Thursday, November 21, 2024
Homeహెల్త్Fitness without gym: జిమ్ కి వెళ్లడం లేదని బాధపడిపోతున్నారా?

Fitness without gym: జిమ్ కి వెళ్లడం లేదని బాధపడిపోతున్నారా?

ఏం చేస్తే మనం యాక్టివ్ గా డే అంతా ఉండగలమో మీకు ఐడియా ఉందా? కొన్ని పనులు మీరు వితౌట్ ఫెయిల్ చేస్తే చాలా ఉల్లాసంగా ఉంటారు. కానీ చాలామంది అయ్యో నేను జిమ్ కు కూడా వెళ్లట్లేదు కదా ఎలా అని తెగ ఇదైపోతుంటారు. జిమ్ కి వెళ్లడం లేదని బాధపడిపోతున్నారా? అవసరం లేదు. కింద చెప్పిన టిప్స్ నిత్యం పాటించి చూడండి.

- Advertisement -

వీటితో ఆరోగ్యంగానే కాకుండా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. అవేమిటంటే…

 ఎక్కువసార్లు మేడ మెట్లు ఎక్కడం, దిగడం వల్ల కాళ్లల్లోని కండరాలకు బాగా వ్యాయామం అయి

బలంగా తయారవుతాయి. కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుంటుంది. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి ఉంటారు. శరీర కింది భాగం శక్తివంతంగా తయారవుతుంది.

 స్కిప్పింగ్ అందరికీ తెలిసిన ఆటే. దీన్ని రోజూ కాసేపు ఆడితే మీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. శరీరంలోని కాలరీలు కరుగుతాయి. బరువు తగ్గుతారు. ఎముకలు కూడా శక్తివంతంగా తయారవుతాయి. కాళ్ల కండరాలు ద్రుఢమవుతాయి.

 హైకింగ్ కూడా శరీరానికి ఎంతో మంచిది. ఇది మంచి కార్డియోవాస్కులర్ ఎక్సెరసైజ్ కూడా. గుండెని

ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఒత్తిడి, యాంగ్జయిటీ వంటి సమస్యలు మీ దరిచేరవు. హైకింగ్ వర్కవుట్ లా ఉండదు. దీన్ని హాయిగా ఆస్వాదిస్తూ చేసుకోవచ్చు. కాళ్లు సన్నగా ఉన్నవారు, శరీరం బలంగా ఉండాలని కోరుకునేవారు హైకింగ్ చేయాలి.

 వాల్ స్ట్రెచెస్ కూడా శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా కాళ్లను గోడకు ఆనించి

కాసేపు ఉంచడం శరీరంపై మంచి ఎఫెక్టును చూపుతుంది. ఈ వ్యాయామం మెదడును రిలాక్సింగ్

గా ఉంచడమే కాదు ఒళ్లు నొప్పులను తగ్గిస్తుంది. ధైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరాన్ని

ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది.

 డాన్సింగ్ కూడా మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. కుటుంబసభ్యులతో, స్నేహితులతో

డాన్సింగ్ చేస్తే అది మీకు ఇచ్చే ఫన్ ఎంతో. డాన్స్ మీకు కావాలసినంత హుషారును ఇస్తుంది. డాన్స్

శరీర బరువును తగ్గించడమే కాదు గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా

ఉంచుతుంది. ఒత్తిడిని పోగొడుతుంది. డిప్రషన్ కు లోనుకారు. అంతేకాదు ఇది శరీరాన్ని బ్యాలెన్సింగ్ గా

ఉంచుతుంది.

 నిత్యం నడవడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్లకు, పొట్టకు, ఊపిరితిత్తులకు నడక చేసే మేలు ఎంతో. రోజూ నడవడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. శరీర కదలికలు సైతం వేగంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News