Foods To Avoid Knee Pain:ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు పెద్ద సమస్యగా మారాయి. కొంతకాలం క్రితం వరకు ఒకప్పుడు ఈ సమస్య ఎక్కువగా వృద్ధులను మాత్రమే వేధిస్తుండేది. కానీ ఇప్పుడు ఇరవై, ముప్పై ఏళ్ల వయసు గలవారిలో కూడా ఈ సమస్య పెరుగుతోంది. నిపుణుల చెబుతున్న దాని ప్రకారం, జీవనశైలి మార్పులు, వ్యాయామం లోపం, ముఖ్యంగా తినే ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారాయి.
మోకాళ్ల కీళ్లను దెబ్బతీసి…
రోజువారీ తినే ఆహారంలో కొన్ని పదార్థాలు శరీరంలో వాతం, మంటను పెంచుతాయి. ఈ పరిస్థితులు మోకాళ్ల కీళ్లను దెబ్బతీసి నొప్పిని మరింత తీవ్రమవ్వడానికి దారితీస్తాయి. కాబట్టి ఈ రకమైన ఆహారాల్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మోకాళ్ల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Also Read: https://teluguprabha.net/health-fitness/health-benefits-of-eating-two-black-peppers-daily/
ఉప్పు…
ముందుగా ఉప్పు గురించి చెప్పుకోవాలి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు శరీరంలో నీటి నిల్వలను పెంచుతాయి. దీని వలన కీళ్ల వద్ద వాపు ఏర్పడి నొప్పి మరింత పెరుగుతుంది. కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటే రుచిగా ఉంటుందని భావించి ఎక్కువగా వేస్తుంటారు. కానీ మోకాళ్ల సమస్యలు ఉన్నవారు ఈ అలవాటును తగ్గించకపోతే నొప్పి తీవ్రత మరింత పెరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం, రోజువారీ ఆహారంలో ఉప్పును చాలా మితంగా మాత్రమే వాడటం మంచిది.
చక్కెర…
చక్కెర కూడా మోకాళ్ల నొప్పిని ప్రభావితం చేసే ఒక ప్రధాన కారణం. పంచదార ఉన్న పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పెరుగుదల శరీరంలో మంటను ఎక్కువ చేస్తుంది. దీని ఫలితంగా కీళ్ల వద్ద వాతం, నొప్పి పెరుగుతాయి. కాబట్టి చక్కెర ఉన్న పానీయాలు, స్వీట్లు, డెజర్ట్లు వంటివి వీలైనంత దూరంగా ఉంచడం అవసరం.
పాల ఉత్పత్తులు…
తరువాతి అంశం పాల ఉత్పత్తులు. చాలా మందికి పాలు, పెరుగు, వెన్న ఆరోగ్యానికి మంచివని భావన ఉంటుంది. కానీ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి ఇవి ప్రతికూలంగా పనిచేయవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్లు శరీరంలో వాతం ప్రతిచర్యలను పెంచుతాయి. దీంతో కీళ్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. అందువల్ల ఈ సమయంలో పాల ఉత్పత్తులను తగ్గించడం లేదా కొన్ని రోజులు మానేయడం మంచిది.
ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్…
ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ సమస్యను మరింత పెంచే అంశంగా గుర్తించారు. ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వలన శరీరంలో వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే మోకాళ్ల కీళ్లలోని కార్టిలేజ్ బలహీనమై నొప్పిని కలిగిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిలో ఓమేగా 6 అధికంగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వీటికి బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా ఫ్లాక్సీడ్ ఆయిల్ వాడటం ఆరోగ్యకరంగా ఉంటుంది.
వేయించిన ఆహారాలు…
వేయించిన ఆహారాలు కూడా మోకాళ్ల ఆరోగ్యానికి శత్రువుల్లాంటివి. ఈ రకమైన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల వద్ద వాపు కలిగించి నొప్పిని పెంచుతాయి. అలాగే వేయించిన పదార్థాలు శరీర బరువును కూడా పెంచుతాయి. బరువు ఎక్కువైతే మోకాళ్లపై ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. దీంతో నొప్పి తగ్గక మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. కాబట్టి బజ్జీలు, పకోడీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాలను పూర్తిగా మానేయడం ఉత్తమం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు…
ఇక ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ పదార్థాలు కూడా మోకాళ్ల నొప్పులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను పెంచడంతో పాటు కీళ్ల బలాన్ని తగ్గిస్తాయి. ఫాస్ట్‌ఫుడ్, ఇన్‌స్టంట్ నూడుల్స్, చిప్స్ వంటివి దీర్ఘకాలంగా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం.
Also Read: https://teluguprabha.net/viral/deepavali-village-story-srikakulam-kings-gratitude-turned-into-name/
మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ రకమైన ఆహారాలకు దూరంగా ఉండటం మాత్రమే కాకుండా, శరీరానికి ఉపయోగకరమైన ఆహారాలను చేర్చుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, విత్తనాలు, పప్పులు, తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్లు మోకాళ్ల బలం పెంచుతాయి. నీటిని సమృద్ధిగా తాగడం కూడా కీళ్లలోని లూబ్రికేషన్‌ను మెరుగుపరుస్తుంది.


