Sunday, February 8, 2026
Homeహెల్త్Fiber: జీర్ణక్రియకు ఫైబర్‌ మ్యాజిక్‌ తో సెట్‌!

Fiber: జీర్ణక్రియకు ఫైబర్‌ మ్యాజిక్‌ తో సెట్‌!

Fiber rich foods: మన శరీరంలోని అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేయాలంటే పొట్ట ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుంది. వైద్య నిపుణులు మన పొట్టను రెండో మెదడుగా పేర్కొంటారు. కారణం మన మానసిక స్థితి నుంచి శారీరక శక్తి వరకు చాలా అంశాలు జీర్ణవ్యవస్థతో నేరుగా సంబంధం కలిగి ఉండటమే. పొట్ట సక్రమంగా పనిచేస్తే మన రోజువారీ పనులు ఉత్సాహంగా సాగుతాయి. రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా కనిపిస్తుంది.

- Advertisement -

గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం..

అయితే ప్రస్తుతం ఉన్న వేగవంతమైన జీవనశైలి వల్ల చాలా మంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బయట ఆహారం అధికంగా తీసుకోవడం ప్రాసెస్ చేసిన పదార్థాలపై ఆధారపడటం సమయానికి తినకపోవడం వంటి అలవాట్లు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. ఈ సమస్యల వెనుక ఒక ప్రధాన కారణం ఉందని గ్యాస్ట్రో నిపుణులు చెబుతున్నారు. అదే మన ఆహారంలో ఫైబర్ పరిమాణం తగ్గిపోవడం.

Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-blueberries-for-women-immunity-heart-and-diabetes/

ఫైబర్ అనేది జీర్ణక్రియకు..

ఫైబర్ అనేది జీర్ణక్రియకు అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థం. ఇది ఆహారం పొట్టలో సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. అలాగే మన పొట్టలో ఉండే మంచిబ్యాక్టీరియాకు ఇది ఇంధనంలా పనిచేస్తుంది. ఈ మంచిబ్యాక్టీరియా బాగా పనిచేసినప్పుడే జీర్ణవ్యవస్థ శుభ్రంగా ఉంటుంది. ప్రముఖ గ్యాస్ట్రో స్పెషలిస్ట్ డాక్టర్ పాల్ సాధారణంగా మన వంటింట్లో లభించే కొన్ని ఆహార పదార్థాలతోనే పొట్టను సహజంగా శుభ్రం చేసుకోవచ్చని వివరించారు.

వేయించిన శనగలు..

డాక్టర్ పాల్ చెప్పిన ప్రకారం ఫైబర్ అధికంగా ఉండే ఆహారం రోజువారీ ఆహారంలో భాగమైతే మందుల అవసరం తగ్గుతుంది. ఈ ఆహారాలు తక్కువ ఖర్చుతో సులభంగా దొరికేవే కావడం విశేషం. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది వేయించిన శనగలు. ఇవి చిన్నగా కనిపించినా పోషక విలువల్లో చాలా గొప్పవి. ప్రతి వంద గ్రాముల శనగల్లో సుమారు పదిహేడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉండే కరగని ఫైబర్ పొట్ట కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ కూడా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. రోజువారీ చిరుతిండిగా లేదా భోజనంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నల్ల మినుములు..

ఇక నల్ల మినుములు మన ఇళ్లలో తరచూ వాడే పప్పుదినుసు. ఒక కప్పు నల్ల మినుముల్లో సుమారు పదహారు గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇందులో కరిగే ఫైబర్ కరగని ఫైబర్ రెండూ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తుంది. ఇవి పొట్టలో ఉన్న మంచిబ్యాక్టీరియాను పెంచుతాయి. అన్నంతో పాటు లేదా ఇతర వంటకాల్లో భాగంగా తీసుకుంటే జీర్ణక్రియతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి.

చియా విత్తనాలు..

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మరో పదార్థం చియా విత్తనాలు. ఇవి ఇప్పుడు సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందాయి. రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాల్లో దాదాపు పది గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి నీటిలో లేదా పెరుగులో కలిసినప్పుడు జెల్‌లా మారుతాయి. ఈ లక్షణం వల్ల పొట్టలో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. డాక్టర్ పాల్ సూచన ప్రకారం పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండే

పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిలో రాస్ప్‌బెర్రీస్ ముఖ్యమైనవి. ఇవి చిన్న పరిమాణంలో ఉన్నా పోషక విలువల్లో తగ్గవు. ఒక కప్పు రాస్ప్‌బెర్రీస్‌లో సుమారు ఎనిమిది గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇవి పొట్టలోని మంచిబ్యాక్టీరియాకు సహాయపడటమే కాకుండా శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. రోజువారీ ఆహారంలో స్మూతీలు లేదా ఓట్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/is-frozen-chicken-safe-for-health-facts-you-should-know/

జామ ..

మన దేశంలో తక్కువ ఖర్చుతో సులభంగా దొరికే పండ్లలో జామ ఒకటి. ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉండే ఈ పండు మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఎంతో ఉపయోగకరం. రోజుకు ఒక జామ పండు తినడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులోని సహజ పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News