Friday, November 22, 2024
Homeహెల్త్Fingers neatness: చేతి వేళ్లు, మోచేతులు అందంగా..

Fingers neatness: చేతి వేళ్లు, మోచేతులు అందంగా..

మనం చేసే పనులన్నీ వేళ్లతోనే చేస్తాం మరి వాటి రక్షణ-అందం కోసం ఏం చేస్తున్నారు?

వేళ్లు, వాటి జాయింట్లు నల్లగా ఉన్నాయా?
ముఖం, జుట్టు, చర్మం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. డెయిలీ స్కిన్ కేర్ ఫాలో అవుతాం. జుట్టు విషయంలో హెయిర్ కేర్ అనుసరిస్తాం. కానీ నల్లగా ఉండే వేళ్లు, జాయింట్స్ విషయంలో శ్రద్ధ వహించం. వీటిని మెరిసేలా చేయడానికి కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు ఉన్నాయి. నల్ల మచ్చలు లేని నాజూకైన చేతులు అందమైన ముఖం మల్లే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చేతి వేళ్లు, వాటి జాయింట్లల్లో ఉండే బొడిపల మీద నల్లదనం ఉండకుండా జాగ్రత్త చూసుకోకపోతే చేతులు చాలా అసహ్యంగా కనిపిస్తాయి. అందుకే వీటి విషయంలో కూడా శ్రద్ధ చూబించాల్సిన అవసరం ఎంతో ఉంది.

- Advertisement -

ఉదాహరణకు మన చేతులు నిత్యం సూర్యరశ్మికి గురవుతాయి. రకరకాల రసాయనాల బారిన పడుతుంటాయి. అంటే బట్టలు ఉతికేటప్పుడు, అంటగిన్నెలు తోమేటప్పుడు అందుకోసం ఉపయోగించే సోపులు, సర్ఫ్ ల్లో ఉపయోగించే రసాయనాలు చేతి వేళ్ల చర్మంపై ఎంతో దుష్ప్రభావం చూపుతాయి. బ్లీచింగ్ పౌడర్ ని బట్టలు ఉతికేటప్పుడు వాడుతుంటాం. వీటన్నింటి ప్రభావం చేతి వేళ్ల మీద పడుతుంది. దాంతో అవి నల్లగా తయారవుతాయి. అందుకే వీటి విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలి. ఈ సమస్య పరిష్కారం కోసం రసాయనాలకు తావులేని సహజసిద్ధమైన వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. చేతి వేళ్ళ జాయింట్లపై ఉండే నల్లదనాన్ని పోగొట్టడంలో బాదం, పెరుగు పేస్టు బాగా పనిచేస్తుంది.

ఇందుకోసం ఒక టీస్పూన్ బాదం పొడి, రెండు టేబుల్ సపూన్ల పెరుగు తీసుకుని రెండింటినీ బాగా కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. తర్వాత వేళ్ల జాయింట్లను శుభ్రంగా కడుక్కొని నల్లగా ఉన్న బొడిపలపై ఈ పేస్టును అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతి వేళ్లను కడుక్కునేటప్పుడు రెండు నిమిషాలు జాయింట్లను మసాజ్ చేయాలి. తర్వాత వేళ్లను పొడిగా తుడుచుకుని వాటిపై మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి. ఇంకో చిట్కా ఏమిటంటే వేళ్లపై ఉండే నల్లదనం పోవడానికి సమానపాళ్లల్లో తేనె, నిమ్మరసం తీసుకుని పేస్టులా చేయాలి. దాన్ని వేళ్లపై నల్లదనం ఉన్న చోట రాసి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా పది లేదా పదిహేను రోజుల పాటు చేస్తే వేళ్ల మీద ఉండే స్కిన్ టోన్ లో మంచి మార్పును చూడగలరు. వంటింట్లో తయారుచేసే మరో స్ర్కబ్ చక్కెర, ఆలివ్ ఆయిల్ పేస్టు. ఇది కూడా నల్లని వేళ్లపై, జాయింట్లపై బాగా పనిచేస్తుంది.

ఇందుకోసం ఒక టీస్పూను షుగర్, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఆ పేస్టును నల్లగా ఉన్న చోట రాసి పది నిమిషాల పాటు రబ్ చేయాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత వేళ్లను నీళ్లతో శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకుని వేళ్లపై మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి. పాలు, బ్రెడ్ కలిపి చేసిన స్క్రబ్ కూడా చేతివేళ్లపై ఏర్పడ్డ నల్లదనాన్ని బాగా పోగొడుతుంది. నల్లగా ఉన్న వేళ్ల జాయింట్ల మీద కూడా ఈ స్క్రబ్ బాగా పనిచేస్తుంది. పాలల్లో ఒక బ్రెడ్ ముక్కను కొద్దిసేపు నానబెట్టి తర్వాత వేళ్లపై నల్లగా ఉన్నచోట దానితో కొద్దిసేపు రుద్దాలి. తర్వాత నీళ్లతో ఆ ప్రదేశాన్ని బాగా కడుక్కోవాలి. ఇలా నిత్యం కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వేళ్ల జాయింట్లలోని నల్లదనాన్ని పోగొట్టే మరో సహజ చిట్కా ఉంది. బాదం నూనె, అలొవిరా జెల్ రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని నల్లగా ఉన్న వేళ్ల జాయింట్ల మీద అప్లై చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. అర టీస్పూను బాదం నూనె, ఒక టీస్పూన్ తాజా అలొవిరా జెల్ తీసుకుని పేస్టులా చేయాలి. దాన్ని నల్లగా ఉన్న చోట అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి.

మర్నాడు పొద్దున్న నీళ్లతో వేళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం చూస్తారు. బాదం, పాలు స్క్రబ్ కూడా వేళ్లపైన, జాయింట్లలో ఏర్పడ్డ నల్లదనాన్ని పోగొడుతుంది. కచ్చాపచ్చాగా కొట్టిన బాదం పలుకులు, ఒక టేబుల్ స్పూన్ పాల మీగడ తీసుకుని స్క్రబ్ లా చేయాలి. వేళ్లపై నల్లగా ఉన్న ప్రదేశంలో ఈ స్క్రబ్ ను రాసి ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీళ్లతో వేళ్లను శుభ్రంగా కడగాలి. చర్మానికి సాంత్వననిచ్చే బాదం, మాయిశ్చరైజింగ్ గుణాలు కల పాలు రెండూ కలిసి వేళ్ల మీద ఏర్పడ్డ నల్లదనాన్ని పోగొట్టి వాటిని మెరిసేలా చేస్తాయి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మీ వేళ్లు మెరిసిపోతాయనడంలో సందేహం లేదు. ఇందులో పసుపు కూడా చేరిస్తే మరింత మంచి ప్రయోజనాలు పొందుతారు.

చక్కెర, గ్లిజరిన్, నిమ్మరసం మూడింటినీ కలిపి తయారుచేసే స్క్రబ్ ఉంది. ఇది నల్ల మచ్చలు పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ చక్కెర, ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒక నిమ్మకాయను పిండి రసం తీసి ఆ మూడింటినీ కలిపి స్క్రబ్ లా చేసి దాన్ని వేళ్లపై కాసేపు సున్నితంగా రబ్ చేయాలి. తర్వాత పదిహేను నిమిషాల పాటు వేళ్ల మీద ఈ స్క్రబ్ ను అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తూ పోతే మంచి ఫలితాలు చూడొచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News