్జీ డ్రింకు’లనే ఇస్తున్నారు. తప్పుడు ఫార్ములాతో తయారైన ఈ ఫేక్‌ ఓఆర్‌ ఎస్ లుతీయటి డ్రింకులు పిల్లల పాలిట విషం అవడమే కాదు వారి ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే డయేరియా కారణంగా మనదేశంలో ఐదేళ్ల వయసు పిల్లల్లో 13 శాతం మంది చనిపోతున్నారు. చిన్నారుల మరణాలకు ఇది మూడవ ముఖ్య కారణంగా నిలుస్తోంది.
డబ్ల్యుహెచ్‌ వొకు విరుద్ధంగా
మార్కెట్‌ లో దొరుకుతున్న ఫ్లేవర్డ్‍ ఓఆర్‌ఎస్ఎల్‌ లో అధిక షుగర్‌ ప్రమాణాలు ఉండడం వల్ల డయేరియాతో బాధపడుతున్న చిన్నారుల పరిస్థితి విషమంగా మారి చివరికి హాస్పిటల్స్​‍ పాలవుతున్నారు. నిజం ఏమిటంటే ఓఆర్‌ఎస్ తీయగా ఉండదు. షుగర్‌ ఎక్కువగా ఉండి తీయగా ఉన్న ఓఆర్‌ ఎస్ లు డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత ప్రమాణాలకు పూర్తిగా భిన్నమైనవి, వ్యతిరేకమైనవి. అంతేకాదు అలాంటి ఓఆర్‌ ఎస్ లు చట్టవిరుద్ధమైనవి, అక్రమమైనవి కూడా. ఇలాంటి ఫేక్‌, తీయటి ఓఆర్‌ ఎస్ డ్రింకులు ప్రాణానికి చేసే హాని ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఈ ఓఆర్‌ ఎస్ పోరాటం వైపు నా చూపు పడడానికి కారణం నా దగ్గరకు వచ్చే చాలామంది పిల్లల తల్లిదండ్రులు డయేరియాతో బాధపడుతున్న తమ పిల్లలకు ఓఆర్‌ ఎస్ ఇచ్చినా విరేచనాలు, వాంతులు తగ్గడం లేదని చెపుతుండడం. వారిస్తున్న ఓఆర్‌ ఎస్ ఏంటని చెక్‌ చేస్తే అవి ఫ్లేవర్డ్‍ ఓఆర్‌ఎస్ టెట్రాప్యాక్స్​​‍. అందులో చక్కెరపాళ్లు విపరీతంగా ఉంటాయి. ఆందోళనకరమైన మరో విషయం ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ వొ) నిర్దేశించిన ఓఆర్‌ ఎస్ ఫార్ములాలోని ప్రమాణాల అతిక్రమణ వీటిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫేక్‌ ఓఆర్‌ఎస్ ప్యాక్స్​​‍ లో షుగర్‌ విపరీతంగా ఉండడం ఆందోళన కలిగించే ఒక విషయమైతే, ఉప్పు కూడా డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత ప్రమాణాలలో ఇందులో లేదు. అంటే వీటి తయారీదారులు డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశించిన ఓఆర్‌ ఎస్ ప్రమాణాలను బహిరంగంగా అతిక్రమిస్తున్నారు . తోసిరాజంటున్నారు. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలా వీళ్లు అనైతికతకు, అమానవీయతకు పరాకాష్టగా నిలుస్తున్నారు.
పక్కదారిపట్టిస్తున్న ఫార్మా మాఫియా
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్‌ ఫ్లేవర్డ్‍ ఓఆర్‌ఎస్ విషయంలోనూ ఫార్మసీ మార్కెట్‌ మాఫియా పక్కదారులు పడుతోంది. వాటి లేబుల్‌ మీద డబ్ల్యుహెచ్వొ రికమెండెడ్‌ ఫార్ములాతో తయారైందన్నది ఉండడంలేదు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలిస్తూ తయారు చేస్తున్న ఈ ఫ్లేవర్డ్‍ ఫేక్‌ ఓఆర్‌ఎస్ఎల్‌ కు ‘ఆర్సెల్‌’ అని అంటూ సెలబ్రిటీలతో ప్రకటనలు గుప్పిస్తున్నారు ఫార్మా, మెడికల్‌ మాఫియాలు. నీరసం, జ్వరం ఉన్నప్పుడు వాడే ఎనర్జీ డ్రింకులు ఇవంటూ పేషంట్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒకవైపు ప్రపంచం మొత్తం షుగర్‌ వాడకాన్ని తగ్గించమని అంటుంటే ఫార్మసీలు మటుకు ఈ తీపి డ్రింకులను, ముఖ్యంగా డయేరియా బాధితుల ప్రాణాలను తీసే అత్యంత ప్రమాదకరమైన ఈ ఫేక్‌ ఓఆర్‌ఎస్ \ ఎనర్జీ డ్రింకులను బహిరంగంగా అమ్ముతున్నాయి. ఓఆర్‌ ఎస్ అనేది ఒక మందు. విరేచనాలు, వాంతులు బారిన పడినపుడు దీన్ని వాడతారు. దాన్ని కాస్తా డబ్ల్యూహెచ్వొ ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకంగా ‘తీయటి ఫ్లేవర్డ్‍ నకిలీ ఓఆర్‌ఎస్‘ డ్రింకులుగా ప్రజల్లోకి తీసుకెడుతున్నారు. ఇలాంటి కంపెనీలన్నింటికీ ఓఆర్‌ ఎస్ అనేది లాభాలు తెచ్చిపెట్టే మార్కెట్‌ స్ట్రాటజీ అయింది. ఓఆర్‌ఎస్ అన్న మాటను ఉపయోగించుకుంటూ ఇలాంటి అక్రమాలకు బహిరంగంగానే తయారీదారులు పాల్పడుతున్నారు. పేషంట్లను, వినియోగదారులను పక్కదారిపట్టిస్తున్నారు. ఇంకా ఈ ఫేక్‌ ఓఆర్‌ ఎస్ లపై కొంతమంది వైద్యుల చేత ‘స్టడీ’ చేయించి మరీ వారి చేత ‘ఇవి మాకెంతో బాగా అనిపించాయి’ అని ‘చెప్పిస్తున్నారు’. ‘స్టడీస్’ అంటే ఇలా ఉంటాయా? వాటిని ఎంత శాస్త్రీయంగా చేస్తారో తెలియదా ఎవరికీ? ఒఆర్‌ఎస్ పేరుతో లాభాల ఆర్జనే ఫార్మసీల, కంపెనీల, కొన్ని మెడికల్‌ వర్గాల ప్రధాన లక్ష్యం. ఇలాంటి వాళ్లు ఇప్పుడు అనుసరిస్తున్న మరో టెక్నిక్‌ ఏమిటో తెలుసా? ఈ ‘ఆర్సెల్స్​‍’ ( సుగర్‌ తో నిండి ఉండి ఎంతో ప్రమాదకరమైన ‘ఓఆర్‌ ఎస్ ఎల్‌’ బ్రాండునే సెలబ్రిటీల చేత అలా అనిపిస్తున్నారు) ను ఎనర్జీ డ్రింకుగా ప్రచారం చేసేందుకు న్యూట్రిషనిస్టులను ఉపయోగించుకోవడానికి కూడా వీళ్లు వెనుకంజ వేయడం లేదు.

మధుమేహులకు ప్రాణాంతకం
ఈ డ్రింకులు చిన్నారులపై, షుగర్‌ వ్యాధిగ్రస్థులపైనే కాదు అన్ని వయసుల వారిపై చూపే తీవ్ర ప్రభావం గురించి ప్రజల్లో , పిల్లల తల్లిదండ్రుల్లో ఉన్న అవగాహనా రాహిత్యం వల్ల కూడా ఈ సమస్య మరింత తీవ్రతరం అయింది. ఈ తీపి ఫేక్‌ ఓఆర్‌ఎస్ లు పల్లెలకు సైతం చేరి ఉంటాయనడంలో సందేహం లేదు. ఇలాంటి విషపూరితమైన ‘తీపి’ ఓఆర్‌ ఎస్ డ్రింకులపై పట్టణాల్లోనే అవగాహన లేని పరిస్థితుల్లో పల్లె ప్రజలకు వీటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఏం తెలుస్తుంది? చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల తలెత్తే జబ్బులు గురించి నిత్యం మనం వింటూనే ఉన్నాం కదా. మరి తీపి విపరీతంగా ఉండే ఈ డ్రింకులు ముఖ్యంగా పిల్లలకు, యువతకు చేసే హాని వేరే చెప్పాలా? నిజానికి ముందే చెప్పుకున్నట్టు ఒఆర్‌ఎస్ లు తీయగా ఉండవు. వీటిని కొనేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అమ్మకాలు పెంచుకోవడానికి పలు రకాల ఓఆర్‌ఎస్ బ్రాండ్స్​‍ ను అధిక షుగర్‌ పాళ్లతో పాటు రకరకాల ఫ్లేవర్స్​‍ తో మార్కెట్‌ లోకి పలు కంపెనీలు తెస్తున్నాయి. నేను ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే. మీ పిల్లలకు విరేచనాలు , వాంతులు అవుతున్నప్పుడు డబ్ల్యుహెచ్‌ వొ రికమెండెడ్‌ ఓఆర్‌ ఎస్ నే కొనాలి. దాన్నే వాడాలి. ఎందుకంటే మనం చూస్తున్న ఫేక్‌ ఓఆర్‌ఎస్ డ్రింకుల్లో షుగర్‌ బాగా ఎక్కువగా ఉంటోంది. షుగర్‌ ఎక్కువగా ఉంటే అది పేషంట్లను మరింతగా డీహైడ్రేట్‌ అయ్యేలా చేస్తుందని మరవొద్దు. దాంతో డయేరియా సమస్య ఎక్కువ కావడమే కాదు డయేరియా సంబంధిత కాంప్లికేషన్లు కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ ఉద్దేశంతో ఓఆర్‌ ఎస్ వాడాలని చెపుతున్నామో ఆ ఉద్దేశమే ఇక్కడ నెరవేరడంలేదన్నమాట. అందుకే ఈ విషయంలో పిల్లలకు ఫ్లేవర్స్​‍ ఉన్నవి కావాలని తల్లిదండ్రులు కొంటే అది చిన్నారుల ప్రాణాలకే ముప్పు తెస్తుందని గుర్తుంచుకోండి.
మార్కెట్‌ నిండా నకిలీ ఓఆర్‌ఎస్ లే
డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత కంపోజిషన్‌ తో తయారుకాని ప్రాడక్టుకు ‘ఓఆర్‌ఎస్’ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ సొల్యూషన్‌) లేబిలింగ్‌ ’ నిషేధం ఉంది. కానీ అలాంటి శాచెట్లు కూడా బయట మార్కెట్‌ లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్నాయి. వాటిమీద ఓఆర్‌ ఎస్ అని పెద్ద అక్షరాల్లో ఉంటున్నాయి. ఓ ఆర్‌ ఎస్ ఎల్‌, రీహైడ్రేట్‌, ఆర్స్​‍ ఫిట్‌, క్యుఆర్‌ ఎస్, ఎలక్ట్రోప్లస్ ఓఆర్‌ ఎస్ వంటి ఉత్పత్తులు మార్కెట్‌ లో కొలువుదీరి ఉంటున్నాయి. ఇదేంటి? అని వారిని ఎవరూ ప్రశ్నించేవారే లేకుండాపోయారు. ఇంకొక సమస్య ఏమిటంటే వైద్యులు సరైన ఓఆర్‌ ఎస్ ను (డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన ఫార్ములా తో కూడినది) ప్రిస్క్రైబ్‌ చేసినా కూడా చట్టవిరుద్ధమైన నకిలీ ఓఆర్‌ ఎస్ ఉత్పత్తుల వినియోగంతో పేషంట్లల్లో డయేరియా, వాంతులు తగ్గడం లేదు. చివరకు వాళ్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. చిన్నారులైతే ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ‘ఓఆర్‌ ఎస్’ దుర్వినియోగం అవుతున్న తీరుతెన్నులను సవివరంగా సంబంధిత అధికారుల ద్రుష్టికి తెచ్చా. దీంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్​‍ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్ ఎస్ ఎ ఐ) ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఓఆర్‌ఎస్ లేదా అదే అర్థంలో ఉండే ఉత్పత్తుల్లో నిర్దేశించిన రీతిలో ఓఆర్‌ఎస్ కంపోజిషన్‌ లేకపోతే అది నిబంధనల అతిక్రమణ అవుతుందని అందులో పేర్కొంది. అది వచ్చినా కూడా నకిలీ ఓఆర్‌ ఎస్ ఉత్పత్తులు మార్కెట్‌ లో నిరాటంకంగా దర్శనమిస్తూనే ఉన్నాయి. చివరకు నేను, మరికొందరు వైద్యులు రాష్ట్ర హైకోర్టు మెట్లు ఎక్కాం. ఎఫ్‌ ఎస్ ఎస్ ఎ ఐ జారీ చేసిన అదేశం కఠినంగా అమలు జరగాలని కోర్టును కోరాం. నకిలీ ఓఆర్‌ ఎస్ తయారీదారులు, వెండర్స్​‍, ఇతర ఉత్పత్తి దారులను ప్రాసిక్యూట్‌ చేయాలని తెలంగాణా హైకోర్టులో పిటిషన్‌ ఫైల్‌ చేశా. ఈ విషయంలో అధికారులు అచేతనంగా, నియంత్రుత్వ ధోరణిలో, చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. సబ్స్​టిట్యూట్‌ ఓఆర్‌ ఎస్ ఉత్పత్తులను తనిఖీ చేయాలని ‘ఎఫ్‌ ఎస్ ఎస్ ఎఐ’ స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది కానీ సంబంధిత అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం లేదు. ఇలాంటి ఎంతో ప్రమాదకరమైన, డయేరియా బారిన పడ్డ పిల్లల ప్రాణాలను తీసే ఫేక్‌ ఓఆర్‌ఎస్ లు హైదరాబాదులో ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ఇలాంటి నకిలీ ఓఆర్‌ఎస్ ల మీద నేను పోరాడడానికి సిద్ధపడడానికి కారణం ఇప్పటి పిల్లలు, రానున్న తరం పిల్లల ఆరోగ్యం కోసమే. బంగారు భవిష్యత్తు కోసమే. నిజానికి ఈ పోరాటం ఎంతో సంక్లిష్టమైంది. పెనుసవాళ్లతో కూడినది. ప్రమాదకరమైంది. కానీ ధైర్యంతో అడుగులు వేస్తున్నా. నాకు తోడుగా ఇప్పుడు ఎందరో ముందుకు రావడం సంతోషంగా ఉంది. నా ఈ పోరాట క్రమంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ‘ఓఆర్‌ ఎస్ ఎల్‌ కొనడం పేరెంట్స్​‍ ఛాయిస్’ అంటూ వ్యాఖ్యానించారు .ఇది నన్ను షాక్‌ కు గురిచేసింది. అచేతనం చేసింది. ఏం చెప్పాలి?!
చట్టాలున్నా
నా ఈ పోరాటంలో కోర్టునే కాదు రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖను కూడా ఎనర్జీ డ్రింకులు, ఫ్రూట్‌ జ్యూసులను ఓఆర్‌ఎస్ గా లేబిలింగ్‌ చేసి అమ్మడాన్ని అనుమతించవద్దని కోరాను. ఐఎపి జాతీయ సదస్సులో ఓఆర్‌ ఎల్‌ స్టాల్‌ పెట్టమని మాటిచ్చికూడా పెట్టినపుడు నేను చాలా డిస్ట్రబ్‌ అయ్యా. డబ్ల్యుహెచ్‌ వొ రికమెండెడ్‌ ఫార్ములాతో కూడిన ఓఆర్‌ ఎస్ గా ఓఆర్‌ఎస్ఎల్‌ ను లాంచ్‌ చేస్తే సమస్య ఎవరికైనా ఎందుకు ఉంటుంది? కానీ ఆ స్టాల్‌ లోని ఓఆర్‌ ఎస్ ఎల్‌ లో అధికపాళ్లల్లో షుగర్‌ ఉంది. ఈ ధోరణి మన వ్యవస్థ తీరుతెన్నులకు కేవలం ఒక ఉదాహరణ. ఫ్రూట్‌ జ్యూసు కంపెనీలకు కూడా ‘ఒఆర్‌ ఎస్’ అనే మాట ఉపయోగించవద్దని ఎఫ్‌ ఎస్ ఎస్ ఎ ఐ హెచ్చరించింది. అయినా వీటిని మార్కెట్‌ చేస్తున్నారంటే వీరంతా పసిపిల్లల ప్రాణాలతో నిర్దయగా చెలగాటమాడుతున్నారన్నమాట. ఓఆర్‌ ఎస్ పేరుతో తమ ఉత్పత్తులను ఎన్నో కంపెనీలు బ్రాండింగ్‌ చేసుకుంటూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నాయి. ఓఆర్‌ఎస్ ఎల్‌, ఓఆర్‌ ఎస్ ఫిట్‌ వంటివి అలాంటివే. వీటిని తాగడం వల్ల పేషంట్లకు ఎంతో హాని కలుగుతోంది.
ఎనర్జీ డ్రింకులంటూ ఇవి తాగేవారి ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని వైద్యనిపుణులు ఎందరో తరచూ హెచ్చరిస్తూనే వస్తున్నారు. కానీ వీటి వ్యాప్తి , కొనుగోళ్లు ఆపలేనిరీతిలో నిరాటంకంగా జరిగిపోతున్నాయి. నిజానికి ఇలా ఓఆర్‌ ఎస్ పేరుతో తప్పుడు ఓఆర్‌ ఎస్ ఉత్పత్తుల అమ్మకాలు చేసే వ్యాపారులను ఐపిసిలోని రకరకాల ప్రోవిజన్స్​‍ కింద , అలాగే డ్రగ్స్​‍ అండ్‌ కాసమొటిక్స్​​‍ యాక్ట్‍, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్​‍, ది డ్రగ్స్​‍ అండ్‌ మేజిక్‌ రెమిడీస్ ప్రొహిబిషన్‌ యాక్ట్‍ వంటి వాటి కింద చర్యలు తీసుకోవచ్చు.
డబ్ల్యూహెచ్‌ వొ ఓఆర్‌ ఎస్ లు ఉండట్లేదు
ఓఆర్‌ ఎస్ అనేది లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్‌. మరీ ముఖ్యంగా డీహైడ్రేషన్‌ తో బాధపడే చిన్నారులకు ఇది సంజీవని. ఈ విషయంలో వరల్డ్​‍ హెల్త్‍ ఆర్గనైజేషన్‌ చేసిన ఓఆర్‌ఎస్ ఫార్ములానే పూర్తిగా నమ్మదగింది. కానీ ఫార్మాకంపెనీలు ఫేక్‌ ఓఆర్‌ ఎస్ లను ఇష్టంవచ్చినట్టు అమ్ముతున్నాయి. ఇంకా దురద్రుష్టకరమైన విషయం ఏమిటంటే పలు మెడికల్‌ షాపుల్లో డబ్ల్యుహెచ్‌ వొ రికమెండెడ్‌ ఓఆర్‌ ఎస్ లు ఉండటంలేదు. ఎవరు ఓఆర్‌ ఎస్ లు అడిగినా వాళ్లు ఫ్లేవర్డ్‍ టెట్రాప్యాక్స్​​‍ ఇస్తున్నారు. ఇవి షుగర్స్​‍ తో నిండి ఉంటున్నాయి. ఓఆర్‌ఎస్ ఎల్‌, ఓఆర్‌ఎస్ ఎల్‌ ప్లస్, ఫ్రూట్నిక్‌ ఎలక్ట్రోప్లస్ ఓఆర్‌ ఎస్ ఇవన్నీ ఓఆర్‌ ఎస్ లని మార్కెట్‌ చేస్తున్నారు. కానీ ఇవి డబ్ల్యుహెచ్‌ వొ నిర్దేశిత ఓఆర్‌ ఎస్ ప్రమాణాలను పాటించడం లేదు. వీటిల్లో షుగర్‌ ఎక్కువగా ఉండడంతో డీహైడ్రేషన్‌, డయేరియాలు ఎక్కువవుతాయి. ఓస్మొటిక్‌ డయారియాకు , ఎలక్ట్రోలైట్‌ అసమతుల్యతకు దారితీస్తుంది. ఆసుపత్రి పాలవుతాము. ఓఆర్‌ ఎస్ ఎల్‌ మధుమేహుల్లో స్రుష్టించే కాంప్లికేషన్లు ఎన్నో. ఈ ఓఆర్‌ఎస్ లో ఉన్న అదనపు షుగర్‌ వల్ల వీరి పరిస్థితి మరింత విషమిస్తుంది. అలాంటి ఓఆర్‌ ఎస్ ఎల్‌ ను ప్రత్యామ్నాయ ఓఆర్‌ఎస్ గా ఎలా అంగీకరిస్తారు? దీంతో ఆ కంపెనీ ‘డయేరియా ఉన్నప్పుడు దీన్ని వాడొద్దం’టూ చిన్న డిస్క్లైమర్‌ చేర్చింది. ఇది చిన్న విజయమే కానీ ఎంత మంది ఈ డిస్క్లైమర్‌ ను చదువుతున్నారు?
అనైతికానికి పరాకాష్ట
ఫార్మా మాఫియా పాల్పడుతున్న ఈ చర్యలు ఎంత అనైతికమో విస్పష్టంగా తెలుస్తోంది. ఎందరో అనారోగ్యాలకు, మరణాలకు ఇవి కారణమవుతున్నాయి. ఇంకోవైపు ఈ ఓర్‌ ఎస్ ఎల్‌ ను ‘ఓఆర్‌ఎస్’ గా పెద్దెత్తున ఫార్మసీలు అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నాయి. ఓఆర్‌ఎస్ ఎల్‌ తో ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. డయేరియా బారిన పడిన చిన్నారుల లక్షణాలను ఈ ఫేక్‌ ఓఆర్‌ ఎస్ డ్రింకులు మరింత దిగజార్చి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. చిన్నారుల జీవితాలను సైతం చిదిమేయడానికి వెనుకంజ వేయని మందుల కంపెనీలు చేస్తున్న ఈ నిర్వాకం చూస్తుంటే శవాల మీద చిల్లర కాదు..కాదు నోట్లకట్టలు ఏరుకోవడంలా అనిపించడం లేదా? మనుషుల ప్రాణాల విషయంలోనూఅందులోనూ భవిష్యత్‌ వెలుగులైన చిన్నారుల ప్రాణాల విషయంలోనూ ఇంత నిర్లక్షమా?. ఈ విషయంలో నేను ఎంతవరకూ విజయం సాధిస్తానో తెలియదు కానీ నా పోరాటం మాత్రం కొనసాగిస్తా నేను చేస్తున్న ఈ పోరులో యంగ్‌ పీడియాట్రిక్స్​​‍ నుంచి, సోషల్‌ మీడియా, ఎంతోమంది పేరెంట్స్​‍, యువత , సినీ సెలబ్రిటీలు, మేథావులు నుంచి మద్దతు లభిస్తోంది. అంతేకాదు ఈ అంశంపై వాట్సప్‌ ద్వారా, ఇంకా స్కూళ్లల్లో పిల్లలను అవగాహన పరుస్తున్నా.

చిన్నారుల ప్రాణాలూ తీస్తున్నాయి
ఓఆర్‌ఎస్ఎల్‌ తాగిన చిన్నారుల్లో డయేరియా మరింత తీవ్రతరం అవుతుంది. డయేరియా ఉంటే ఇది తాగొద్దు అనే చిన్న డిస్క్లైమర్‌ ఉన్నా కూడా ఈ ప్రాడక్టు దొరకని చోటు లేదు. మరీ విషాదకరమైన విషయం ఏమిటంటే డబ్ల్యుహెచ్‌ వొ రికమెండెండ ఓఆర్‌ ఎస్ శాచెట్లు దొరకడమే కష్టంగా ఉంది. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 200 ఎంఎల్‌ కు ఐదు టీస్పూన్ల షుగర్‌ తో హెల్త్‍ డ్రింకుగా చెప్పడం జనాన్ని పక్కదారిపట్టించడమే. దీనివల్ల ఆరోగ్యపరమైన రిస్కులు ఉన్నా మార్కెట్‌ లో దీని ఆధిక్యం నిరాటంకంగా సాగుతోంది. దీనిపై ఇండియన్‌ అకాడమీ ఆప్‌ పీడియాట్రిక్స్​​‍ జంటనగరాల బ్రాంచి లో తరచూ లేవనెత్తేదాన్ని. చాలామంది దీనిపట్ల సానుకూలంగా స్పందించలేదు. ఇది తనను ఎంతో నిరాశపరిచింది. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన ఐఎపి చిన్నారులకు ప్రమాదకరంగా ఉన్న ఎక్కువ షుగర్‌ ఉన్న ప్రాడక్టును ప్రోత్సహించడం ఏంటి? ఇలాంటి వాటి వల్ల తలెత్తే హాని తెలిసినా వాటిని ప్రోంత్సహించడం అనైతికం. ఐరనీ ఎక్కడ ఉందంటే ఇండియన్‌ అకాడమీ ఆప్‌ పీడియాట్రిక్స్​​‍ సరైన రీహైడ్రేషన్‌ కు ప్రాముఖ్యం ఇస్తుంది. అలాంటి సదస్సు ప్రాంగణంలో ఓఆర్‌ఎస్ ఎల్‌ స్టాల్‌ ఏర్పాటుచేయడం !.మరి ఇదే సంస్థ ఈ దేశం చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన ఆర్గనైజేషన్‌ కూడా. అందుకే ఓఆర్‌ఎస్ కు సంబంధించి నా అసోసియేషన్‌ తోనే నేను పోరాడాల్సి వచ్చింది. ఓఆర్‌ఎస్ ఎల్‌ గురించి ఐఎపి నాయకులకు తరచూ ఉత్తరాలు రాశాను. కోర్టులో పిల్‌ వేశాను. అసోసియేషన్‌ కలిసి రాలేదు. తెలంగాణా స్టేట్‌ చాప్టర్‌ ఆసక్తి చూపలేదు. సహకరించలేదు. అధికారులు చేయందించలేదు. అలాంటి వారితో కలిసి పనిచేయడం నాకు అసాధ్యంగా తోచింది. దాంతో ఐఎపిటిసిబి సభ్యురాలిగా రాజనామా చేసేసాను .. ఇలా సిస్టమ్‌ పనిచేస్తోంది. ఏంచేయాలి?దీనికి ఒకటే మార్గం. నైతికమైన, పిల్లల ఆరోగ్యం కేంద్రంగా ఉండే వ్యవస్థ ఇపుడు మనకు కావాలి’’-నాగసుందరి
ఇలా మొదలైంది
ఇటీవల హైదరాబాదులో ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్​​‍ (ఐఎపి) వార్షిక సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో ఏర్పాటు చేసిన ఓఆర్‌ ఎస్ ఎల్‌ స్టాల్‌ పెద్ద వివాదాన్ని రేపింది. దీనిపై హైదరాబాదుకు చెందిన పీడియాట్రిషియన్‌ శివరంజనీ సంతోష్‌ ఓఆర్‌ ఎస్ ఎల్‌ స్టాల్‌ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఓఆర్‌ ఎస్ ఎల్‌ ఎంత అనారోగ్యహేతువో ప్రజల్లో అవగాహన పెంచడానికి డాక్టర్‌ శివరంజనీ పూనుకున్న విషయం తెలిసిందే. ఓఆర్‌ ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఓఆర్‌ఎస్ ఎల్‌ ఎలా పరిగణిస్తారని డాక్టర్‌ శివరంజనీ పెద్దెత్తునే ఉద్యమించారు. దీనికి కారణం ఓఆర్‌ ఎస్ ఎల్‌ లో అధిక పాళ్లల్లో షుగర్‌ ఉండడమేనని ఆమె స్పష్టంచేశారు. దీనిపై గతంలో సెంట్రల్‌ డ్రగ్స్​‍ స్టాండర్డ్‍ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సిడిఎస్ సివొ)కు, అలాగే ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండరడ్స్​‍ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ ఎస్ ఎస్ ఎఐ)లకు ఆమె లేఖలు రాశారు. అంతేకాదు తెలంగాణా హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం వేశారు కూడా. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమండ్‌ చేసిన ఓఆర్‌ ఎస్ బ్రాండ్లయిన ఎలక్ట్రాల్‌, వాలైట్‌, ఎలక్ట్రోబియాన్‌ వంటివి సిడిఎస్ సివొ నుంచి పర్మిషన్‌ పొందాలి. దానికి బ్రాండ్‌ పేరు ఇవ్వాలి. దాని లేబుల్‌ పై డబ్ల్యుహెచ్‌ వొ రికమండెడ్‌ ఫార్ములా అని రాయాలి. ఓఆర్‌ ఎస్ ఎల్‌ పైనే కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. 2021లో సిడిఎస్ సివొకు దీనిపై లేఖ రాశారు. తర్వాత సిడిఎస్ సివొ ఆమెను ఎఫ్‌ ఎస్ ఎస్ ఎ ఐ ని అప్రోచ్‌ అవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఎఫ్‌ ఎస్ ఎస్ ఎఐకి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు కూడా దీనిపై ఆమె లేఖ రాశారు. ఈ విషయంపై చర్యలకు ఎఫ్‌ ఎస్ ఎస్ ఎ ఐని ఆమె కోరారు. ఆ క్రమంలోనే ఎఫ్‌ ఎస్ ఎస్ ఎ ఐ మిస్ లీడింగ్‌ లేబుల్స్​‍ ను అనుమతించేది లేదని స్పష్టంచేసింది. దీంతో సమస్యపరిష్కారమైనట్టేనని సంతోషించారు. కానీ ఆ ఆర్డర్‌ ను గత జులైలో అంటే రెండు నెలల్లో మార్చారు. అలా రిలాక్సింగ్‌ చేయడంతో ఇపుడు ఆ కంపెనీ డిస్ క్లైమర్‌ ను చేర్చి తన ఉత్పత్తిని నిరాటంకంగా అమ్ముకుంటోంది. డిస్క్లైమర్‌ లో ఇది ఓఆర్‌ ఎస్ కాదు, ఓఆర్‌ఎస్ఎల్‌ ఎనర్జీ డ్రింక్‌ అని మార్కెటింగ్‌ చేసుకుంటోంది. దాంతో ఇప్పుడు ఓ ఆర్‌ ఎస్ ఎల్‌ ‘ఎలక్ట్రోలైట్‌ డ్రింక్‌’ గా అమ్మబడుతోంది. అది ఎనర్జీని, హైడ్రేషన్‌ ను అందిస్తుందని అంటోంది. ఇది రీహైడ్రేషన్‌ డ్రింకు కానే కాదని డాక్టర్‌ శివరంజనీ గట్టిగా పోరాడుతున్నారు. కారణం ఈ డ్రింకు డయేరియాను మరింత ఎక్కువ చేస్తుందని, అంతేకాదు డయాబెటిస్ బాధితులకు కూడా ఇది ఎంతో హాని చేస్తుందని తెలిపారు. ఎక్కువ షుగర్‌ ఉన్న డ్రింకులను ఓఆర్‌ ఎస్ గా ప్రస్తావించడానికి వీలు లేదని పిల్‌ వేశారు.

ఓఆర్‌ ఎస్ఓఆర్‌ఎస్ఎల్‌ కు మధ్య తేడా ఇదే
ఓర్‌ ఎస్ ఎల్‌ కు ఓఆర్‌ ఎస్ కు మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఓఆర్‌ఎస్ లైఫ్‌ సేవింగ్‌ డ్రగ్‌. ఇది ప్రపంచంలోని ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడుతోంది. డయేరియా నివారణకు తొలిగా చేసే ట్రీట్మెంట్‌ రీహైడ్రేట్‌. డయేరియాకు ఉత్తమమైన పరిష్కారం ‘లో ఓస్మోలార్‌ ఓఆర్‌ఎస్’ నే. ప్రపంచ ఆరోగ్యసంస్థ లో ఓస్మోలార్‌ ఓఆర్‌ ఎస్ ప్రతి 100 ఎంఎల్‌ సొల్యూషన్‌ కు 1.35 గ్రాముల గ్లూకోజ్‌ ఉంటే కెన్వ్యూ కంపెనీ (2023 సంవత్సరం ఆగస్టులో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాళ్లు ఈ హెల్త్‍ ప్రోడక్టుల కోసం మొదలెట్టిన కొత్త కంపెనీ) ఓఆర్‌ఎస్ఎల్‌ లో 11 గ్రాములు షుగర్‌ ఉంటుంది. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన గ్లూకోజ్‌ మొత్తం కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువగా షుగర్‌ ఓఆర్‌ఎస్ఎల్‌ లో ఉంది. ఈ ఎక్స్​​‍ ట్రా షుగర్‌ నీటిని పేగులోకి లాక్కొంటుంది. దీంతో డయేరియ మరింత ఎక్కువవుతుంది. దాంతో పేషంటు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఓఆర్‌ఎస్ఎల్‌ ఎనర్జీ డ్రింకు . ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన షుగర్‌ కన్నా పది రెట్లు ఎక్కువ షుగర్‌ ప్రమాణాలు ఉన్నాయి.

ఓఆర్‌ఎస్ గురించి

  • ఓరల్‌ రీహైడ్రేషన్‌ సాల్ట్స్​‍ (ఓఆర్‌ ఎస్). డయేరియా, వాంతులు అయ్యేటప్పుడు దీన్ని ఇస్తారు. దీని ద్వారా డీహైడ్రేషన్‌ అవకుండా పేషంట్లు మరణించకుండా కాపాడతారు.- ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‍ అథారిటీ ఆఫ్‌ ఇండియా జారీచేసిన ఆదేశం ప్రకారం డిసిజిఐ అనుమతి లేకుండా డ్రింకుల లేబుల్స్​‍ మీద ఓఆర్‌ ఎస్ అని వాడకూడదు. – ఓఆర్‌ ఎస్ తీయగా ఉండదు.డబ్ల్యుహెచ్వొ రికమెండెడ్‌ ఫార్ములా ఓఆర్‌ఎస్ నే వాడాలని వైద్యులు చెప్తున్నారు.

డబ్ల్యుహెచ్‌ వొ ఓ ఓఆర్‌ఎస్ ఫార్ములా..
ఒక లీటరు నీళ్లల్లో 21.80 గ్రాముల ఎలక్ట్రోల్‌ కింద పేర్కొన్న కాన్సన్ట్రేషన్స్​‍ లో ఎలక్ట్రొలైట్స్​‍ ను అందిస్తుంది.
ఎలక్ట్రోలైట్స్​‍ ఓస్మాల్‌\లీటరు
సోడియం 75
పొటాషియం 20
క్లోరైడ్‌ 65
సిట్రేట్‌ 10
డెక్సోడ్రోస్ 75
టోటల్‌ ఓస్మాలారిటీ 245

ప్రతి శాచెట్‌ లో ఉండే కంపోజిసన్‌ (21.80 గ్రా)
సోడియం క్లోరైడ్‌ ఐ.పి 2.60 గ్రాములు
పొటాషియం క్లోరైడ్‌ ఐపి 1.50 గ్రాములు
సోడియం సిట్రేట్‌ ఐపి 2.90 గ్రాములు
డెక్సోట్రోస్ అన్హైడ్రోస్ ఐపి 13.50 గ్రాములు
ఎక్సిప్లెంట్స్​‍ 0.5

  • నాగసుందరి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News