Thursday, March 12, 2026
Homeహెల్త్Vitamin B12: సరిపడా విటమిన్ B-12 కోసం వీటిని తీసుకోండి..

Vitamin B12: సరిపడా విటమిన్ B-12 కోసం వీటిని తీసుకోండి..

Vitamin B12 Foods: శరీరంలో సరిపడా విటమిన్ B12 లెవెల్స్ ఉండడం ఎంతో అవసరం. వీటిని మెయింటైన్ చేయాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. విటమిన్ B12 అనేది నరాల ఆరోగ్యం, రక్త కణాల తయారీకి ఎంతో అవసరం. అలాగే, ఇది శరీర కండరాలను పెంచి తగినంత శక్తిని అందించడంలో సాయపడుతుంది. అయితే చాలామంది విటమిన్ B12 కేవలం మాంసాహారంలోనే సమృద్ధిగా ఉంటుందనికుంటారు. కానీ, శాఖాహారంలోనూ విటమిన్ B12ను అందించే పదార్థాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

- Advertisement -

ఆవు పాలు
ఒక గ్లాస్ ఆవు పాలు లేదా బర్రె పాలు తీసుకుంటే విటమిన్ B12 బాగా అందుతుంది. ఈ పాలలో 1.1 మైక్రోగ్రాముల B12 ఉంటుంది. రోజుకి 2.4 మైక్రోగ్రాముల B12 అవసరమైతే, 40 శాతం ఇదే కవర్ చేస్తుంది. ఇందులో పసుపు కలుపుకుని తాగితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

యోగర్ట్
యోగర్ట్ B12 సమృద్ధిగా ఉంటుంది. ఒక సర్వింగ్ లో 0.6-1 మైక్రోగ్రామ్స్ B12 ఉంటుంది. కాబట్టి, దీనిని డైట్ లో చేర్చుకోవడం వల్ల B12 లెవెల్స్ మైంటైన్ చేయవచ్చు.

also read:Moringa Powder: బరువు తగ్గడం నుంచి డయాబెటిస్ వరకు..మునగాకు పొడి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

పనీర్
ఇక 100 గ్రాముల పన్నీర్ లో 0.7-0.8 మైక్రోగ్రాముల B12 కంటెంట్ ఉంటుంది. దీంతోపాటు ఇందులో 18- 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి, ఇది మంచి ఛాయిస్.

ఫోర్టిఫైడ్ సిరల్స్
ఫోర్టిఫైడ్ సిరల్స్ లోనూ సరిపడా B12 కంటెంట్ ఉంటుంది. ఇందులో ఒక సర్వింగ్ కు 1-2.5 మైక్రోగ్రాముల B12 అందుతుంది. కాబట్టి, వీటిని డైట్ లో భాగం చేసుకుంటే మంచిది.

పులియబెట్టిన ఆహారాలు
ఇడ్లి, దోశ, కంబూచ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలలో విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. పైగా ఈ ఆహారాలు తినడం జీర్ణక్రియను కూడా బలపరుస్తాయి.

సోయాబీన్
సోయాబీన్స్‌లో విటమిన్ బి-12 సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ B-12 కోసం సోయా పాలు, టోఫు లేదా సోయాబీన్ నూనెను వాడవచ్చు.

ఓట్స్
ఓట్స్ విటమిన్ బి-12కి మంచి మూలం. ఓట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి బరువును తగ్గించడమే కాకుండా ఫైబర్, విటమిన్లను పుష్కలంగా అందిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News