Healthy Weight Loss Tips: ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అనేది చాలా మంది కోరుకునే లక్ష్యం. బరువు తగ్గడం అంటే సన్నబడటం మాత్రమే కాదు ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా మెరుగుపరుచుకోవడమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఓపిక అవసరం. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.
1.లక్ష్యాలను నిర్దేశించుకోండి: బరువు తగ్గే ముందు మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో లక్ష్యాన్ని పెట్టుకోండి. వారానికి ఒక కిలో బరువు తగ్గడం మంచిది. అలాగే చిన్న చిన్న వ్యాయాలు చేయండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు.
- సమతుల్య ఆహారం: బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే మితంగా ఆహారాన్ని తీసుకోండి అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. తక్కువ క్యాలరీలు కలిగిన పదార్థాలను తీసుకోండి.
3 ప్రోటీన్ ఫూడ్స్: అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోండి. చేపలు, పప్పులు, చికెన్ వంటి పదాలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల నిర్మాణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
4 ఫైబర్ లభించే పదార్థాలు: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే పండు, తృణధాన్యాలు, కూరగాయాలు తీసుకోవడం ముఖ్యం. ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అలాగే అతిగా తినకుండా ఉంటారు.
5 ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి ఆహారపదార్థాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోండి. ఇవి శరీరానికి సహాయపడుతాయి.
6 ప్రాసెస్ చేసిన ఆహారం: బరువు తగ్గాలంటే ముందుగా ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు,స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి. ఇందులో అధిక కేలరీలు ఉండటం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. వీటిని బదులు పండ్లు, సలాడ్ తీసుకోండి.
7 నీరు సరిపడ తాగండి: శరీరానికి కావాల్సినంత నీరు తాగడం ముఖ్యం. నీరు తాగడం వల్ల తక్కువ ఆహారం తీసుకోవచ్చు. అంతే కాకుండా జీవక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పంపవచ్చు. రోజుకు కనీసం 8−10 గ్లాసుల నీరు తాగడం మంచిది.
- క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రించుకోవచ్చు. అలాగే వారంలో కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం లేదా వ్యాయామం చేయండి.
9 ఒత్తిడి తగ్గించుకోండి: ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం. ఒత్తిడి ఎక్కువగా ఉండే కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల పొట్ట చుట్టూ కొవ్వు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/news/what-are-the-health-tips-must-follow-by-diabetes/: Weight Loss Tips: తక్కువ సమయంలో ఇలా ఈజీగా బరువు తగ్గండి..

