Bitter Gourd Cooking Tips: కాకరకాయ రుచిలో చేదుగా ఉండవచ్చు, కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అందుకే దీని ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. కాకరకాయలో ఉండే అంశాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరం. దీని తింటే సుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కూడా! ఇది లివర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అందమైన చర్మాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.
కాకరకాయతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలా మంది దీని తినడానికి ఇష్టపడరు. దీనికి ప్రధాన కారణం దాని చేదు. అయితే కాకరకాయ చేదును నివారించడానికి కొన్ని సాధారణ గృహ నివారణలలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా దాని పోషక విలువలతో రాజీ పడకుండా కాకరకాయ చేదును గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పుడు కాకరకాయ చేదును తొలగించడానికి సులభమైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.
కాకరకాయలో ఉప్పు కలపడం: కాకరకాయను సన్నగా కోసి, దానిపై కొద్దిగా ఉప్పు వేయాలి. ఇలా వీటిని దాదాపు 30 నిమిషాలు పాటు మూతపెట్టి ఉంచాలి. ఈ చిట్కా కాకరకాయ చేదు రసాన్ని బయటకు తీస్తుంది. తరువాత, దానిని బాగా క్లీన్ చేయాలి. ఈ పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందినది.
గోరువెచ్చని నీటిలో నానబెట్టడం: గోరువెచ్చని నీటిలో తరిగిన కాకరకాయను 15-20 నిమిషాలు నానబెట్టాలి. తద్వారా కాకరకాయ చేదు గణనీయంగా తగ్గుతుంది. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా జోడించవచ్చు.
నిమ్మరసం జోడించడం: తరిగిన కాకరకాయలపై నిమ్మరసం చిలకరించి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. నిమ్మకాయ పుల్లని రుచి చేదును సమతుల్యం చేస్తుంది.
వెనిగర్, చక్కెరను వాడకం: చేదును నివారించడానికి కాకరకాయలో వెనిగర్ లేదా కొద్దిగా చక్కెర కలిపి కూడా ఉంచవచ్చు. వెనిగర్ ఆమ్ల స్వభావం, చక్కెర తీపి చేదును తగ్గించడానికి సహాయపడుతుంది.
పెరుగులో మ్యారినేట్ చేయడం: కాకరకాయను పెరుగులో నానబెట్టి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం రుచిని మెరుగుపరచడమే కాకుండా చేదుకాయను మృదువుగా చేస్తుంది.
విత్తనాలను తీసివేయడం: కాకరకాయ విత్తనాలు, లోపలి తెల్లటి గుజ్జు ముఖ్యంగా చేదుగా ఉంటుంది. ఈ విత్తనాలను తొలగించడం వల్ల వంటకం రుచి మెరుగుపడుతుంది.
మజ్జిగలో నానబెట్టడం: కాకరకాయను మజ్జిగలో నానబెట్టడం వల్ల దాని చేదు గణనీయంగా తగ్గుతుంది. ఈ పద్ధతి కాకరకాయను తేలికగా, జీర్ణం కావడానికి సులభతరం చేస్తుంది.


