Saturday, November 15, 2025
Homeహెల్త్Fenugreek Water: డయబెటిస్‌ రోగులకు ఈ నీరు అమృతం.. ఉదయాన్నే తాగారంటే..?

Fenugreek Water: డయబెటిస్‌ రోగులకు ఈ నీరు అమృతం.. ఉదయాన్నే తాగారంటే..?

Fenugreek Water Benefits: చాలామంది ఉదయాన్ని టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. కొందరు సమయం, సందర్భం లేకుండా టీ తాగుతుంటారు. ఇది తక్షణ ఉపశమనాన్ని అందించిన ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే మీకు తెలుసా? వంట గదిలో ఉండే మెంతి గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని! మెంతి గింజల నీరు అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ మసాలా పదార్థం ఆహార రుచిని పెంచడమే కాకుండా, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీని నీటిని తాగడం ద్వారా ఊబకాయం నుండి డయాబెటిస్ వరకు అనేక సమస్యలను తొలగించవచ్చు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

మెంతి నీరు ఎందుకు ప్రయోజనకరం?

మెంతి గింజలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగదు. దీనితో పాటు, మెంతిలో గెలాక్టోమన్నన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కడుపును చాలా సమయం నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా పదే పదే తినడం నివారించవచ్చు.

మెంతికూర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. మెంతికూర నీరు మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

2. బరువు తగ్గడంలో మెంతి నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

3.ఈ నీరు మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగడం ద్వారా జీర్ణక్రియ మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.

4. ఉదయం మెంతి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.

5. మెంతి నీరులో లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా, జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

మెంతి నీటిని ఎలా తయారు చేయాలి?

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతులు నానబెట్టాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత, ఈ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. కావాలంటే నానబెట్టిన మెంతులు కూడా నమిలి తినవచ్చు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad